Credit Card Transactions: ఆదాయపుపన్ను అధికారుల నుంచి ఇటీవలి కాలంలో ప్రజలకు అనేక కారణాల వల్ల నోటీసులు వస్తున్నాయి. కొందరికి వారు ఫైల్ చేసిన టాక్స్ రిటర్న్స్ వల్ల నోటీసులు వస్తుండగా.. మరికొందరికి మాత్రం క్రెడిట్ కార్డుల్లో చేస్తున్న కొన్ని ట్రాన్సాక్షన్లు కారణంగా మారుతున్నాయి. దేశంలో బ్యాంకింగ్ సంస్థలతో పాటు అనేక ఇతర సంస్థలు క్రెడిట్ కార్డులను ప్రజలకు విస్తృతంగా జారీ చేస్తున్న వేళ వీటికి సంబంధించిన నిబంధనలు తెలియని కొందరు మాత్రం చిక్కుల్లో పడుతున్నారు. ఐటీ అధికారులు ప్రజలకు సంబంధించిన వివిధ ట్రాన్సాక్షన్లపై ఓకన్నేసి ఉంచుతున్నందున నోటోసులు వస్తున్నాయి.
ముందుగా పెద్ద మెుత్తంలో డిపాజిట్లు లేదా విత్ డ్రా గురించి ఐటీ అధికారుల కన్ను ఉంటుంది. సేవింగ్స్ కాతాలో రూ.10 లక్షలు, కరెంట్ ఖాతాలో రూ.50 లక్షల వరకు చేసే ట్రాన్సాక్షన్లపై పన్ను అధికారుల పరిశీలన ఉంటుంది. అలాగే రియల్ ఎస్టేట్ కి సంబంధించి రూ.30 లక్షలకు పైబడి చేసే ట్రాన్సాక్షన్లను పన్ను అధికారులు పరిగణలోకి తీసుకుంటుంటారు. ఇక పెట్టుబడులపై కూడా పన్ను నోటీసులు వచ్చే అవకాశం ఉంది. మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్, బాండ్స్ వంటి సాధనాల్లో రూ.10 లక్షల కంటే ఎక్కువ పెట్టుబడులు పెట్టినప్పుడు వాటికి సంబంధించిన ఆదాయ వనరుల గురించి సరిపోల్చి చూస్తుంటారు. అయితే ఎక్కువ పెట్టుబడులు ఉన్నంత మాత్రాన ఖచ్చితంగా నోటీసులు రావాలని లేదు. కానీ సదరు వ్యక్తి ఫైల్ చేసిన ఐటీఆర్ ఆదాయానికి, వారి పెట్టుబడులకు చారిత్రికంగా సరిపోల్చి చూస్తారు. వీటికి సంబంధించి అధికారిక రాబడుల వివరాలను ఇన్వెస్టర్లు ఐటీ అధికారులు అడిగితే ప్రూఫ్ అందించాల్సి ఉంటుంది.

