ITR Filing Missed: వాస్తవానికి టాక్స్ పేయర్లు తమ ఐటీఆర్ ఫైలింగ్ జూలై నెల చివరి నాటికి పూర్తి చేయాల్సిన అంశం. అయితే కొన్ని అనివార్య కారణాలతో చాలా మంది దానిని మిస్ అయ్యి ఉండవచ్చు. కానీ ఇప్పుడు 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఆలస్యపు రిటర్న్స్ దాఖలు చేయడానికి గడువు సమీపిస్తోంది. అందువల్ల ప్రజలు దీనిని వెంటనే పూర్తి చేయటం అత్యవసరం.
ఆదాయపుపన్ను శాఖ అందించిన డెడ్ లైన్ ప్రకారం జూలైలో టాక్స్ రిటర్న్స్ ఫైలింగ్ మిస్ అయిన పన్ను చెల్లింపుదారులు ప్రస్తుతం దానిని ఎట్టిపరిస్థితుల్లోనూ డిసెంబర్ 31, 2024కి పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇదే చివరి అవకాశం అని గుర్తుంచుకోవాలి. ఈ గడువులోపల టాక్స్ రిటర్న్ ఫైలింగ్ మిస్ అయితే, ఆలస్యంగా రిటర్న్ దాఖలుకు జరిమానాతో పాటు ఆలస్యమైన కాలానికి చెల్లించాల్సిన పన్ను మెుత్తంపై వడ్డీ కూడా కట్టాల్సి ఉంటుంది. ఇది వ్యక్తులపై ఆర్థికంగా భారాన్ని పెంచుతుంది.

ఒక వేళ పన్ను చెల్లింపుదాలు గడువును కోల్పోతే ఆలస్యంగా ఫైల్ చేయబడే అనుమతి ఉంటుంది. కానీ ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 234ఎఫ్ ప్రకారం సాధారణ గడువు తేదీ తర్వాత తమ పన్ను రిటర్న్‌లను ఫైల్ చేసే వ్యక్తులు రూ.5,000 లేటు రుసుమును చెల్లించాల్సి ఉంటుంది. అయితే మెుత్తం ఆదాయం రూ.5 లక్షల కంటే తక్కువగా ఉండే వ్యక్తులు ఆలస్యంగా రిటర్న్ ఫైల్ చేసినందుకు రూ.1,000 రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అందువల్ల జూలై 31 గడువులోగా తమ ఆదాయపు పన్ను రిటర్న్ ఫైల్ చేయడంలో విఫలమైన పన్ను చెల్లింపుదారులు 2024-25 అసెస్‌మెంట్ సంవత్సరానికి ఆలస్య రుసుములతో రిటర్న్ దాఖలు చేయటానికి డిసెంబర్ 31, 2024 చివరి అవకాశంగా గుర్తుపెట్టుకోవాలి.
ఒకవేళ మీరు డిసెంబర్ 31 డెల్ లైన్ మిస్ అయితే పన్ను చట్టం ప్రకారం అసెస్‌మెంట్ సంవత్సరం ముగిసేలోపు అంటే మార్చి 31, 2025 రూ.10,000 జరిమానాగా చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఇదే క్రమంలో రూ.5 లక్షల లోపు ఆదాయం ఉన్న వ్యక్తులు రూ.1,000 ఆలస్యానికి జరిమానా కట్టాల్సి ఉంటుంది. ఒకవేళ ఆలస్యమైన రిటర్న్‌లో ఏవైనా పొరపాట్లు జరిగితే డిసెంబర్ 31, 2024లోపు సవరించిన రిటర్న్‌ను ఫైల్ చేయవచ్చు.
లేటు రిటర్న్ కూడా దాఖలు చేయటంలో ఎవరైనా టాక్స్ పేయర్ మిస్ అయితే వారు 2023-24 ఆర్థిక సంవత్సరానికి రిటర్న్ ఫైల్ చేయటం కుదరదు. ఒకవేళ పన్ను శాఖ నుంచి దీనికి సంబంధించి ఏదైనా నోటీసులు అందుకున్నప్పుడు మాత్రమే రిటర్న్ ఫైల్ చేయటం కుదురుతుంది. అయితే జెన్యూన్ కారణాల వల్ల ఐటీఆర్ ఫైలింగ్ మిస్ అయినట్లయితే సెక్షన్ 119 కింద ఆలస్యానికి కండోనేషన్ కోసం అభ్యర్థనను ఫైల్ చేయవచ్చు. ఈ అభ్యర్థన గడువును కోల్పోవడానికి గల కారణాన్ని వివరించే ప్రకటనను కలిగి ఉండాలి. ఈ క్రమంలో లేటు రిటర్న్ పై రూ.10,000 జరిమానాతో పాటు రిటర్న్ దాఖలు చేసేంతవరకు 1% చొప్పున వడ్డీ విధించబడుతుందని గుర్తుంచుకోవాలి. చట్టపరమైన, ఆర్థికపరమైన చర్యల నుంచి తప్పించుకోవటానికి తప్పనిసరిగా సకాలంలో రిటర్న్ దాఖలు చేయటం తప్పనిసరి.
More From GoodReturns

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?



Click it and Unblock the Notifications