Success Story: ఒకప్పుడు కేవలం పాల వ్యాపారిగా ఉన్న వ్యక్తి దేశంలో ఒక బ్యాంకును స్థాపించగలడా. దానిని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లగలడా అంటే అవుననే చెప్పుకోవాలి. దీని ద్వారా అతడు ప్రస్తుతం ధనవంతుడయ్యాడు. అతను పేదరికం నుంచి ఉన్నత స్థాయికి ఎలా చేరుకున్నాడు. అతడి విజయం వెనుక ఉన్న రహస్యాన్ని ఇప్పుడు తెలుసుకుందాం..

ఆత్మవిశ్వాసంతో ముందుకు..
శ్రద్ధగా పని చేయడం, మనపై మనం నమ్మకం ఉంచడం ద్వారా భవిష్యత్తును మెరుగుపరచుకోవచ్చు. ఇదే విషయాన్ని చంద్రశేఖర్ ఘోష్ విశ్వసించారు. ఒకప్పుడు డబ్బుకు ఆకర్షితుడై కోటీశ్వరుడు అయ్యాడు. ప్రస్తుతం చంద్రశేఖర్ ఘోష్ బంధన్ బ్యాంక్ CEO, మేనేజింగ్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. పేదరికం నుంచి జీవితానికి అవసరమైన సూక్ష్మ నైపుణ్యాలను నేర్చుకుని ప్రస్తుతం విజయాల బాటలో నడుస్తున్నారు. ఇది ఆయన జీవితంతో పాటు మిలియన్ల మంది జీవితాలను కూడా మార్చింది.

చిన్నతనంలో పాలు అమ్ముతూ..
చంద్రశేఖర్ ఘోష్ త్రిపురలోని అగర్తలాలో జన్మించారు. చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. చంద్రశేఖర్ ఘోష్ తండ్రికి చిన్న స్వీట్ షాప్ ఉంది. అతడు చిన్నతనంలో పాలు అమ్మేవాడు. ఆశ్రమంలో అందించే ఆహారంతో కడుపు నింపుకునేవాడు. ట్యూషన్లు చెప్పి వచ్చిన డబ్బుతో చదువును కొనసాగించాడు. పశ్చిమ బెంగాల్‌లోని మహిళలకు ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున రుణం ఇవ్వడం ద్వారా బంధన్ బ్యాంక్ యజమానిగా మారారు.

జీవితాన్ని మార్చేసిన ఆలోచన..
చంద్రశేఖర్ తన కుటుంబానికి సహాయం చేయడానికి రూ.5,000 జీతంతో చాలా కాలం పాటు పనిచేశారు. ఆ తర్వాత 1990ల చివరిలో.. వేరే ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ సమయంలో అతను బంగ్లాదేశ్‌లో మహిళా సాధికారత కోసం పనిచేస్తున్న విలేజ్ వెల్ఫేర్ సొసైటీ అనే NGOలో ప్రోగ్రామ్ హెడ్‌గా పనిచేయడం ప్రారంభించారు. అలాంటి మహిళలకు ఆర్థిక సహాయం అందిస్తే అనేక చిన్న పరిశ్రమలు ప్రారంభించవచ్చని, తద్వారా ఆ మహిళల జీవితాలతో పాటు దేశ ప్రగతి కూడా బాగుంటుందనే ఆలోచనతో ముందుకొచ్చారు.

వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యం..
చంద్రశేఖర్ కృషితో అనతి కాలంలోనే బంధన్ మైక్రో ఫైనాన్స్ బ్యాంక్ దేశంలో ఉన్నత స్థాయికి చేరుకుంది. ప్రస్తుతం ఈ బ్యాంక్ 2000 కంటే ఎక్కువ శాఖలను కలిగి ఉంది. 0 పోర్ట్‌ఫోలియో రిస్క్, 100% రికవరీ రేటుతో పని చేస్తోంది. ఇది సామాజిక మార్పుపై దృష్టి సారించిన ప్రముఖ ఏజెన్సీ అని చైర్మన్ అశోక్ లాహిరి చెప్పారు. కోల్‌కతాలోని ఒక చిన్న పట్టణంలో నివసిస్తున్న 25 మంది నిరుపేద మహిళలకు సహాయం చేయడానికి ఈ సంస్థను మొదట చంద్రశేఖర్ ఘోష్ ప్రారంభించారు. ఆ మహిళల సగటు ఆదాయం గతంలో రూ.300 మాత్రమే ఉండగా.. ప్రస్తుతం రూ.2000కు పెరిగింది. బ్యాంక్ ప్రస్తుతం రూ.30 వేల కోట్ల వ్యాపారాన్ని నిర్వహిస్తోంది.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?



Click it and Unblock the Notifications