ఒక వ్యక్తి బ్యాంక్ ఖాతాలోని ట్రాన్సాక్షన్స్, అతను ఫైల్ చేసిన ఐటీఆర్‍లోని వివరాలు పరిశీలించినప్పుడు వ్యత్యాసాలను గుర్తిస్తే పన్ను అధికారులు వాటిపై వివరణ అడుగుతూ మీకు నోటీసులు పంపిస్తారు. ఖాతాదారులు అసలు రూ.10 లక్షల కంటే ఎక్కువ ట్రాన్సాక్షన్లు నిర్వహిస్తే వాటికి సంబంధించిన వివరాలు వెంటనే తమకు అందించాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ దేశంలోని అన్ని బ్యాంకులకు, కోఆపరేటివ్ బ్యాంకులకు ఇప్పటికే ఆదేశాలు జారి చేసింది. కాబట్టి వ్యక్తులు ఈ వివరాలను దాచటానికి ప్రయత్నించినప్పటికీ.. అవి పన్ను అధికారులు తెలిసిపోతాయని గుర్తుంచుకోండి.
క్రెడిట్ కార్డుల విషయంలో..
బిల్లింగ్ సైకిల్ లో క్రెడిట్ కార్డ్ వినియోగదారులు రూ.లక్ష లేదా అంతకంటే ఎక్కువ నగదు చెల్లింపులు చేసేతే వాటి వివరాలను ఐటీఆర్ సమయంలో తప్పనిసరిగా బహిర్గతం చేయాలి. ఒక పూర్తి ఆర్థిక సంవత్సరంలో రూ.10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ మెుత్తం క్రెడిట్ కార్డు చెల్లింపులు చేసినప్పుడు వాటిపై పన్ను అధికారుల దృష్టి ఉంటుంది. అలాగే ట్రావెలర్స్ చెక్, ఫారెక్స్ కార్డ్‌లు, డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్‌లతో సహా విదేశీ మారకద్రవ్యం కొనుగోలు మొత్తం రూ.10 లక్షల వరకు ఉన్నప్పుడు సైతం వాటి వివరాలను పన్ను ఫైలింగ్ సమయంలో వ్యక్తులు తప్పనిసరిగా వెల్లడించాల్సి ఉంటుంది.
క్రెడిట్ కార్డ్ లావాదేవీలన్నింటినీ ఆదాయపు పన్ను శాఖ పర్యవేక్షిస్తున్నందున, మీరు ఖర్చు పరిమితిని మించకూడదని గుర్తుంచుకోండి. మీ క్రెడిట్ కార్డ్ వివరాలు మీ పాన్ కార్డ్‌కి లింక్ చేయబడతాయి. మీ ఖర్చులన్నీ ప్రభుత్వం ఎలక్ట్రానిక్‌గా ట్రాక్ చేస్తూనే ఉంటుంది. కాబట్టి పన్ను ఫైలింగ్ సమయంలో వీటి వివరాలు అస్సలు దాచటానికి ప్రయత్నించకూడదు. అలా చేస్తే నోటీసులతో పాటు పెనాల్టీలు కూడా చెల్లించాల్సి రావచ్చు.

పన్ను శాఖ నోటీసులు ఇవ్వకుండా ఏం చేయాలి?
పైన మాట్లాడుకున్నట్లుగా క్రెడిట్ కార్డ్‌లో అనేక ప్రయోజనాలు పొందుతున్నప్పటికీ.. పన్ను నోటీసులను నివారించడానికి ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం. ఆదాయపు పన్ను శాఖ నోటీసులు సాధారణంగా పన్ను వ్యవస్థలో నమోదు చేయబడిన డేటా ఆధారంగా జారీ చేయబడతాయి. అటువంటి నోటీసులను నివారించడానికి, పన్ను చెల్లింపుదారులు తమ పన్ను రిటర్న్‌లు సకాలంలో దాఖలు చేయటంతో పాటుగా.. ITRలో ప్రకటించబడిన ఆదాయం ఫారమ్ 26ASలోని సమాచారంతో సరిపోలుతుందని నిర్ధారించుకోవాలి. ప్రస్తుతం ఐటీ శాఖ ఏఐ టూల్స్ వినియోగించి వీటిని ట్రాక్ చేస్తున్నందున పొరపాటున కూడా తప్పుడు వివరాలు అందించకూడదు.
More From GoodReturns

New rules: ఏప్రిల్ 1 నుండి కొత్త రూల్స్! మీ శాలరీ, టాక్స్ నిబంధనల్లో కీలక మార్పులు!

Form 16: ఫామ్-16 స్థానంలో ఫామ్-130.. మీ శాలరీ, టాక్స్ వివరాల్లో రాబోతున్న పెద్ద మార్పులివే!

దుబాయ్‌లో క్రెడిట్ కార్డుతో ఇల్లు బుక్ చేసుకుంటున్నారా.. అయితే ఈ ఆర్బీఐ హెచ్చరిక గురించి తప్పక తెలుసుకోండి..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications