NPS Tax News: ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వేతనజీవులు చాలా కాలంగా ఎదురుచూస్తున్న పన్ను రహిత ఆదాయం పెంపు నిర్ణయంపై నిర్మలమ్మ సానుకూలంగా స్పందించారు. కొత్త టాక్స్ విధానం కింద రూ.12 లక్షల వరకు ఉన్న ఆదాయంపై ఎలాంటి పన్ను చెల్లించవలసిన అవసరం లేదని స్పష్టం చేశారు.
వాస్తవానికి నిర్మలా సీతారామన్ ప్రకటనతో దేశవ్యాప్తంగా ఎక్కువ వేతనాలు అందుకుంటున్న ఉద్యోగుల్లో కొంత సంతోషం కనిపించింది. ముందుగా ఐటీ పరిశ్రమలో పనిచేస్తున్న చాలా మంది తమకు దీని నుంచి పెద్ద ఊరట లభిస్తుందని సంతోషం వ్యక్తం చేశారు. ఇక్కడ ఒక ట్రిక్ ఉపయోగించేవారికి మాత్రం గరిష్ఠంగా రూ.13.7 లక్షల వరకు ఉన్న ఆదాయంపై సున్నా పన్ను చెల్లించాల్సి ఉంటుందని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. అసలు ఇది ఎలా సాధ్యపడుతుందనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం..

ఇక్కడ ప్రభుత్వం అందిస్తున్న స్టాండర్ట్ డిడక్షన్ రూ.75,000లతో పాటు నేషనల్ పెన్షన్ స్కీమ్ బెనిఫిట్స్ కూడా తెలివైన పన్ను చెల్లింపుదారులు వినియోగించుకోవటానికి అవకాశం ఉందని గ్రహించాలి. ఇవి ప్రభుత్వ కొత్త పన్ను విధానం కింద ప్రకటించిన రూ.12 లక్షల మినహాయింపుకు అదనపు పొదుపును జోడిస్తాయి. వాస్తవానికి సెక్షన్ 80CCD(2) కింద పన్ను చెల్లింపుదారులు NPSలో పెట్టుబడి పెట్టిన ఉద్యోగి ప్రాథమిక జీతంలో 14% వరకు పన్ను మినహాయింపు ఉంటుంది. ఓల్డ్ టాక్స్ రీజిమ్ కింద ఇది ప్రాథమిక చెల్లింపులో 10 శాతంగా ఉంది. పెన్షన్ స్కీమ్ ఉపయోగించుకుంటే పన్ను చెల్లింపుదారులు రూ.96,000 మినహాయింపును అందుకుంటారు.
అయితే ఇక్కడ గమనించాల్సిన ఒక విషయం ఏమిటంటే కంపెనీకి అయ్యే ఖర్చులో భాగంగా యజమాని NPS ప్రయోజనాన్ని అందిస్తేనే ఇది సాధ్యం అవుతుంది. ఉద్యోగులు సొంతంగా దీనిని ఎంచుకోవటం కుదరదని గుర్తుంచుకోవాలి. ఆశ్చర్యకరంగా లక్షలాది మంది పన్ను చెల్లింపుదారులు ఈ అవకాశాన్ని వదులుకుంటున్నారు. వాస్తవానికి ఈ ప్రయోజనం 10 ఏళ్ల కిందట అందుబాటులోకి తీసుకురాబడింది. కేవలం కొన్ని కార్పొరేట్ కంపెనీలు మాత్రమే ఈ సౌకర్యాన్ని తమ ఉద్యోగులకు అందించేందుకు ముందుకు రావటం కూడా చాలా మంది దీనికి దూరంగా ఉండటానికి కారణంగా ఉంది.
చాలా మంది ఇన్వెస్టర్లు వాస్తవానికి ఈ స్కీముకు దూరంగా జరగటానికి ప్రధానం కారణం ఉపసంహరణకు ఉన్న పరిమితులు కూడా అని తెలుస్తోంది. అసాధారణ పరిస్థితుల్లో తప్ప పదవీ విరమణకు ముందు డబ్బు తీసుకోలేరు. మెచ్యూరిటీ సమయంలో.. కార్పస్‌లో 60% మాత్రమే విత్‌డ్రా చేసుకోవచ్చు, మిగిలిన 40% జీవితకాల పెన్షన్‌ను పొందేందుకు తప్పనిసరిగా యాన్యుటీలో ఇన్వెస్ట్ చేయాల్సి రావటం కూడా ఉద్యోగులను నిరాశకు గురిచేస్తున్న అంశంగా ఉంది. అయితే దీనిని వినియోగించుకోవటం వల్ల చివరికి పెట్టుబడిదారులకే మేలు జరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు.
More From GoodReturns

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?



Click it and Unblock the Notifications