కేంద్ర బడ్జెట్ 2025: మోదీ సర్కార్ ఏర్పాటు చేయబడిన తర్వాత జూలై 23న కొత్తగా కొలువుదీరిన ప్రభుత్వంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 7వ సారి బడ్జెట్ ప్రసంగం చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ క్రమంలో ఆమె దేశ ప్రజలను సంతోషపెట్టే కొన్ని కీలక అంశాలను ప్రస్థావించారు. ప్రజలకు కొన్ని తాయిలాలు ప్రకటించారు.
గతసారి ఎన్డీఏ కూటమి 48.02 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టగా ఇందులో పన్నుల నుంచి ఆదాయం 28.08 లక్షల కోట్లుగా ఉండగా పన్నేతర ఆదాయం 16 లక్షల కోట్లుగా ఉంది. ఈ క్రమంలో 9 రంగాలకు ప్రాధాన్యత ఇస్తూ బడ్జెట్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఆర్థిక మంత్రి ప్రధానంగా దేశంలోని యువతకు ఉద్యోగ కల్పనపై ఫోకస్ పెట్టారు. రానున్న ఐదేళ్లలో 5 కోట్ల మందికి ఉపాధి అవకాశాల కల్పన కోసం రూ.2 లక్షల కోట్లు వెచ్చించనున్నట్లు వెల్లడించారు.

అలాగే వికసిత్ భారత్ లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు నిర్మలమ్మ వెల్లడించారు. ఇదే క్రమంలో వ్యవసాయానికి ఆర్థిక మంత్రి ఎక్కువ ప్రాధాన్యతను సైతం అందించిన సంగతి తెలిసిందే. అలాగే బడ్జెట్లో దేశంలోని సామాన్యుల నుంచి సంపన్నుల వరకు అందరినీ ఆకర్షించిన మరో విషయం బంగారం దిగుమతులపై పన్నును భారీగా తగ్గించటం. ఈ క్రమంలో నిర్మలా సీతారామన్ దిగుమతి పన్నును ఏకంగా 15 శాతం నుంచి 6 శాతానికి తగ్గించారు. ఆ ప్రభావంతో సాయంత్రానికే దేశంలోని పెద్ద వ్యాపారులు రేట్లను దానికి అనుగుణంగా తగ్గించిన సంగతి తెలిసిందే.
ఇకపోతే ఎంఎస్ఎంఈలకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రత్యేక శ్రద్ధను బడ్జెట్లో చూపారు. కొత్త ఎంఎస్ఎంఈ గ్యారంటీ ప్లాన్ కింద రూ.100 కోట్ల వరకూ రుణాలు ఇస్తామన్నారు. ఎంఎస్ఎంఈలకు బ్యాంక్ క్రెడిట్ లను సులభతరం చేసేందుకు ఈ కొత్త విధానం అమలు చేస్తామన్నారు. అలాగే ముద్రా రుణాల పరిమితిని రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచారు. ఉద్యోగాల్లో చేరే కొత్త ఉద్యోగులందరికీ ప్రభుత్వం ఒక నెల వేతనాన్ని పీఎఫ్ కంట్రిబ్యూషన్ రూపంలో అందించనున్నట్లు నిర్మలమ్మ గత బడ్జెట్లో ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఆదాయపు పన్ను ప్రయోజనం..
బడ్జెట్ సమయంలో ఆర్థిక మంత్రి న్యూ టాక్స్ రీజిమ్ కింద గతంలో అందిస్తున్న స్టాండర్ట్ డిడక్షన్ రూ.50 వేల నుంచి రూ.75 వేలకు పెంచిన సంగతి తెలిసిందే. దీంతో మెుత్తంగా ఈ పన్ను విధానం కింద రూ.7.75 లక్షల వరకు వేతన జీవులు అందుకుంటారు. ఇక మారిన పన్ను శ్లాబ్ రేట్లను పరిశీలిస్తే.. 3 లక్షల - 7 లక్షల వరకూ ఆదాయంపై 5 శాతం పన్ను, 7 లక్షల - 10 లక్షల వరకు ఆదాయంపై 10 శాతం, 10 లక్షల - 15 లక్షల వరకు 15 శాతం పన్ను ప్రతిపాదించబడింది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?



Click it and Unblock the Notifications