Sah Polymers IPO: కొత్త సంవత్సరంలో వస్తున్న ఐపీవోలు ఇన్వెస్టర్లు, మార్కెట్ వర్గాలు అంచనాలను మించి పనితీరు కనబరుస్తున్నాయి. చిన్నవేకదా అనుకుంటే చిచ్చుబుడ్డిలా ఇన్వెస్టర్ల జీవితాల్లో కాంతులు నింపుతున్నాయి. ఈరోజు మార్కెట్లోకి వచ్చిన ఐపీవో సైతం ఈ కోవకు చెందినదే. గత కొంత కాలంగా మార్కెట్లో ఈ ఐపీవోనూ చాలా మంది నిశితంగా పరిశీలిస్తున్నారు.

ఐపీవో బంపర్ లిస్టింగ్..
సాహ్ పాలిమర్స్ స్టాక్ మార్కెట్‌లో సూపర్ ఎంట్రీ ఇచ్చింది. ఒక్కో షేర్ ధర రూ.100 కంటే తక్కువ ధర కలిగి ఉన్న ఐపీవో నమ్మన ఇన్వెస్టర్లకు మాత్రం బలమైన రాబడులను అందించింది. తొలిరోజే మార్కెట్ అరంగేట్రంలో దాదాపుగా 30 శాతానికిపైగా ప్రీమియం రేటుకు జాబితా చేయబడింది. బీఎస్ఈ సూచీలో 30.77% ప్రీమియంతో రూ.85 వద్ద లిస్ట్ అయ్యాయి.

ఒక్కో షేరుపై లాభం..
ఐపీవోలో స్టాక్స్ ఎలాట్ అయిన ఇన్వెస్టర్ల పంట పడిందనే చెప్పుకోవాలి. అలా షేర్లు కేటాయించబడిన వారికి ఒక్కో షేరుపై రూ.20 లాభాన్ని ఆర్జించారు. లిస్టింగ్ అయిన కొద్దిసేపటికే కంపెనీ షేర్లు అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. ఇది ఇన్వెస్టర్లు ఊహించిన దానికంటే అత్యధిక పనితీరు.

ఇష్యూ ధర ఇలా..
లిస్టింగ్ తర్వాత బీఎస్‌ఈలో కంపెనీ షేర్లు 5 శాతం వరకు పెరిగాయి. ఆ తర్వాత షా పాలిమర్స్ షేరు ధర రూ.89.25కి చేరుకుంది. కంపెనీ IPO సమయంలో కంపెనీ షేర్లకు రూ. 61-65ను ప్రైస్ బ్యాండ్ గా నిర్ణయించింది. అయితే లిస్టింగ్ సమయానికి షా పాలిమర్స్ షేరు ధర ఇష్యూ ధర కంటే దాదాపుగా 37 శాతం వరకు పెరిగి ఇన్వెస్టర్లను ధనవంతులుగా మార్చాయి.

IPO సబ్‌స్క్రిప్షన్ వివరాలు..
NSEలో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం IPO 56,10,000 షేర్లకు వ్యతిరేకంగా 9,79,44,810 షేర్లకు బిడ్లను అందుకుంది.రిటైల్ ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ (RII) కేటగిరీ 39.78 రెట్లు సబ్‌స్క్రయిబ్ కాగా, నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ సెగ్మెంట్ 32.69 రెట్లు సబ్‌స్క్రయిబ్ అయింది.అయితే క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బయ్యర్ (QIB) షేర్ 2.40 రెట్లు సబ్‌స్క్రైబ్ చేయబడింది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు



Click it and Unblock the Notifications