UPI Cash Withdrawel: ఫోన్‌పే, గూగుల్‌పేలతో ఏటీఎం నుంచి క్యాష్ విత్ డ్రా.. పూర్తి వివరాలు..
UPI Cash Withdrawel: యూపీఐ విధానం ప్రవేశపెట్టిన తరువాత దేశంలో చెల్లింపుల డిజిటలైజేషన్ వేగవంతంగా జరుగుతోంది. అయితే దీని ద్వారా సులువుగా డబ్బును విత్ డ్రా చేసుకునే సౌకర్యాన్ని సైతం ప్రస్తుతం రిజర్వు బ్యాంక్ ప్రజలకు అందుబాటులోకి తెస్తోంది. దీని వల్ల డెబిట్ కార్డుల వినియోగం కూడా భారీగా తగ్గనుందని తెలుస్తోంది. అయితే ICCW అని పిలవబడే ఈ విధానాన్ని వీలైంత త్వరగా బ్యాంకింగ్ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావాలని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్ని బ్యాంకులను ఆదేశించింది.
రిజర్వు బ్యాంక్ ఆదేశాలు..
ఈ పద్ధతిలో డబ్బును తీసుకునేందుకు అవసరమైన ఏర్పాట్లను నేషనల్ పేమెంట్స్ కొర్పొరేషన్ సిద్ధం చేసింది. దీని ద్వారా వినియోగదారులు ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం వంటి యాప్స్ నుంచి మాత్రమే కాకుండా ఏ బ్యాంకుకు చెందిన యూపీఐ యాప్ ద్వారా అయినా డబ్బును విత్ డ్రా చేసుకోవచ్చు. అయితే ఈ విధానంలో ఎంత డబ్బు తీసుకోవచ్చు, రోజు వారీ లిమిట్ ఎంత, ఛార్జీలు ఎలా వర్తిస్తాయి వంటి విషయాలపై ఇప్పటి వరకూ రిజర్వు బ్యాంక్ ఎలాంటి ప్రకటన చేయలేదు. మనం మామూలుగా పేమెంట్స్ చేసేందుకు బయట షాపుల్లో ఎలా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి డబ్బు చెల్లిస్తున్నామో, అచ్చం అలాగే.. ఏటీఎం నుంచి డబ్బును సులువుగా విత్ డ్రా చేసుకోవచ్చు. యూపీఐ యాప్స్ ద్వారా డబ్బు ఎలా విత్ డ్రా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

డబ్బు విత్ డ్రా కోసం ఇలా చేయండి..
1. ముందుగా ఏదైనా ఏటీఎం మెషిన్ వద్దకు వెళ్లి స్కీన్ పై క్యాష్ విత్ డ్రా ఆప్షన్ ఎంచుకోవాలి
2. ఆ తరువాత ఏటీఎం స్కీన్ పై యూపీఐ ఆప్షన్ సెలక్ట్ చేసుకోవాలి
3. అప్పుడు ఏటీఎం స్కీన్ మీద ఒక క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది
4. ఇప్పుడు మీ ఫోన్ లోని యూపీఐ ఆధారిత పేమెంట్ యాప్ ఓపెన్ చేసి ఏటీఎం చూపిన క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి
5. కోడ్ స్కాన్ చేసిన తరువాత మీరు ఎంత డబ్బు విత్ డ్రా చేసుకోవాలనుకుంటున్నారో అక్కడ ఎంటర్ చేయండి. (ఉదాహరణకు- రూ.5,000) ప్రస్తుతం లిమిట్ రూ.5 వేలు మాత్రమే.
6. ఇప్పుడు మీ యాప్ లో యూపీఐ పిన్ ఎంటర్ చేసి ప్రొసీడ్ బటన్ క్లిక్ చేయగానే ఏటీఎం నుంచి డబ్బు వస్తుంది


Click it and Unblock the Notifications