ఉద్యోగం చేసే దాదాపు అందరికి హెచ్ఆర్ఏ అలవెన్స్ ఉంటుంది. హెచ్ఆర్ఏ అంటే హౌస్ రెంట్ అలవెన్స్. ఉద్యోగి నివసించేందుకు కావాల్సిన వసతి కోసం కొంత మొత్తాన్ని బేసిక్ తో కలిపి యాజమాన్య సంస్థ చెల్లిస్తుంది. పే స్లిప్ పరిశీలిస్తే మీ జీతంలో హెచ్ఆర్ఏ ఎంత ఉందో తెలుస్తుంది. అయితే ఉద్యోగులు హెచ్ఆర్ఏపై పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు.

మూడు పద్ధతుల్లో
మూడు పద్ధతుల్లో ఎందులో తక్కువ ఉంటుందో ఆ హెచ్ఆర్ఏపై పన్ను మినహాయింపు పొందవచ్చు. ఇప్పుడు ఆ మూడు పద్ధతులు ఏమిటో చూద్దాం.. అందులో మొదటిది సంవత్సరంలో పొందిన హెచ్ఆర్ఏ, రెండోది బేసిక్+డీఏ( మెట్రో నగరాల్లో బేసిక్ లో 50 శాతం, నాన్ మెట్రో అయితే బేసిక్ లో 40 శాతం), మూడోది మీరు సంవత్సరంలో చెల్లిస్తున్న అద్దె(బేసిక్ లో 10 శాతం+డీఏ) ఇందులో ఏది తక్కువగా వస్తే దాన్ని హెచ్ఆర్ఏ కింద మినహాయిస్తారు.

ఉదాహరణకు
హైదరాబాద్ లో ఉండే రఘు అనే వ్యక్తికి బేసిక్ 20000 అనుకుందాం.. అతనికి హెచ్ఆర్ఏ 8వేలు అనుకుందాం. అతని రూమ్ రెంట్ 7 వేలు అనుకుందాం. ఇప్పుడు అతను సంవత్సరానికి బేసిక్ 2,40,000 వస్తుంది. హెచ్ఆర్ఏ సంవత్సరానికి 96 వేలు అవుతుంది. అతను సంవత్సరానికి 84 వేలు అద్దె చెల్లిస్తున్నాడు. ఇప్పుడు పై మూడు కండిషన్లు పరిశీలిద్దాం..

మొదటి కండిషన్
అతను పొందే హెచ్ఆర్ఏ మొత్తం 96 వేలు. రెండో కండిషన్ లో బేసిక్ లో 40 శాతం(హైదరాబాద్ నాన్ మెట్రో) అంటే 96,000 అవుంతుంది. ఇక మూడో కండిషన్ లో మొత్తం సంవత్సరంలో చెల్లించిన అద్దె మొత్తం నుంచి బేసిక్ లో 10 శాతాన్ని తీసివేయాలి. అంటే ఇక్కడ మొత్తం అద్దె ఎంత 84 వేలు.. బేసిక్ 10 శాతం అంటే 24 వేలు.. 84 వేల నుంచి 24 వేలు తీసేస్తే 60 వేలు వస్తుంది. అంటే ఈ కేసులో రఘు హెచ్ఆర్ఏలో 60 వేలు పన్ను మినహాయింపు పొందవచ్చు.


Click it and Unblock the Notifications