ITR Filing: దేశంలో ప్రస్తుతం కొత్తగా ఉద్యోగంలో వచ్చిన యువత ఎక్కువగా ఉంటున్నారు. వీరిలో చాలా మందికి తెలియని విషయం పన్ను రిటర్న్స్ ఫైలింగ్ లోని పద్ధతలు. చాలా మందికి ఈ క్రమంలో పాత టాక్స్ విధానం, కొత్త టాక్స్ విధానానికి మధ్య తేడా అస్సలు తెలియదు. వీటిలోని ప్రయోజనాలు సైతం చాలా మందికి తెలియవు.
కొత్త ఆర్థిక సంవత్సరం 2024-25 ఏప్రిల్ 1న ప్రారంభమైంది. పన్ను చెల్లింపుదారులు కొత్త పన్ను విధానం, పాత పన్ను విధానం మధ్య తేడా ఏమిటో తెలుసుకోవడం ముఖ్యం. 2023-24 ఆర్థిక సంవత్సరం నుంచి కొత్త ఆదాయపు పన్ను విధానం డిఫాల్ట్ ఆదాయపు పన్ను వ్యవస్థగా మారినందున వీటిలోని తేడాలు, ప్రయోజనాలు తప్పక తెలుసుకోవాలి. అలాగే వివిధ పన్ను శ్లాబ్ రేట్లను కూడా తప్పకుండా పరిశీలించాలి.

పాత పన్ను విధానంలో 2024-25 అసెస్‌మెంట్ సంవత్సరానికి పన్ను స్లాబ్ రూ.2,50,000 వరకు ఆదాయానికి ఎలాంటి పన్ను చెల్లించవలసిన అవసరం లేదు. మీ ఆదాయం రూ.5,00,000 కంటే తక్కువగా ఉన్నప్పటికీ, పన్ను సున్నా, కానీ మీరు ఈ పరిమితిని దాటిన వెంటనే, పన్ను రూ.2,50,001 నుంచి లెక్కించబడుతుంది. రూ.2,50,001 నుంచి రూ.5,00,000 మధ్య ఆదాయంపై 5% పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అలాగే రూ.5,00,001 నుండి రూ.10,00,000 మధ్య ఆదాయంపై 20% పన్ను, రూ.10 లక్షల కంటే ఎక్కువ ఆదాయంపై 30% పన్ను చెల్లించాల్సి ఉంటుందని గమనించండి.
ఆదాయపు పన్ను స్లాబ్‌లు 2024-25 పాత పన్ను విధానంలో రూ.5,00,000 కంటే ఎక్కువ మొత్తం ఆదాయం కలిగిన వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు రూ. 12,500 పన్ను రాయితీ లేదా చెల్లించాల్సిన వాస్తవ పన్ను, ఏది తక్కువైతే అది పొందేందుకు అర్హులు. 60 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న సీనియర్ సిటిజన్లకు ప్రాథమిక మినహాయింపు పరిమితి రూ.3 లక్షలు అయితే, 80 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న చాలా సీనియర్ సిటిజన్లకు ప్రాథమిక మినహాయింపు పరిమితి రూ.5 లక్షలుగా ఉంది.
ఇక కొత్త పన్ను విధానాన్ని పరిశీలిస్తే.. రూ.3 లక్షల వరకు ఆదాయానికి పన్ను లేదు. రూ.3 లక్షల కంటే ఎక్కువ రూ.6 లక్షల కంటే తక్కువ ఆదాయానికి 5 శాతం పన్ను నిర్ణయించబడింది. రూ.6 లక్షల నుంచి రూ.9 లక్షల వరకు ఆదాయానికి 10 శాతం, రూ.9 లక్షలకు పైబడిన ఆదాయంపై 15 శాతం, రూ. 12 లక్షల వరకు పన్ను విధిస్తున్నారు. రూ. 12 లక్షల కంటే ఎక్కువ, రూ. 15 లక్షల లోపు ఆదాయానికి 20 శాతం పన్ను ఉంటుంది. 15 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉన్న వారికి 30% పన్ను. కొత్త పన్ను విధానంలో రిబేట్ అర్హత పరిమితిని రూ.7,00,000గా నిర్ణయించబడిన సంగతి తెలిసిందే. దీని ద్వారా పన్ను చెల్లింపుదారులు రూ.25,000 వరకు మినహాయింపును క్లెయిమ్ చేసుకోవచ్చు.
కొత్త vs పాత వ్యవస్థ
పాత, కొత్త ఆదాయపు పన్ను వ్యవస్థ మధ్య ప్రాథమిక వ్యత్యాసం ఏమిటంటే.. పాత వ్యవస్థలో సెక్షన్ 80C, సెక్షన్ 80D, సెక్షన్ 80TTA మొదలైన పెద్ద మినహాయింపులు, తగ్గింపులను అనుమతిస్తుంది. కాగా కొత్త పన్ను విధానంలో ఇవన్నీ లేవు. కొత్త ఆదాయపు పన్ను విధానం మరొక మినహాయింపును అందిస్తుంది. ఇది NPS ఖాతాకు యజమాని సహకారం కోసం సెక్షన్ 80CCD(2) కింద ఉంది.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications