కరోనా మహమ్మారి కారణంగా ఆదాయం లేకపోవడంతో వివిధ సంస్థలు వేతన కోత నిర్ణయం తీసుకుంటోన్న విషయం తెలిసిందే. రిలయన్స్ వంటి దిగ్గజ సంస్థలు కూడా రూ.15 లక్షలు అంతకంటే ఎక్కువ వేతనం ఉన్న వారికి వేతనంలో కోత విధించింది. ప్రయివేటురంగ బ్యాంకింగ్ కంపెనీ కొటక్ మహీంద్రా కూడా తాజాగా వేతన కోత ప్రకటించింది.

రూ.25 లక్షలకు మించి ఉంటే 10 శాతం వేతనం కోత
ఏడాదికి రూ.25 లక్షలు, అంతకుమించి వేతనం ఉన్న ఉద్యోగులకు 10 శాతం మేర కోత విధిస్తున్నట్లు కొటక్ మహీంద్ర బ్యాంకు తెలిపింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి యాజమాన్యం తమ వేతనాలలో 15 శాతం కోత విధించుకున్న కొద్ది రోజుల్లోనే ఈ నిర్ణయం వెలువడింది. ఉదయ్ కొటక్ తన వేతనాన్ని కేవలం రూ.1 మాత్రమే తీసుకోవాలని నిర్ణయించారు. 2020 మే నెల నుండి 2021 మే నెల వరకు ఇది అమలవుతుందని తెలిపింది.

కరోనా ప్రభావం ఎక్కువ కాలం
కరోనా కారణంగా బ్యాంకు ఆర్థిక కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం పడిందని, ప్రారంభంలో ఈ మహమ్మారి ప్రభావం రెండు మూడు నెలలకు పరిమితం అవుతుందని కనిపించిందని, కానీ ఇది చాలా సీరియస్ ప్రభావాన్ని ఎక్కువ కాలం చూపుతోందని, ఇది జీవితాలకు, జీవనోపాధికి నష్టాన్ని తీసుకు వస్తోందని ఉద్యోగులకు బ్యాంకు తెలిపింది.

బ్యాంకు కార్యకలాపాల పైనా ప్రభావం
కరోనా-లాక్‌డౌన్ కారణంగా గత 45 రోజులుగా ఆర్థిక కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి. ఇందులో అన్నిరకాల బ్యాంకులు కూడా ఉన్నాయి. బ్యాంకుల వంటి ఆర్థిక సేవల సంస్థలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఆర్థిక నష్టాల నుంచి బయటపడేందుకు ఒక్కో బ్యాంకు ఒక్కోరకం నిర్ణయం తీసుకుంటున్నాయి. కరోనాపై పోరుకు పీఎం కేర్స్ ఫండ్‌కు కొటక్ మహీంద్రా బ్యాంకు రూ.25 కోట్లు ప్రకటించింది. బ్యాంకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఉదయ్ కోటక్ మరో రూ.25 కోట్ల నిధి అందిస్తామని చెప్పారు.


Click it and Unblock the Notifications