Dhanteras-2022: భారతీయులకు బంగారంపై ఉండే మక్కువ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. అయితే ప్రస్తుతం.. బంగారాన్ని మోటపద్ధతిలో కాకుండా అనేక మార్గాల్లో కొనుగోలు చేసేందుకు అనేక మార్గాలు అందుబాటులోకి వచ్చాయి. కనీసం రూ.50 నుంచి కూడా బంగారాన్ని కొనగులోచేసుకునేందుకు వెసులుబాటు ఉంది.

పెట్టుబడికి ముందుచూపు..
గోల్డ్ ఇన్వెస్ట్ మెంట్ చాలా మందికి ఇష్టం. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం పరిస్థితులు అలుముకున్న వేళ సేఫ్ హెవెన్ గా భావించే బంగారాన్ని కొనటానికి ప్రయత్నిస్తున్నారు. అయితే దీనిలో పన్ను ప్రయోజనాలు పొందటానికి కూడా మార్గాలు ఉన్నాయి. పెట్టుబడి కోసం అయితే ఒకలాగా..? ఆభరణాల కోసం అయితే మరో పద్ధతి అవసరం. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. టాక్స్ బెనిఫిట్స్ సైతం గమనిద్దాం..

టాక్స్ ఆన్ గోల్డ్ ట్రాన్సాక్షన్స్..
బంగారం కొనుగోలు చేసి అమ్మేటప్పుడు వచ్చే ఆదాయంపై క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. ఇది షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ అంటూ రెండు విధాలుగా ఉంటుంది. ఎవరైనా వ్యక్తి బంగారాన్ని కొనుగోలు చేసి మూడేళ్లలోపు అమ్మితే.. దానిపై షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ చెల్లించాల్సి ఉంటుంది. అదే విధంగా 3 ఏళ్ల తర్వాత అమ్మితే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ చెల్లించాలని ఆదాయపు పన్ను చట్టాలు చెబుతున్నాయి.

ఫిజికల్ గోల్డ్..
24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం బిస్కెట్లు, నాణేలు, బార్స్ రూపంలో లభిస్తుంది. ఆభరణాలకు 22 క్యారెట్ల బంగారం మంచి ఎంపిక. వీటిని విక్రయించినప్పుడు ఆదాయపు పన్ను రూల్స్ ప్రకారం వర్తించే స్లాబ్ రేట్ల ప్రకారం టాక్స్ లెక్కించటం జరుగుతుంది. ఈ రూల్స్ టాక్స్ పేయర్స్ కోసమే.. బంగారం క్రయవిక్రయాలు చేసే వ్యాపారులకు కాదు. వ్యాపారులకు భౌతిక బంగారం కొనుగోళ్లపై 3% జీఎస్‌టీ, తయారీ ఛార్జీలపై 5% జీఎస్‌టీ వర్తిస్తుంది.

గోల్డ్ ETF's, గోల్డ్ ఫండ్స్..
గోల్డ్ ఈటీఎఫ్‌లు స్టాక్ ఎక్స్ఛేంజ్ లో ట్రేడ్ అవుతాయి. ఒక్కో గోల్డ్ ఈటీఎఫ్ ఒక గ్రాము బంగారంతో సమానం. వీటి ట్రేడింగ్ ద్వారా వచ్చిన ఆదాయాన్ని సైతం ఫిజికల్ గోల్ట్ రూల్స్ ప్రకారం టాక్స్ పరిధిలోకి వస్తుంది. ఆ లెక్కల ప్రకారమే పన్ను లెక్కిస్తారు. ఇక డిజిటల్ గోల్డ్ అంటే మెుబైల్ వాలెట్లలో కొన్న దాని విషయంలోనూ టాక్సులు ఫిజికల్ గోల్డ్ మాదిరిగానే ఉంటాయి.

సావరిన్ బాండ్స్..
సావరిన్ గోల్డ్ బాండ్లను కేంద్ర ప్రభుత్వం విక్రయిస్తుంది. వీటికి మెచ్యూరిటీ గడువు ఉంటుంది. ఐదేళ్ల తర్వాత ఎప్పుడైనా విత్ డ్రా చేసుకునేందుకు వెసులుబాటు ఉంటుంది. పూర్తి లాక్ ఇన్ పిరియడ్ హోల్డ్ చేసి విక్రయిస్తే వచ్చిన ఆదాయంపై ఎలాంటి టాక్స్ ఉండదు. కానీ మధ్యలో ఐదేళ్ల తర్వాత విత్ డ్రా చేస్తే వచ్చిన లాభంపై లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ టాక్స్ 20 శాతం చొప్పుడు లెక్కిస్తారు.

గోల్డ్ మానిటైజేషన్..
గోల్డ్ మానిటైజేషన్ విధానాన్ని కేంద్రం 2015లో తీసుకొచ్చింది. దీని కింద ఇంట్లో వినియోగించకుండా ఉన్న బంగారాన్ని స్కీమ్ కింద డిపాజిట్ చేయవచ్చు. దీనిపై వడ్డీ కూడా లభిస్తుంది. దీనిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఆదాయంపై టాక్స్ ప్రయోజనాలను అందిస్తోంది. క్యాపిటల్ గెయిన్స్ పై ఎలాంటి పన్ను ఉండదని తెలిపింది.

ఈరోజు బంగారం ధరలు..
గత నెల నుంచి చూస్తే బంగారం ధరలు తగ్గినట్లే తగ్గి.. మళ్లీ రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.47 వేలుగా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.51,280గా ఉంది. బంగారం ధర సెప్టెంబర్ నెల 16న రూ.45,800 వద్ద కనిష్ఠాన్ని తాకింది. అయితే ప్రస్తుతం దీపావళితో పాటు పండుగల డిమాండ్ కారణంగా ధరలు పెరగటం మెుదలైంది.
More From GoodReturns

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం, వెండి ధరలు: MCXలో లాభాలు, మధ్యప్రాచ్య ఉద్రిక్తతల ప్రభావంపై కీలక విషయాలు వెల్లడి!

బంగారం, వెండి ధరలు: ఇరాన్ వార్ కారణంగా భారత్‌లో భారీగా పెరిగిన ధరలు - కారణాలు, ప్రభావాలు

బంగారం ధర పెరిగింది .. కొనుగోలు వెంటనే బంద్ చేయండి.. మార్చి 10, మంగళవారం ధరలు ఇవే..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

బంగారం ధరల పెరుగుదలపై షాకింగ్ న్యూస్.. సంచలన విషయాలను వెల్లడించిన SBI రీసెర్చ్..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఢమాల్..ఈ రోజు ఎంత తగ్గిందో తెలిస్తే పండగ చేసుకుంటారు .. మార్చి 4,బుధవారం ధరలు ఇవే..

10 గ్రాములు బంగారం ధర రూ. 3 లక్షలకు చేరబోతోంది.. సంచలన అంచనాను విడుదల చేసిన క్రిస్ వుడ్..



Click it and Unblock the Notifications