ముంబై: ముంబై ప్రధాన కేంద్రంగా బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ సెగ్మెంట్‌లో అగ్రస్థానంలో కొనసాగుతోన్న కోటక్ మహీంద్ర బ్యాంక్ మేనేజ్‌మెంట్ టాప్ లెవెల్‌లో కీలక మార్పులు సంభవించే అవకాశాలు ఉన్నాయి. కోటక్ మహీంద్ర బ్యాంక్ వైస్ ఛైర్మన్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా ఉన్న ఉదయ్ కోటక్.. తన పదవి నుంచి తప్పుకోబోతున్నారని తెలుస్తోంది. ఆయన కుమారుడు, హార్వర్డ్ యూనివర్శిటీ ఆలమ్నీ జై కోటక్ ఇక సంస్థ అధిపతిగా బాధ్యతలను స్వీకరిస్తారనే ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం జై కోటక్.. 811 కో హెడ్‌గా వ్యవహరిస్తున్నారు.

జూన్ 2 నాటి ఇన్వెస్టర్ల సమావేశంలో..
జూన్ 2వ తేదీన నిర్వహించబోయే ఇన్వెస్టర్ల సమావేశంలో ఉదయ్ కోటక్.. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తోన్నాయి. తన కుమారుడు జై కోటక్‌ను సంస్థ వీసీ అండ్ సీఎండీగా పరిచయం చేస్తారని సమాచారం. ఆసియాలోనే అత్యంత ధనిక బ్యాంకర్‌గా పేరుంది కోటక్ కుటుంబానికి. దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఉదయ్ కోటక్.. తన కుమారుడికి ఈ వ్యాపార సామ్రాజ్యాన్ని అప్పగించనున్నారు.

ఆర్బీఐ ఆదేశాల మేరకు..
రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా.. ఇటీవలే కొన్ని మార్గదర్శకాలను జారీ చేసిన విషయం తెలిసిందే. బ్యాంకింగ్ సంస్థలకు 15 సంవత్సరాల పాటు పని చేసిన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు తప్పుకోవాల్సి ఉంటుందనేది ఈ మార్గదర్శకాల సారాంశం. ఇప్పటికే ఉదయ్ కోటక్.. 18 సంవత్సరాల పాటు కోటక్ మహీంద్ర బ్యాంక్ అధిపతిగా కొనసాగారు. రిజర్వ్ బ్యాంక్ తాజాగా జారీ చేసిన గైడ్‌లైన్స్ ప్రకారం.. ఆయన తప్పుకోవాల్సి ఉంటుంది. తన స్థానంలో జై కోటక్‌ను నియమించడం ఖాయంగా కనిపిస్తోంది.

ఏడాదిన్నర ముందే..
కాగా- కోటక్ మహీంద్ర బ్యాంక్ హెడ్‌గా ఉదయ్ కోటక్ కాల పరిమితి 2023 డిసెంబర్‌లో ముగియాల్సి ఉంది. ఆయన తరువాత కేవీఎస్ మణియన్ అపాయింట్ అవుతారని విశ్లేషకులు అంచనా వేశారు. ఇప్పుడు తాజా అంచనాల ప్రకారం.. వచ్చే సంవత్సరం వరకు ఉదయ్ కోటక్ వీసీ అండ్ సీఈఓ బాధ్యతల్లో ఉండకపోవచ్చని, వైదొలగడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారని తెలుస్తోంది. తన స్థానంలో జై కోటక్‌ను నియమిస్తారని చెబుతున్నారు.

సంస్థ కార్యకలాపాల్లో యాక్టివ్‌గా..
ఇన్వెస్టర్లతో నిర్వహించే సమావేశాల్లో జై కోటక్ చాలా యాక్టివ్‌గా కనిపించారని, భవిష్యత్ సీఈఓగా బాధ్యతలను చేపట్టడానికి తగిన అర్హతలు ఆయనకు ఉన్నాయనే అభిప్రాయాలు కలుగజేశారని జెఫ్పెరిస్ అనలిస్ట్స్ ప్రాఖర్ శర్మ, అభిషేక్ ఖన్నా, భాస్కర్ బసు అభిప్రాయపడ్డారు. ఇటీవలే కోటక్ మహీంద్ర బ్యాంక్ టాప్ మేనేజ్‌మెంట్ లెవెల్‌లో కొన్ని మార్పులు చేసింది. రిటైల్ బిజినెస్ హెడ్‌గా ఉన్న శాంతి ఏకాంబరాన్ని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా అపాయింట్ చేసింది.

811 టీమ్ కో హెడ్‌గా
2021లో జై కోటక్ 811 టీమ్‌లో అపాయింట్ అయ్యారు. దీనికి మనీష్ అగర్వాల్ బిజినెస్ హెడ్‌గా పని చేస్తోన్నారు. సరిగ్గా ఏడాది తరువాత అంటే ఈ సంవత్సరం జనవరిలో జై- ఈ వింగ్‌కు కో హెడ్‌గా నియమితులయ్యారు. శాంతి ఏకాంబరం సారథ్యంలో ఈ విభాగాన్ని మనీష్ అగర్వాల్-జై కోటక్ సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లారని టాప్ మేనేజ్‌మెంట్ విశ్వసిస్తోంది. ఆ అనుభవంతోనే వీసీ అండ్ సీఈఓగా బాధ్యతలను తీసుకుంటారని అంటున్నారు విశ్లేషకులు. జై కోటక్ ఇదివరకు గోల్డ్‌మన్ సాచ్స్, మెక్‌కిన్సె అండ్ కంపెనీలో కీలక హోదాల్లో పని చేశారు. హార్వర్డ్ యూనివర్శిటీ నుంచి ఎంబీఏ పూర్తి చేశారు. కొలంబియా యూనివర్శిటీలో బీఏ చేశారు.


Click it and Unblock the Notifications