80G Tax Deduction: శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్రట్రస్ట్ విరాళాలకు పన్ను రాయితీ వస్తుందా..??
Ram Mandir: దాదాపు వందల ఏళ్ల నుంచి కొనసాగుతున్న అయోధ్య వివాదానికి రేపటితో పెద్ద బ్రేక్ పడనుంది. బీజేపీ సర్కార్ హయాంలో రాముని ఆలయ నిర్మాణం వైభవంగా పూర్తవుతోంది. ఇందులో తమ వంతు పాత్ర పోషించేందుకు అనేక మంది తోచినంత విరాళంగా రామునికి సమర్పించుకుంటున్న సంగతి తెలిసిందే.
చాలా మంది దేశంలో ఉత్తర్‌ప్రదేశ్ అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించేందుకు ప్రభుత్వం ప్రజల నుంచి వసూలు చేసిన పన్నుల సొమ్మును ఇందుకు వినియోగిస్తున్నట్లు భావిస్తున్నారు. కొందరు ఈ తప్పుడు ప్రచారాన్ని విస్తృతంగా వ్యాప్తి చేయటం దీనికి ఒక కారణంగా ఉంది. అయితే రామ మందిర నిర్మాణం కోసం 2020లో శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్రట్రస్ట్ స్థాపించటం జరిగింది. దానికి ఇప్పటి వరకు దాదాపుగా రూ.3,500 కోట్లకు పైగా విరాళాలు వచ్చాయి. ఇప్పటికీ విదేశాల నుంచి విరాళాల వెల్లువ కొనసాగుతూనే ఉందని గణాంకాలు చెబుతున్నాయి.

ప్రస్తుతం రాముని మందిరాన్ని దాదాపు రూ.1,800 కోట్లు వెచ్చించి అత్యంత అధునాతన సాంకేతికతతో పాటు వైధిక పద్ధతులను వినియోగించి నిర్మించినట్లు తెలుస్తోంది. మిగిలిన మెుత్తాన్ని ట్రస్ట్ ఆలయ నిర్వహణకు ఉపయోగించనుందని సమాచారం. అయితే శ్రీరాముని ఆలయానికి ప్రతిరోజూ దాదాపు 3 లక్షల మంది భక్తులు ఇక్కడ స్వామివారిని దర్శించేదుకు వస్తారని అంచనా వేయబడింది. ఈ టెంపుల్ టూరిజం ద్వారా అయోధ్యలో ఏకంగా ఏడాదికి రూ.10,000 కోట్లకు పైగా వ్యాపారం జరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది ప్రత్యక్షంగానే కాకుండా పరోక్షంగా వేల మందికి ఉపాధి, వ్యాపార అవకాశాలను కల్పించనుందని సమాచారం.
అయితే ఇప్పుడు ట్రస్టుకు ప్రజలు అందించే విరాళాలకు పన్ను మినహాయింపుకు అర్హత కలిగినవా కాదా అనే విషయం గురించి తెలుసుకుందాం. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సెక్షన్ 80G(2)(బి) ప్రయోజనం కోసం కేంద్ర ప్రభుత్వం శ్రీ రామ్ ట్రస్ట్‌ను చారిత్రాత్మక ప్రాముఖ్యత కలిగిన ప్రదేశంగా, ప్రఖ్యాత ప్రజా పూజా స్థలంగా నోటిఫై చేసింది. అందువల్ల ఆలయాన్ని పునరుద్ధరించడానికి లేదా మరమ్మతు చేయడానికి చేసిన విరాళాలు మినహాయింపుకు అర్హులు. మందిర పునరుద్ధరణ/మరమ్మత్తు కోసం శ్రీరామ్ ట్రస్ట్‌కు విరాళంగా ఇచ్చిన మొత్తంలో 50% సెక్షన్ 80G కింద మినహాయింపు పొందేందుకు అర్హమైనది.
శ్రీ రామ్ ట్రస్ట్‌కు విరాళంగా ఇచ్చిన మొత్తం మీ సర్దుబాటు చేసిన స్థూల మొత్తం ఆదాయం (GTI)లో 10% మించి ఉంటే, 10% పరిమితిని మించిన ఏదైనా అదనపు మొత్తం మినహాయింపుకు అర్హత పొందదు. వస్తువుల రూపంలో అందించే విరాళాలకు ఎలాంటి తగ్గింపులు ఉండబోవని గుర్తుంచుకోండి. అలాగే రూ.2000కు మించి చేసే నగదు డొనేషన్ మినహాయింపులకు అర్హమైనది కాదు.


Click it and Unblock the Notifications