Income Tax: ఎన్నికలకు ముందు వార్షిక్ బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పన్ను తాయిలాన్ని ప్రకటించారు. అయితే ఇది చాలా మందికి రుచించలేదని చెప్పుకోవాలి. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. మోదీ 2.0 చివరి ఫుల్ టైమ్ బడ్జెట్ టాక్స్ ప్రకటన ఉద్యోగులకు ఎంత వరకు ప్రయోజనకరమో ఇప్పుడు తెలుసుకుందాం.

పన్ను రాయితీ..
ఆదాయపన్ను మినహాయింపుల పేరుతో మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నాన్ని నిర్మలమ్మ ప్రకటించారనే చెప్పుకోవాలి. అసలు ఎంత ఆదాయం వారికి ఎంత టాక్స్, దానిని ఎలా లెక్కిస్తారో పూర్తిగా చెప్పకుండా అందరినీ గందరగోళానికి గురిచేసింది నిన్నటి ప్రకటన అని చెప్పుకోవాలి. కొత్త పన్ను విధానం కింద రూ.7 లక్షల వరకు ఆదాయంపై పన్ను చెల్లించక్కర్లేదని నిర్మలమ్మ ప్రకటించారు. పైగా కొత్త పన్ను చెల్లింపు విధానాన్ని డిఫాల్ట్ ఎంపికగా మార్చుతున్నట్లు ఆమె స్పష్టం చేశారు.

ఉద్యోగులకు ఆప్షన్..
చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పటికే పాత పన్ను విధానాన్ని ఫాలో అవుతున్నారు. అయితే కొత్త పన్ను విధానానికి మారటం వల్ల ప్రయోజనం ఎంత వరకు ఉంటుంది అనే ఆలోచన సైతం వారు చేస్తున్నారు. దీనిలో ముందుగా వారు ఆలోచించేది వారు చేసే NPS, PPFతో పాటు ఇతర పెట్టుబడులపై పన్ను మినహాయింపు వస్తుందా అనేది. ఒక్క మాటలో చెప్పాలంటే సెక్షన్ 80C, 80D కింద లభించే మినహాయింపులతో పాటు HRA, హోమ్ లోన్ల పై చెల్లించే వడ్డీలు, పిల్లల చదువుల ఖర్చులు వంటి వాటిపై తగ్గింపులు వస్తాయా అన్నదే. పాత టాక్స్ పద్ధతిలో వీటికి వెసులుబాటు ఉంటుంది. కానీ కొత్త విధానంలో ఇలాంటి అవకాశం అస్సలు లేదు. ఎలాంటి పన్ను తగ్గింపులు లేదా మినహాయింపులను కేంద్రం కొత్త విధానం కింద అందించటం లేదు.

మారిన కొత్త పన్ను రేట్లు..
కొత్త పన్ను విధానంలో రూ.3 లక్షల వరకు ఆదాయంపై ఎలాంటి పన్ను ఉండదు. దీని తర్వాత రూ.3 లక్షల నుంచి రూ.6 లక్షల ఆదాయంపై 5 శాతం, రూ.6 నుంచి రూ.9 లక్షల వరకు 10 శాతం, రూ.9 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు 15 శాతం, రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు 20 శాతం పన్ను, రూ.15 లక్షల కంటే ఎక్కువ ఆదాయంపై 30 శాతం వరకు పన్ను చెల్లించుకోవాల్సి ఉంటుంది. గతంలో కంటే ఈ శ్లాబ్ రేట్లలో రూ.50 వేలు అదనపు పన్ను మినహాయింపును ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.

పాత పన్ను విధానం..
అందరూ ఎదురుచూస్తున్న పాత పన్ను విధానంలో మాత్రం కేంద్రం ఎలాంటి మార్పులను ప్రకటించలేదు. పన్ను మినహాయింపులు కలిగిన పాత విధానంగా నిర్వీర్యం చేయాలని కేంద్రం ప్రయత్నిస్తోందని చాలా మంది భావిస్తున్నారు. ప్రస్తుతం కేంద్రం ప్రకటనలు చూస్తుంటే మినహాయింపులు లేని పన్ను విధానాన్ని దేశంలో అమలు చేయాలని చూస్తున్నట్లు కనిపిస్తోంది. రూ.2.50 లక్షల వరకు ఎలాంటి పన్ను ఉండదు. మిగిలిన ఆదాయంపై పన్ను చెల్లించుకోవాల్సి ఉంటుంది. అయితే పాత పద్ధతిలో ఉన్న మినహాయింపులు కొత్త విధానంలో లేకపోవటం చాలా మంది పన్ను చెల్లింపుదారుల నిరుత్సాహానికి ప్రధాన కారణమని చెప్పుకోవాలి.

ఒక పద్ధతి నుంచి మరోదానికి..
ఐటీఆర్ ఫైల్ చేసే సమయంలో అందరూ ప్రధానంగా గుర్తుంచుకోవాల్సింది ముందుగా రెండు పన్ను విధానాల్లో ఒకదాన్ని ఎంచుకోవటం. జీతం పొందే వ్యక్తి కొత్త పన్ను విధానంలో ఐటీఆర్ ఫైల్ చేసిన తర్వాత కావాలంటే తరువాతి సంవత్సరాల్లో పాత పన్ను విధానంలోకి మారేందుకు అవకాశం ఉంది. అయితే వ్యాపారులకు మాత్రం ఇలా మారేందుకు సౌకర్యం లేదు. ఒక్కసారి కొత్త విధానంలో ఐటీఆర్ ఫైల్ చేస్తే దానినే వారు కొనసాగించాల్సి ఉంటుంది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..



Click it and Unblock the Notifications