వ్యాపార వేత్తలు డబ్బును ఎలా ఇన్వెస్ట్ చేస్తారో తెలుసుకోవాలనుకుంటున్నారా.. ఇదిగో లైవ్ ప్రూఫ్ మీకోసం..
Zerodha: గ్లోబల్ స్టాక్ మార్కెట్ క్రాష్, పెరుగుతున్న ద్రవ్యోల్బణం మధ్య పెట్టుబడిదారులు తల్లడిల్లుతున్నాయి. ఈ సమయంలో సరైన పెట్టుబడి ఎంపికలు ఏమిటి. ఇలాంటి పరిస్థితులను తట్టుకోవటం ఎలా అని అనేక మంది ఆందోళన చెందుతుంటారు. అయితే.. జెరోధా బ్రోకరేజ్ సంస్థ సహ వ్యవస్థాపకుడు నితిన్ కామత్ తన ఆర్థిక వ్యవహారాలను ఎలా సమర్థవంతంగా నిర్వహిస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.. మనం కూడా సక్సెస్ ఫుల్ సేవింగ్స్ చేసుకుందాం..

పెట్టుబడులు ఇలా..
నితిన్ కామత్ తన వ్యక్తిగత పోర్ట్‌ఫోలియోను నిర్వహించడంలో చాలా చురుకుగా ఉండరని అంగీకరించారు. తన సోదరుడు నిఖిల్ వాటిని చూసుకుంటారని ఒప్పుకున్నారు. ఇందులో భాగంగా తన పోర్ట్‌ఫోలియోను ఈక్విటీ 40%, డెట్ 40% మిగిలిన 20% బంగారంలో ఉంచుతానని వెల్లడించారు. ఒకవేళ రూ.1000 ఎలా వివిధ కేటగిరీల్లో ఇన్వెస్ట్ చేస్తారని అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. ఈక్విటీలో "దూకుడుగా" పెట్టుబడి పెడతానని చెప్పారు. ఇవి మార్కెట్ ఓలటాలిటీని పరిగణలోకి తీసుకుంటాయి.

మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు..
అతను 25 సంవత్సరాల క్రితం మ్యూచువల్ ఫండ్‌లో SIP రూపంలో పొదుపు చేయటం ప్రారంభించారు. ఇప్పటికీ ఆయన తన పెట్టుబడిని కొనసాగిస్తున్నారు. ఆయన ఎల్లప్పుడూ యాక్టివ్ స్టాక్ పిక్కింగ్ విధానంలో వివిధ షేర్లను సెలెక్ట్ చేసుకుంటానని.. పాసివ్ విధానాన్ని అస్సలు పాటించనని వెల్లడించారు. ప్రతి ఒక్కరూ ఎమర్జెన్సీ కార్పస్ ని తప్పక నిర్వహించాలని తెలిపారు. ఇందుకోసం వెంటనే వినియోగించుకునేందుకు వీలుగా ఉండే రిస్క్ ఫ్రీ పొదుపు పథకాల్లో ఇన్వెస్ట్ చేయాలన్నారు.

నేను నష్టపోయా.. వాటికి దూరంగా ఉండండి..
రియల్ ఎస్టేట్ పెట్టుబడులపై ఏమన్నారంటే.. క్యాపిటల్ వీటిలో ఎక్కువకాలం లాక్ అయి ఉంటుంది కాబట్టి వాటిపై తనకు ఆసక్తి లేదని వెల్లడించారు. పైగా లాంగ్ టర్మ్ లో చూసుకుంటే రాబడి కూడా తక్కువగా ఉంటుందని ఆయన అంటున్నారు. మరో పక్క తాను ట్రేడింగ్ కు దూరంగా ఉంటున్నట్లు తెలిపారు.
2010 తరువాత ఒక్క ట్రేడ్ కూడా చేయలేదని ఈ సందర్భంగా వెల్లడించారు. నష్టాన్ని అంచనా వేసిన తరువాతే రిస్క్ తీసుకుని ముందుకు సాగుతానని ఆయన గతంలోనే చెప్పారు. ఒకసారి F&O ట్రేడింగ్ కోసం కొన్ని పెట్టుబడులను తాకట్టు పెట్ట.. డబ్బు పోగొట్టుకున్న విషయాన్ని గుర్చు చేసుకున్నారు.
అప్పు చెల్లించడానికి సంవత్సరాలు గడిపిన తన స్వంత "బాధాకరమైన" అనుభవంపై స్పందిస్తూ.. అప్పులకు, క్రెడిట్ కార్డులకు దూరంగా ఉండాలని సగటు ఇన్వెస్టర్లకు సూచిస్తున్నారు.


Click it and Unblock the Notifications