హెచ్1బీ సహా వివిధ రకాల ఉద్యోగ వీసాలను ఈ ఏడాది డిసెంబర్ 31వ తేదీ వరకు జారీ చేయకూడదని ట్రంప్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో అమెరికాలోని ఇండియన్ కంపెనీలలో ఎంతమంది హెచ్1బీ వీసా ఉద్యోగులు ఉన్నారు, ఎంతమంది స్థానికులున్నారనే అంశం చర్చనీయాంశంగా మారింది. అమెరికాలోని ఇండియన్ ఐటీ కంపెనీల్లో దాదాపు 80,000 మంది ఉద్యోగులు వీసాలపై వెళ్లిన వారు ఉన్నారు. ఇందులో ఎక్కువగా హెచ్1బీ వీసాలు ఉన్నాయి. కరోనా నేపథ్యంలో అమెరికన్లకు ఉద్యోగులా రావడంలో భాగంగా ట్రంప్ జూన్ 22న ఈ ఆంక్షలు తీసుకు వచ్చారు.

ఉన్నవారిపై ప్రభావం లేదు కానీ రిజెక్షన్ రేటు పెరగొచ్చు
ప్రస్తుతం అమెరికాలో 79,649 భారతీయులు టాటా కన్సల్టెన్సీ (TCS), కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, విప్రో వంటి ఐటీ సంస్థల్లో ఉద్యోగం చేస్తున్నారు. ఇప్పటికే హెచ్1బీ వీసాలపై ఉన్న వారిపై ట్రంప్ ఆర్డర్స్ ప్రభావం చూపించవు. కానీ రెన్యూవల్ రిజెక్షన్ రేట్ పెరగడానికి ఇది దారితీస్తుందని జపాన్ బ్రోకరేజ్ సంస్థ నోమురా అభిప్రాయపడింది. ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే గత ఐదేళ్లుగా రెన్యూవల్ రిజక్షన్ రేటు పెరుగుతోంది. ఐటీ కంపెనీల విషయానికి వస్తే 2016లో 4 శాతంగా ఉన్న రిజెక్షన్ రేటు 2020లో 21 శాతానికి పెరిగింది.

40 శాతం నుండి 50 శాతం
అమెరికాలోని మన ఐటీ కంపెనీల్లో ఎక్కువ మంది ఉద్యోగులు కలిగి ఉన్న సంస్థ టీసీఎస్. టీసీఎస్‌లో 54,874 మంది ఉధ్యోగులు ఉన్నారు. కానీ వీసాపై ఉన్నవారు 40 శాతం మాత్రమే ఉన్నారు. ఇందులో హెచ్1బీ వీసాపై ఉన్నవారు 85 శాతం కాగా, ఇతరులు ఎల్1 వీసాలపై ఉన్నారు. టీసీఎస్ వలె ఇన్ఫోసిస్‌లో కూడా 40 శాతం మంది మాత్రమే వీసాపై ఉన్నారు. టెక్ మహీంద్రా, కాగ్నిజెంట్... ఈ రెండు సంస్థల్లో మాత్రమే సగం మంది ఉద్యోగులు వీసాపై ఉన్నారు. విప్రో, హెచ్‌సీఎల్ టెక్ వీసాలపై అన్నింటి కంటే తక్కువగా ఆధారపడుతున్నాయి. వీటిలో 35 శాతం మంది మాత్రమే ఉన్నారు.

టీసీఎస్, ఇన్ఫోసిస్‍లో స్థానిక-వీసా ఉద్యోగులు ఎంతమంది?
టీసీఎస్‌లో అమెరికాలో మొత్తం 54,874 మంది ఉద్యోగులు ఉన్నారు. ఇందులో ఎల్1 వీసాపై ఉన్నవారు 2,195, హెచ్1బీ వీసా కలిగిన వారు 19,755, స్థానిక ఉద్యోగులు 32,924. వీసాలపై ఉన్నవారు 40 శాతం మంది ఉన్నారు.
- ఇన్ఫోసిస్‌లో అమెరికాలో మొత్తం 28,662 మంది ఉద్యోగులు ఉన్నారు. ఇందులో ఎల్1 వీసాపై ఉన్నవారు 1,003, హెచ్1బీ వీసా కలిగిన వారు 13,042, స్థానిక ఉద్యోగులు 21,737. వీసాలపై ఉన్నవారు 40 శాతం మంది ఉన్నారు.

కాగ్నిజెంట్, టెక్ మహీంద్రాలో స్థానిక-వీసా ఉద్యోగులు ఎంతమంది?
కాగ్నిజెంట్‌లో అమెరికాలో మొత్తం 54,183 మంది ఉద్యోగులు ఉన్నారు. ఇందులో ఎల్1 వీసాపై ఉన్నవారు 2,709, హెచ్1బీ వీసా కలిగిన వారు 24,382, స్థానిక ఉద్యోగులు 27,091. వీసాలపై ఉన్నవారు 50 శాతం మంది ఉన్నారు.
- టెక్ మహీంద్రాలో అమెరికాలో మొత్తం 14,687 మంది ఉద్యోగులు ఉన్నారు. ఇందులో ఎల్1 వీసాపై ఉన్నవారు 1,102, హెచ్1బీ వీసా కలిగిన వారు 6,242, స్థానిక ఉద్యోగులు 7,343. వీసాలపై ఉన్నవారు 50 శాతం మంది ఉన్నారు.

విప్రో, హెచ్‌సీఎల్ టెక్‌లో స్థానిక-వీసా ఉద్యోగులు ఎంతమంది?
విప్రోలో అమెరికాలో మొత్తం 28,662 మంది ఉద్యోగులు ఉన్నారు. ఇందులో ఎల్1 వీసాపై ఉన్నవారు 1,003, హెచ్1బీ వీసా కలిగిన వారు 9,029, స్థానిక ఉద్యోగులు 18,630. వీసాలపై ఉన్నవారు 35 శాతం మంది ఉన్నారు.
- హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌లో అమెరికాలో మొత్తం 22,855 మంది ఉద్యోగులు ఉన్నారు. ఇందులో ఎల్1 వీసాపై ఉన్నవారు 800, హెచ్1బీ వీసా కలిగిన వారు 7,199, స్థానిక ఉద్యోగులు 14,856. వీసాలపై ఉన్నవారు 35 శాతం మంది ఉన్నారు.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..



Click it and Unblock the Notifications