Dhirubhai Birthday: భారత ఆర్థిక వ్యవస్థ పురోగతిలో భాగస్వామిగా మారిన వ్యాపారవేత్తల్లో ధీరూభాయ్ ఒకరు. చిన్న కంపెనీగా ప్రారంభమైన రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రస్తుతం దేశంలో అత్యంత విలువైన సంస్థగా కొనసాగుతోంది.
ధీరూబాయ్ పూర్తిపేరు దిరాజ్‌లాల్ హీరా చంద్ అంబానీ. ఆయన 1932 డిసెంబర్ 28న జన్మించారు. తన కెరీర్‌లో లెక్కలేనన్ని పేదలను సూపర్ రిచ్‌గా మార్చేందుకు మార్గనిర్దేశం చేశారు. స్వయం కృషితో వేసిన వ్యాపార పునాది ప్రస్తుతం ప్రపంచ గుర్తింపుతో పాటు ఆధిపత్యం చెలాయించే సంస్థగా ఎదిగింది. దీని వెనుక భార్య కోకిలాబెన్ సహకారం కూడా ఎంతో ఉందని తెలిసిన వారు చెబుతుంటారు. ధీరూభాయ్ అంబానీ-కోకిలా బెన్‌ది గొప్ప జంట.

జామ్‌నగర్‌కు చెందిన సాదాసీదా మహిళ తన భర్త జీవితంలో ముఖ్యమైన పాత్ర పోషించింది. అంబానీ గెలుపునకు కోకిలా బెన్ మద్దతిచ్చారు. ధీరూభాయ్ అంబానీ మరణానంతరం ఆమె కుమారులు ముఖేష్, అనిల్ అంబానీలు గొడవలు పడినప్పుడు తల్లిగా తన బాధ్యతను చక్కగా నిర్వహించారు. మెుదటి నుంచి కోకిలా బెన్ ఎల్లప్పుడూ మీడియాకు దూరంగా ఉంటున్నారు. తాను జామ్‌నగర్‌లో ధీరూభాయ్ అంబానీతో తన వైవాహిక జీవితం గురించి సరళంగా కొన్ని ఇంటర్వ్యూల్లో పంచుకున్నారు.
ధీరూభాయ్ తన యవ్వనాన్ని జామ్‌నగర్‌లోని మధ్యతరగతి కుటుంబంలో గడిపారు. ఇంటి పనులన్నీ కోకిలా చూసుకునేవారు. కుట్టుపని, ఎంబ్రాయిడరీ పనులు కూడా చేసేవారు. ఆడవాళ్లు ఇంటిపనిలో మెరుగ్గా ఉండాలని తమ పూర్వీకులు చెప్పేవారని కోకిలా పేర్కొన్నారు. 1955లో ధీరూభాయ్ అంబానీని పెళ్లి చేసుకున్న తర్వాత జీవితం ఇంతగా మారుతుందని అనుకోలేదని, ముంబైని మొదటిసారి చూశానని పేర్కొన్నారు. ఆ సమయంలోనే తొలిసారిగా కోకిల స్టీమర్‌లో యెమెన్‌కి వెళ్లారు.
జామ్‌నగర్‌తో పోలిస్తే యెమెన్‌లో జీవితం భిన్నంగా ఉండటంతో ఆ సమయంలో తనకు ధీరూభాయ్ భుజం తగ్గి ధైర్యం చెప్పారని వెల్లడించారు. ఆ సమయంలో తన జీవితంలో పెద్ద మలుపని అక్కడే ముఖేష్ జన్మించారని కోకిలా వెల్లడించారు. ఆ తర్వాత అనిల్, దీప్తి, నీనా ముంబైలో జన్మించారని పేర్కొన్నారు. ప్రస్తుతం తన కుటుంబంలో ఇద్దరు మేనకోడళ్లు, ఇద్దరు మేనల్లుళ్లు, తొమ్మిది మంది మనవలు సహా 19 మంది ఉన్నారని కోకిలా బెన్ ధీరూభాయ్ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications