Jai Anmol Ambani: గడచిన కొన్ని నెలలుగా అనిల్ అంబానీ పేరు దేశీయంగా వార్తల్లో తిరిగి వినిపిస్తోంది. దివాలా తర్వాత దశాబ్ధకాలంగా కనుమరుగైన వ్యాపారవేత్త తిరిగి మీడియా ఫోకస్ లోకి రావటం వెనుక పెద్ద కథే ఉంది.
అంబానీలు అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చే పేరు ముఖేష్ అంబానీ. అయితే ఆయన సోదరుడు అనిల్ సైతం ఒకప్పుడు ప్రపంచ కుబేరుల జాబితాలో నిలిచిన వ్యక్తి. ప్రస్తుత తరానికి అనిల్ అంబానీ గురించి చాలా తక్కువ తెలుసు. పతనం తర్వాత అనిల్ తిరిగి పాతాళం నుంచి పైకి వస్తున్నారు. దీని వెనుక యువ వ్యాపారవేత్త జై అన్మోల్ అంబానీ ఉన్నారు. అన్మోల్ అంబానీ అనిల్ పెద్ద కుమారుడు. ప్రస్తుతం అతను తండ్రి సంపదను పునరుద్ధరించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.

అనేక ఆర్థిక సవాళ్లతో పాటు భారీ అప్పుల ఊబిలో అనిల్ అంబానీకి చెందిన కంపెనీలు మునిగిపోవటంతో బిలియనీర్ అనిల్ 2020లో దివాలా తీసిన సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత అనిల్ ఇద్దరు కుమారులు జై అన్మోల్ అంబానీ, జై అన్షుల్ అంబానీలు రిలయన్స్ క్యాపిటల్ లిమిటెడ్‌లో చేరారు. అసలు కథ ఇక్కడి నుంచే ప్రారంభమైంది. వారి రాకతో గ్రూప్ కంపెనీల షేర్లు వేగంగా తిరిగి పుంజుకోవటం ప్రారంభించాయి. జై అన్మోల్ అంబానీ నికర విలువ 3.3 బిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీ లెక్కల ప్రకారం సుమారు రూ.20,000 కోట్ల కంటే ఎక్కువగా ఉంది.
అన్మోల్ అంబానీ ముంబైలోని కేథడ్రల్, జాన్ కానన్ స్కూల్‌లో తన ప్రారంభ విద్యను అభ్యసించాడు. తర్వాత UKలోని సెవెనోక్స్ స్కూల్‌లో చదివాడు. అతను వార్విక్ బిజినెస్ స్కూల్ నుంచి బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ డిగ్రీని పొందాడు. విద్యను పూర్తి చేసిన తర్వాత, జై అన్మోల్ అంబానీ భారతదేశానికి తిరిగి వచ్చి రిలయన్స్ క్యాపిటల్‌లో ట్రైనీగా తన వృత్తిని ప్రారంభించాడు. 2016లో రిలయన్స్ క్యాపిటల్ బోర్డులో అదనపు డైరెక్టర్ అయ్యాడు. తర్వాత ఏడాదిలోనే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ స్థాయికి వెళ్లారు. అలా 2018లో రిలయన్స్ నిప్పన్ లైఫ్ అసెట్ మేనేజ్‌మెంట్, రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ బోర్డులలో కూడా చేరాడు.
జై అన్మోల్ అంబానీ, అతని భార్య క్రిషా షా మిగిలిన కుటుంబ సభ్యులతో పాటు ముంబై బాంద్రాలో విలాసవంతమైన 17-అంతస్తుల బంగ్లా అబోడ్‌లో నివసిస్తున్నాడు. ఈ నివాసం దేశంలోనే అత్యంత ఖరీదైన ఇళ్లలో ఒకటి. దీని మార్కెట్ విలువ సుమారు రూ.5,000 కోట్లని అంచనా. అన్మోల్ రోల్స్ రాయిస్ ఫాంటమ్, లంబోర్ఘిని గల్లార్డో వంటి కార్లతో పాటు హెలికాప్టర్, విమానం కూడా కలిగి ఉన్నాడు. అన్మోల్ అంబానీ నికుంజ్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ మాజీ ఛైర్మన్, ఎండీ దివంగత నికుంజ్ షా కుమార్తె క్రిషా షాను వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం తండ్రి విజయం వెనుక అన్మోల్ కీలక పాత్ర పోషిస్తున్నారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications