బీజింగ్: ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఫోర్డ్ మోటార్స్ కంపెనీ లిమిటెడ్.. లేఆఫ్ ప్రకటించనుంది. ఉద్యోగుల తొలగింపును చేపట్టబోతోంది. కంపెనీ ఖర్చును తగ్గించుకునే చర్యల్లో భాగంగా ఈ నిర్ణయాన్ని తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ ఇప్పటికిప్పుడు భారత్‌పై పడే ప్రమాదం లేదు. తొలిదశలో చైనాలో లేఆఫ్ అమలు చేయాలని ఫోర్డ్ మోటార్స్ కంపెనీ ప్రణాళికలను రూపొందించుకున్నట్లు తెలుస్తోంది.
చైనా ఆటోమొబైల్ సెగ్మెంట్‌పై అమెరికాకు చెందిన ఫోర్డ్ మోటార్స్‌కు సుదీర్ఘకాలంగా ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ వస్తోంది. ఫోర్డ్ కార్లకు అక్కడ భారీగా డిమాండ్ ఉండటమే దీనికి కారణం. 2016 నుంచీ క్రమంగా అక్కడ ఫోర్డ్ కార్ల అమ్మకాలు తగ్గుముఖం పడుతూ వస్తోన్నాయి. గత ఏడాది కార్ల అమ్మకాలు సగానికి సగం తగ్గాయి. చైనాలో కార్ల అమ్మకాల్లో 4.6 శాతం వరకు ఉన్న ఫోర్డ్ కంపెనీ వాటా గత ఏడాది దారుణంగా పడిపోయింది. 2.17 శాతానికి క్షీణించాయి.

దీనితో ఖర్చును నియంత్రించుకోవడంలో భాగంగా ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను చేపట్టనుంది. తొలిదశలో కనీసం 1,300 మంది ఉద్యోగులపై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. దీనిపై బ్లూమ్‌బర్గ్ వెబ్‌సైట్ ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. చైనాలో ఎలక్ట్రికల్ కార్ల వినియోగం పెరుగుతోందని, సంప్రదాయ కార్ల కొనుగోళ్లు భారీగా తగ్గడానికి ఇదే ప్రధాన కారణమని విశ్లేషించింది.
పర్యావరణానికి హాని కలిగించని విధంగా రూపుదిద్దుకుంటోన్న ఎలక్ట్రికల్ కార్లను కొనుగోలు చేయడానికి చైనీయులు మొగ్గు చూపుతున్నారని, ఎలాన్ మస్క్‌కు చెందిన టెస్లా వంటి లగ్జూరియస్ ఎలక్ట్రికల్ కార్ల వైపు చైనీయులు ఆకర్షితులవుతున్నారని అభిప్రాయపడింది. చైనాలో తమ వ్యాపార కార్యకలాపాలను కొనసాగిస్తోన్న కార్ల తయారీ కంపెనీలన్నీ ఇలాంటి నిర్ణయాలనే తీసుకోవచ్చని అంచనా వేసింది.

ప్రపంచవ్యాప్తంగా ఫోర్డ్ కంపెనీలో 1,73,000 మంది ఉద్యోగులు పని చేస్తోన్నారు. ఇదివరకే యూరప్ దేశాల్లో లేఆఫ్స్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. 3,800 మంది ఉద్యోగులను తొలగించింది. ఎలక్ట్రికల్ కార్ల తయారీకి భారీ ఎత్తున డిమాండ్ లభిస్తోన్న నేపథ్యంలో ఈ సెగ్మెంట్‌లో ఫోర్డ్ కూడా అడుగు పెట్టబోతోంది. 2026 నాటికి 50 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేయనుంది.


Click it and Unblock the Notifications