న్యూఢిల్లీ: దేశంలోని రైతుల ఆదాయం రెట్టింపు చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. శనివారం పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా ఆమె ప్రసంగించారు. త్వరగా పాడైపోయే వ్యవసాయ ఉత్పత్తుల కోసం శీతలీకరణ గిడ్డంగులను భారీ మొత్తంలో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
పీపీపీ పద్ధతిలో భారత రైల్వే కిసాన్ రైల్ పేరుతో త్వరితగతిన సరుకు రవాణా చేసేందుకు వీలు కల్పిస్తామని, దీని ద్వారా వ్యవసాయ ఉత్పత్తులు పాడైపోకముందే వినియోగదారులకు చేరేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. జాతీయ స్థాయిలో కోల్డ్ సప్లై చైన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. కృషి ