బిట్ కాయిన్ సహా వివిధ క్రిప్టో కరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే
క్రిప్టో కరెన్సీ మిశ్రమంగా కదలాడుతోంది. క్రిప్టో దిగ్గజం బిట్ కాయిన్ స్వల్ప నష్టాల్లో ఉండగా, ఎథేరియం, ఎక్స్‌ఆర్‌పీ, టెర్రా మాత్రం లాభాల్లో ఉన్నాయి. భారత ప్రభుత్వం ఇప్పటికే క్రిప్టో కరెన్సీ వర్గీకరణ, జీఎస్టీకి తీసుకు రావడంపై పని చేస్తోంది. ఏప్రిల్ నుండి క్రిప్టో ట్యాక్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో క్రిప్టో మార్కెట్ మిశ్రమంగా కదలాడుతోంది.
ఈ వార్త రాసే సమయానికి బిట్ కాయిన్ 1.01 శాతం నష్టపోయి 41,107 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. 24 గంటల కనిష్టం 40,532.50 డాలర్లు, గరిష్టం 41,680.32 డాలర్లు. 52 వారాల కనిష్టం 28,825.76 డాలర్లు, గరిష్టం 68,990.90 డాలర్లు. గత ఇరవై నాలుగు గంటల్లో క్రిప్టో మార్కెట్ క్యాప్ 780.58 బిలియన్ డాలర్లు క్షీణించింది.క్రిప్టో ఆల్ టైమ్ గరిష్టం 68,990.90 డాలర్లు.

వివిధ క్రిప్టో కరెన్సీ వ్యాల్యూ విషయానికి వస్తే బిట్ కాయిన్ 1.35 శాతం నష్టపోయి 40,966 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ప్రపంచ రెండో అతిపెద్ద క్రిప్టో ఎథేరియం 2.11 శాతం ఎగిసి 2930 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఎక్స్‌ఆర్‌పీ 1.05 శాతం ఎగిసి 0.8139 డాలర్లు, టెర్రా 2.85 శాతం ఎగిసి 94.61 డాలర్లు, అవాలాంచె 0.81 శాతం ఎగిసి 87.90 డాలర్లు, కార్డానో 2.19 శాతం ఎగిసి 0.8999 డాలర్లు, పోల్కాడాట్ 0.01 శాతం ఎగిసి 18.83 డాలర్లు, స్టెల్లార్ 1.26 శాతం ఎగిసి 0.916966 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. సోలానా 0.86 శాతం క్షీణించి 89.13 డాలర్లు, డోజీకాయిన్ 0.58 శాతం క్షీణించి 0.1188 డాలర్లు, టెర్రా యూఎస్డీ 0.03 శాతం క్షీణించి 1.00 డాలర్ వద్ద ట్రేడ్ అయింది.


Click it and Unblock the Notifications