Tax Filing: స్టాక్ మార్కెట్ ఆదాయానికి ఎలా పన్ను లెక్కిస్తారు.. తెలుసుకోండి..??
Tax Filing: ప్రస్తుతం దేశంలో చాలా మంది తమ డబ్బును స్టాక్ మార్కెట్ ఈక్విటీల్లో పెట్టుబడులుగా పెడుతున్నారు. పెట్టుబడులపై పెరుగుతున్న అవగాహనతో యువత ఎక్కువగా తమ డబ్బును స్టాక్ మార్కెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేసి మంచి రాబడులను పొందుతున్నారు.
అయితే ఇప్పుడు చాలా మందిలో ఉండే అనుమానం దీని నుంచి వచ్చిన ఆదాయానికి ఎలా పన్ను లెక్కిస్తారు అన్నదే. అసలు దీనిపై పన్నులు చెల్లించాలా.. అక్కర్లేదా అనే విషయాలు తెలుసుకోవాలి. స్టాక్ మార్కెట్లో కొనుగోలు చేసిన షేర్లను విక్రయించటం ద్వారా వచ్చిన ఆదాయం బిజినెస్ ఆదాయం లేదా క్యాపిటల్ గెయిన్స్ విభాగం కింద చూపించాల్సి ఉంటుంది. అంటే ఇటీవల మార్కెట్ల ర్యాలీ కారణంగా వాటాలు విక్రయించి లాభాలు సంపాదించిన వారు దీనిని తప్పకుండా గ్రహించాల్సి ఉంటుంది. అయితే పన్నును మీరు అమ్మిన షేర్లను ఎంత కాలం పాటు హోల్డ్ చేశారనే ప్రాతిపధికన లెక్కించటం జరుగుతుంది.

షేర్లను 12 నెలల కంటే తక్కువ కాలంలో కొనుగోలు చేసి అమ్మితే సదరు లాభాలపై షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్, అలాగే 12 నెలల కాలం తర్వాత విక్రయిస్తే దానిపై లాంట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ విధించబడుతుంది. మీరు ట్రేడింగ్ పోర్ట్‌ఫోయోలో షేర్లను కలిగి ఉన్నట్లయితే.. వాటి విక్రయం, కొనుగోలు కారణంగా వచ్చే ఆదాయం లేదా నష్టాన్ని వ్యాపార ఆదాయంగా పరిగణిస్తారు. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్‌లలో ట్రేడింగ్ వల్ల వచ్చే ఆదాయాన్ని నాన్ స్పెక్యులేటివ్ వ్యాపార ఆదాయంగా పరిగణించబడుతుంది.
ఆదాయపు పన్ను చట్టం ప్రకారం షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కింద 15 శాతం, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కింద 10 శాతం సంపాదించిన లాభాలపై పన్ను వసూలు చేయటం జరుగుతుంది. అలాగే ఐపీవోల నుంచి సంపాదించిన ఆదాయాన్ని సైతం ఇదే ప్రాతిపధికన లెక్కిస్తారు. కానీ ఇందులో హోల్డింగ్ పిరియడ్ షేర్లను అలాట్ చేసిన రోజు నుంచి లెక్కించటం జరుగుతుందని గుర్తుంచుకోండి.


Click it and Unblock the Notifications