భారతదేశంలోని ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ తల్లి కోకిలాబెన్ అంబానీ ఆసుపత్రిలో చేరారు. కోకిలాబెన్ ఆరోగ్యం గురించి దేశవ్యాప్తంగా అభిమానులు, వ్యాపార వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. కోకిలాబెన్ అంబానీ వయస్సు 90 ఏళ్లకు పైగా ఉంది. వయస్సు కారణంగా కొన్ని ఆరోగ్య సమస్యలు రావడంతో, వైద్యుల సలహా మేరకు ఆమెను ముంబైలోని రిలయన్స్ ఆసుపత్రిలో చేర్చారు.

వైద్యులు ఆమె పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ, ప్రత్యేక చికిత్స అందిస్తున్నారని కుటుంబ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని చెబుతున్నారు.
కోకిలాబెన్ అంబానీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ మరియు రిలయన్స్ ఏడీఏ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీల తల్లి. 2002లో రిలయన్స్ వ్యవస్థాపకుడు ధీరూభాయ్ అంబానీ మరణం తరువాత, కుటుంబాన్ని ఒక్క చోట చేర్చిన వ్యక్తి ఆమె. అందుకే, కోకిలాబెన్ ఆరోగ్యం విషయంలో ముకేశ్ అంబానీ, అనిల్ అంబానీ కుటుంబాలు ఎంతో శ్రద్ధ చూపుతున్నాయి. ఆమె ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిన వెంటనే, కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరచూ వస్తూ వెళ్తున్నారని సమాచారం.
కోకిలాబెన్ 1934లో గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో జన్మించారు. 1955లో ఆమె ధీరూభాయ్ అంబానీని వివాహం చేసుకుని, కుటుంబ జీవితాన్ని ప్రారంభించారు. వారికి నలుగురు సంతానం ముకేశ్, అనిల్, నినా కోఠారి, దీప్తి సల్గావ్కర్. ఆ కాలంలో మహిళలకు చదువు అంతంత మాత్రమే ఉన్నప్పటికి కోకిలాబెన్ 10వ తరగతి వరకు చదివారు. ధీరూభాయ్ ప్రోత్సాహంతో ఇంగ్లీష్ నేర్చుకుని, ఉన్నత వర్గాల వ్యక్తులతో, విదేశీ అతిథులతో సులభంగా సంభాషించగలిగే స్థాయికి చేరుకున్నారు.
కోకిలాబెన్ అంబానీ జీవనశైలి చాలా సాదాసీదాగా ఉంటారు. ప్రస్తుతం ఆమె ముంబైలోని అంటిలియాలో పెద్ద కుమారుడు ముకేశ్ అంబానీతో కలిసి ఉంటున్నారు. ఆమె పేరు మీద ముంబైలో ఉన్న కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ హాస్పిటల్ ఆమె ఆరోగ్యరంగానికి చేసిన కృషికి నిదర్శనం. ఇప్పటికీ కుటుంబంలో ముఖ్యమైన నిర్ణయాలకు ఆమె అభిప్రాయమే ప్రాధాన్యం ఉంటుంది. అలాగే, తన కోడళ్ళు నీతా అంబానీ, టినా అంబానీలతో కూడా మంచి స్నేహపూర్వక బంధాన్ని కొనసాగిస్తున్నారు.
కోకిలాబెన్ అంబానీకి సంపద పరంగా కూడా ఆవిడ అగ్రగామిగా నిలుస్తారు. ఆమె నికర సంపద సుమారు రూ. 18,000 కోట్లు. రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో కోకిలాబెన్ పేరు మీదే 1.57 కోట్ల షేర్లు ఉన్నాయి. ఇవి కంపెనీ మొత్తం షేర్లలో సుమారు 0.24% వాటా. ఈ షేర్ల వలన ఆమె రిలయన్స్ కుటుంబంలో అత్యధిక వ్యక్తిగత షేర్ ఉన్న వ్యక్తి.
అంబానీ కుటుంబం కేవలం వ్యాపార రంగంలోనే కాకుండా, సామాజిక సేవల్లో కూడా ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుంది. అందువల్ల, కోకిలాబెన్ ఆరోగ్యం క్షీణించడం సామాన్య ప్రజల్లో కూడా ఆందోళన కలిగించింది. సోషల్ మీడియాలో అనేక మంది ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ షేర్ చేస్తున్నారు.
రిలయన్స్ ఎదుగుదలకు ధీరూభాయ్ అంబానీకి తోడుగా ఉన్నారు. ఎల్లప్పుడూ అయినకి తోడుగా ఉండి, కుటుంబానికి బలం ఇచ్చిన ఆమె విలువలు, కుటుంబాన్ని ఒక్కటిగా ఉంచాయి. అందుకే, ఆమె ఆరోగ్య స్థితిపై చిన్న వార్తా కూడా ఎక్కువ ప్రాధాన్యం పొందుతున్నాయి.
ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్న కోకిలాబెన్ త్వరగా కోలుకోవాలని దేశవ్యాప్తంగా ప్రార్థనలు జరుగుతున్నాయి. అంబానీ కుటుంబానికి ఆమె కేవలం ఒక తల్లిగా కాకుండా, ప్రేరణా శక్తి కావడం వల్ల ఈ వార్తపై అందరి దృష్టి నిలిచింది.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?



Click it and Unblock the Notifications