Wrong UPI Payments: దేశంలో UPI చెల్లింపులు అత్యంత ప్రజాదరణ పొందిన మాధ్యమంగా మారింది. వీటిపై ఛార్జీలు విధించేందుకు ప్రస్తుతానికి ఎలాంటి ప్రయత్నాలు చేయటం లేదని ప్రభుత్వం వెల్లడించింది. జూలై నెలలోనే UPI ద్వారా 600 కోట్ల లావాదేవీలు జరిగాయి. ఈ క్రమంలో చెల్లింపు సమయంలో చేసే చిన్న పొరపాట్ల వల్ల తప్పుడు వ్యక్తుల బ్యాంక్ ఖాతాలకు డబ్బు పంపే ప్రమాదం ఉంది. ఇలాంటి సందర్భంలో ఆ డబ్బును ఎలా రికవర్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకోండి.

హెల్ప్‌లైన్ నంబర్‌ను సంప్రదించండి..
మీరు UPI చెల్లింపుల సమయంలో తప్పుడు ఖాతాకు డబ్బు ట్రాన్ఫర్ చేసినట్లయితే భయపడాల్సిన పనిలేదు. తప్పు లావాదేవీ జరిగితే, ముందుగా దాని వివరాలతో కూడిన స్క్రీన్ షాట్ తీసుకోండి. ఆ పేమెంట్ మెసేజ్ లో ఉన్న హెల్ప్ లైన్ నంబర్ కు కాల్ చేసి రిపోర్ట్ చేయండి. అదే సమయంలో ఈ వివరాలను బ్యాంక్ కు కూడా తెలపండి. వీలైనంత త్వరగా బ్రాంచ్ మేనేజర్‌ని సంప్రదించండి. మీరు తప్పుడు యూపీఐ ఐడీకి పంపినప్పుడు అది నిజంగా లేని పక్షంలో డబ్బు ఆటోమేటిక్‌గా రీఫండ్ చేయబడుతుందని తెలుసుకోండి.

బ్యాంకును సంప్రదించటం..
డబ్బును మీరు తప్పుడు వ్యక్తి ఖాతాకు బదిలీ చేసి ఉంటే.. దాని వివరాల రుజువును మీ బ్యాంకుకు ఫిర్యాదుతో పాటు అందించాలి. ఇది ఇంటర్ బ్యాంక్ లావాదేవీ అయితే.. అంటే, రెండు వేర్వేరు బ్యాంకుల మధ్య లావాదేవీ జరిగినట్లయితే.. సమీపంలోని బ్రాంచ్ ను రిసీవరీ కోసం సంప్రదిస్తుంది.

బ్యాంకు అన్ని విధాలుగా సహాయం చేసేందుకు ప్రయత్నిస్తుంది..
ఇంటర్ బ్యాంక్ లావాదేవీల విషయంలో.. మీ తరఫున బ్యాంక్ రిసీవర్ బ్యాంకుకు ట్రాన్సాక్షన్ సంబంధిత అన్ని వివరాలను పంచుకుంటుంది. ఖాతాదారుడి పేరు, బ్రాంచ్, మొబైల్ నంబర్ ఇతర అవసరమైన సమాచారాన్ని పంచుకోవచ్చు. అలాంటి సందర్భాల్లో.. మీరు రిసీవర్ బ్రాంచ్‌కి వెళ్లి మేనేజర్‌తో మాట్లాడి రిక్వెస్ట్ చేయవచ్చు. బ్యాంక్ మేనేజర్ డబ్బు పొందిన వ్యక్తితో మాట్లాడి మీ డబ్బును తిరిగి ఇవ్వమని అడుగుతాడు. దీనివల్ల ప్రక్రియ చాలా సులువుగా పూర్తవుతుంది.

ఏడు రోజుల్లో డబ్బు వాపసు పొందవచ్చు..
పొరపాటున డబ్బు పొందిన వ్యక్తి దానిని తిరిగి ఇచ్చేందుకు అంగీకరిస్తే.. ఏడు పని దినాల్లో డబ్బు పోగొట్టుకున్న వ్యక్తి ఖాతాకు తిరిగి వస్తుంది. అతను డబ్బు తిరిగి ఇవ్వడానికి సిద్ధంగా లేకుంటే మరింత ఇబ్బంది ఉంటుంది. ఈ సందర్భంలో.. చట్టపరమైన మార్గాన్ని కూడా ఎంచుకోవచ్చు. అయితే కస్టమర్ ఆమోదం లేకుండా.. ఏ బ్యాంకు అతని ఖాతా నుంచి డబ్బును బదిలీ చేయదు, అది నిజంగా పొరపాటున జరిగినప్పటికీ. కాబట్టి డిజిటల్ చెల్లింపులు చేసే సమయంలో ఒకటికి పదిసార్లు వివరాలు సరిచూసుకోవటం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications