భారత దేశం ఇప్పుడు పర్యావరణ పరిరక్షణ దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పుడు భారత్ నెక్స్ట్ టార్గెట్ నెట్ జీరో. దీని గురించి ప్రపంచ దేశాలన్నీ ఎప్పటి నుంచో మాట్లాడుతున్నాయి. అయితే
పర్యావరణ మార్పులు (Climate Change) ఇప్పుడు కేవలం మాటలకే పరిమితం కాలేదు. భారతదేశం 2070 నాటికి 'నెట్-జీరో' సాధించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. నెట్ జీరో(Net Zero) అంటే కర్బన ఉద్గారాలు సున్నా అని అర్థం. ఈ ప్రయాణంలో 2025 ఒక పునాది అయితే రాబోయే 2026 సంవత్సరం ఒక టర్నింగ్ పాయింట్‌గా మారబోతోందని నిపుణులు చెబుతున్నారు. అసలు ఈ నెట్-జీరో అంటే ఏంటి? దీనివల్ల మన వ్యాపారాలు, నగరాలు ఎలా మారబోతున్నాయి? ఇప్పుడు చూద్దాం.

వ్యాపార బాధ్యతగా పర్యావరణం
ఒకప్పుడు పర్యావరణం గురించి మాట్లాడటం అంటే కేవలం మొక్కలు నాటడం అనుకునేవారు. కానీ ఇప్పుడు అది ఒక బిజినెస్ స్ట్రాటజీగా మారింది. సెబీ (SEBI) తెచ్చిన కొత్త నిబంధనల ప్రకారం.. పెద్ద కంపెనీలు తమ వ్యాపారం వల్ల పర్యావరణానికి ఎంత నష్టం జరుగుతోంది? దాన్ని ఎలా తగ్గిస్తున్నారు? అనే డేటాను ఇన్వెస్టర్లకు చూపించాల్సి ఉంటుంది. అంటే, లాభాలతో పాటు పర్యావరణ పరిరక్షణ కూడా కంపెనీల బాధ్యతగా మారింది.
2026 ఎందుకు స్పెషల్?
2025లో నియమ నిబంధనలు ఖరారైతే.. 2026 నుండి వాటి అమలు మొదలవుతుంది.
- కార్బన్ క్రెడిట్ ట్రేడింగ్: కంపెనీలు విడుదల చేసే కాలుష్యానికి ధర చెల్లించాల్సి ఉంటుంది. తక్కువ కాలుష్యం చేసే కంపెనీలకు ఇది లాభదాయకంగా మారుతుంది.
- ట్రాన్స్‌పరెన్సీ: కేవలం సొంత కంపెనీలోనే కాకుండా తమకు ముడి సరుకులు సరఫరా చేసే చిన్న వ్యాపారాల వద్ద కూడా కాలుష్యం తగ్గించేలా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.
చిన్న నగరాల్లో పెద్ద మార్పు
మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. నెట్-జీరో లక్ష్యంలో కేవలం హైదరాబాద్, ముంబై వంటి మెట్రో నగరాలే కాకుండా.. టైర్-2 మరియు టైర్-3 నగరాలు కూడా కీలకం కాబోతున్నాయి. ఇండోర్, సూరత్, జైపూర్, కోయంబత్తూర్ వంటి నగరాలు క్లైమేట్-రెడీ మార్కెట్లుగా ఎదుగుతున్నాయి. ఇక్కడ నిర్మించే కొత్త ఫ్యాక్టరీలు, ఆఫీసులు మొదటి నుంచే తక్కువ విద్యుత్ వినియోగం, తక్కువ వ్యర్థాలను విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు.
సామాన్యులకు ఏం లాభం?
కంపెనీలు నెట్-జీరో దిశగా అడుగులు వేయడం వల్ల మనకు మెరుగైన గాలి, స్వచ్ఛమైన నీరు అందుతాయి. అంతేకాకుండా.. ఎలక్ట్రిక్ వాహనాలు, సోలార్ ఎనర్జీ వంటి రంగాల్లో లక్షలాది కొత్త ఉద్యోగాలు రాబోతున్నాయి. పూణేలోని అజింక్య డీవై పాటిల్ యూనివర్సిటీ, ముంబైలోని భారత్ డైమండ్ బోర్డ్ వంటి సంస్థలు ఇప్పటికే డేటా ఆధారితంగా కాలుష్యాన్ని ఎలా తగ్గించవచ్చో నిరూపించి చూపిస్తున్నాయి.
మొత్తంగా భారతదేశం కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా ఆచరణలో నెట్-జీరో వైపు వేగంగా దూసుకుపోతోంది. 2026లో మనం చేసే ప్రతి పని మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ పాలుపంచుకోవడం ఎంతైనా అవసరం.
More From GoodReturns

హార్ముజ్ జలసంధిని దాటిన మరో రెండు భారత LPG నౌకలు.. మరో మూడు షిప్పులు ఇంకా అక్కడే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!



Click it and Unblock the Notifications