Income Tax: ఇటీలవ బడ్జెట్ సమావేశంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొత్త టాక్స్ విధానం కింద రూ.7 లక్షల వరకు ఆదాయం టాక్స్ రహితమైనదిగా వెల్లడించారు. అయితే కొత్త పన్ను విధానం కింద కనిష్ఠ పన్ను మినహాయింపులు ఉంటాయి. కొత్త విధానం కింద ఎలాంటి పన్ను మినహాయింపులు ఉండవనేది చాలా మందిలో ఉన్న అపోహ.

టాక్స్ ఫైలింగ్..
ఎవరైనా ఆదాయపు పన్ను పరిధిలోకి వచ్చే వ్యక్తి పాత, కొత్త రెండు పద్ధతుల కింద టాక్స్ లెక్కించుకుని దేనిలో తక్కువ ఉంటే దానిని ఎంచుకుంటుంటారు. అయితే కొత్త విధానం కింద ముందుగా పన్ను చెల్లింపుదారునికి రూ.50 వేలు స్టాండర్డ్ డిడక్షన్ ఉంటుంది. ఇది డిఫాల్ట్‌గా అందించబడుతుంది. జీతం ఆదాయం పొందేవారు, పెన్షనర్లకు ఇది ఉంటుంది. వ్యాపారవేత్తలకు, స్వయం ఉపాధి పొందేవారికి ఈ తగ్గింపు లభించదు.

NPS కింద తగ్గింపులు..
నేషనల్ పెన్షన్ సిస్టం కింద ఉద్యోగులు అందించే బేసిక్ పే 10 శాతం, ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో 14 శాతం వరకు సెక్షన్ 80CCD(2) కింద పన్ను మినహాయింపు లభిస్తుంది. దీని కింద గరిష్ఠంగా ఏడాదికి రూ.7.5 లక్షల వరకు పన్ను మినహాయింపు పరిమితి లభిస్తుంది. అదే విధంగా ప్రావిడెండ్ ఫండ్ కంపెనీ చెల్లించే 12 శాతం సొమ్ము కూడా టాక్స్ డిడక్షన్ పొందేందుకు అనమతి ఉంది. అయితే దీనికి గరిష్ఠ పరిమితి రూ.7.5 లక్షలుగా ఉంది.

ఇంటి అద్దె..
మీరు అద్దెకు ఇచ్చిన ఆస్తిని మీరు కలిగి ఉన్నట్లయితే, మీ లెట్ అవుట్ ప్రాపర్టీ వార్షిక విలువపై 30 శాతం స్టాండర్డ్ డిడక్షన్‌ను మీరు క్లెయిమ్ చేయవచ్చు. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), సుకన్య సమృద్ధి యోజనలో చేసిన పెట్టుబడుల నుంచి మెచ్యూరిటీ రాబడిపై మీరు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు . అయితే కొత్త టాక్స్ విధానంలో ఈ ఖాతాల్లో చేసిన పెట్టుబడులు పాత టాక్స్ విధానం అందించే రూ.1.50 లక్షల వరకు సెక్షన్ 80C తగ్గింపులకు అర్హులు కాదు. అలాగే ఏప్రిల్ 1, 2023 తర్వాత కొనుగోలు చేసిన రూ.5 లక్షల వరకు విలువైన ఎండోమెంట్ పాలసీ విషయంలో పాలసీదారుడు మరణించినప్పుడు ఆ సొమ్ము మెుత్తాన్ని నామినీలు క్లెయిమ్ చేసుకున్నట్లయితే ఆ సొమ్ము పూర్తిగా టాక్స్ రహితమైనది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications