Income Tax Bill 2025: ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొత్త ఆర్థిక సంవత్సరం కోసం వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో ఆదాయపన్ను చట్టంలో పన్ను రహిత ఆదాయ పరిమితిని కొత్త టాక్స్ విధానం కింద రూ.12 లక్షలకు పెంచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నిర్మలా సీతారామన్ ఇన్కమ్ టాక్స్ బిల్ 2025ను త్వరలోనే పార్లమెంటులో ప్రవేశపెడతామని చెప్పారు.
ఈ క్రమంలోనే ప్రభుత్వం ఆదాయపు పన్ను బిల్లు 2025ను పార్లమెంట్ ముందుకు ఫిబ్రవరి 13న ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. ఈ బిల్లు కింద సంక్లిష్టంగా ఉన్న పన్ను చట్టంలోని అంశాలను సరళీకృతం చేయాలని మోదీ సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇది పన్ను ఫైలింగ్ ప్రక్రియలో సమస్యలను తగ్గించి సులభతరం చేస్తుందని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. ఈ కొత్త బిల్లులో 23 అధ్యాయాలు, 16 షెడ్యూల్‌లు, 536 క్లాజులు ఉన్నాయి.

ఈక్రమంలో అసెస్మెంట్ ఇయర్ పదాన్ని టాక్స్ ఇయర్ రీప్లేస్ చేయనుందని తెలుస్తోంది. అలాగే ప్రీవియస్ ఇయర్ పదాన్ని ఫైనాన్షియల్ ఇయర్ అనే పదంలో మార్పులు జరగనున్నాయని వెల్లడింది. పన్ను సంవత్సరం ఏప్రిల్ 1 నుండి ప్రారంభమయ్యే 12 నెలల కాలాన్ని సూచిస్తుంది. దీనిని ఆర్థిక సంవత్సరంతో అలైన్ చేయాలని నిర్ణయించబడింది. అలాగే కొత్త ఆదాయపు పన్ను చట్టం బిల్లులో డిజిటల్ ట్రాన్సాక్షన్లు, క్రిప్టో ఆస్తులకు సంబంధించిన సమాచారం కూడా ఉండనుంది. అలాగే పన్ను చెల్లింపుదారుల రక్షణతో పాటు పారదర్శకతను పెంచేందుకు కీలక మార్పులు ఉండనున్నట్లు వెల్లడైంది.
ప్రముఖ వార్తా సంస్థల నివేదిక ప్రకారం షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ రేట్ల విషయంలో ఎలాంటి మార్పులు ఉండబోవని వెల్లడించబడింది. జూలై 2024 మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టిన సమయంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ 20 శాతానికి పెంచగా, లాంట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ పన్ను రేటును 12.5 శాతానికి పెంచిన సంగతి తెలిసిందే.
న్యూ టాక్స్ రీజిమ్ కింద మారిన శ్లాబ్ రేట్లు..
*రూ.4 లక్షల వరకు - ఎలాంటి పన్ను ఉండదు
*రూ.4 లక్షల నుంచి రూ.8 లక్షల వరకు ఆదాయంపై 5 శాతం పన్ను
*రూ.8 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు ఆదాయంపై 10 శాతం పన్ను
*రూ.12 లక్షల నుంచి రూ.16 లక్షల వరకు ఆదాయంపై 15 శాతం పన్ను
*రూ.16 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ఆదాయంపై 20 శాతం పన్ను
*రూ.20 లక్షల నుంచి రూ.24 లక్షల వరకు ఆదాయంపై 25 శాతం పన్ను
* రూ.24 లక్షలకు పైగా ఉన్న ఆదాయంపై 30 శాతం పన్ను విధించబడుతుంది
పాత పన్ను విధానం కింద ఉద్యోగులు రూ.50 వేల వరకు ఆదాయాన్ని స్టాండర్డ్ డిడక్షన్ రూపంలో మినహాయింపుగా పొందవచ్చు. ఈ క్రమంలో వారికి ఉన్ వాస్తవ వేతన ఆదాయం లేదా రూ.50 వేలు వీటిలో ఏది తక్కువైతే అది క్లెయిమ్ చేసుకునేందుకు పన్ను చట్టంలో వెసులుబాటు కల్పించబడింది. అలాగే పెన్షన్ దారులు డిఫెన్స్ సర్వీసెస్, కేంద్రప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పొందే ఆదాయం పూర్తి మినహాయింపులు అర్హతను కలిగి ఉంటుంది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..



Click it and Unblock the Notifications