అందుకే ఈ ఉపద్రవం: భారత్‌లో కరోనా సంక్షోభం, రఘురాం రాజన్ కీలక వ్యాఖ్యలు
కరోనా సెకండ్ వేవ్ భారత్‌ను అతలాకుతలం చేస్తోంది. ఓవైపు వేలాది మంది ప్రాణాలు తీసుకోవడంతో పాటు భారత ఆర్థిక వ్యవస్థను, వ్యక్తుల ఆర్థిక పరిస్థితిని దారుణాదిదారుణంగా దెబ్బతీసింది. కరోనా సెకండ్ వేవ్ పరిణామాలపై ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ కీలక వ్యాఖ్యలు చేశారు. దూరదృష్టిలేమికి, నాయకత్వలేమికి ఇది నిదర్శనమన్నారు. దేశంలో ప్రతిరోజు మూడున్నర లక్షల కొత్త కేసులు నమోదవుతున్నాయి. వేలాదిమంది మరణిస్తున్నారు. కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో భారత్ ఇతర దేశాలకు ఆపన్నహస్తం అందించింది. దీంతో ఇతర దేశాలు ఇప్పుడు భారత్‌కు సహకరించేందుకు ముందుకు వచ్చాయి.

ముందే గుర్తించి ఉంటే
కరోనా తిరిగి ఎందుకు పుంజుకుందో కారణాలు వెల్లడించారు రఘురాం రాజన్. 2020లో కరోనా ఉధృతమై, తిరిగి తగ్గుముఖం పట్టకపోవడానికి నాయకుల నిర్లక్ష్యమే కారణమన్నారు. సరైన నాయకత్వం లేకపోవడం, దూరదృష్టి కలిగి ఉండకపోవడం వల్ల దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోందన్నారు. మీరు ఇంకా జాగ్రత్తగా ఉండి ఉంటే మీరు కరోనా తగ్గలేదని, ప్రజలను హెచ్చరించి ఉంటే, ఇంకా కరోనా తగ్గలేదని లేదని చేయాల్సిన పని పూర్తి కాలేదని గుర్తించి ఉంటే ఇలాజరగకపోయేదన్నారు.

అప్పుడే గుర్తించాల్సింది
ప్రపంచ దేశాల్లో వైరస్ తిరిగి వచ్చిందని రఘురాం రాజన్ గుర్తు చేశారు. బ్రెజిల్ వంటి దేశాల్లో సెకండ్ వేవ్ మనం చూశామని, అప్పుడే ఈ వైరస్ రూపాంతరం చెందినట్లు గుర్తించవలసి ఉండిందన్నారు. కరోనాపై పోరులో దేశం విజయం సాధించిందని ప్రభుత్వ అధికారులు ప్రకటించారని, కానీ దేశంలో కేసులు మార్చి నుండి మళ్లీ పెరగడం ప్రారంభించాయన్నారు. ఏప్రిల్ నుండి ఇది విజృంభించిందన్నారు.

లాక్డౌన్ సూచన
ఇప్పుడు కొనసాగుతోన్న సంక్షోభం కారణంగా కొన్ని పరిశ్రమల సంస్థలు, వైద్య నిపుణులు కొన్ని వారాల పాటు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ చేయాలని పిలుపునిచ్చారు. గత ఏడాది విధించిన లాక్‌డౌన్ వల్ల దేశ ఆర్దిక వ్యవస్థ తీవ్రంగా నష్టపోయినట్లు కాబట్టి లాక్‌డౌన్ విధించకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఇప్పుడు కఠినమైన చర్యలు తీసుకోకపోతే కరోనా చేయి దాటిపోతుందని చాలామంది నిపుణులు సూచిస్తున్నారు.


Click it and Unblock the Notifications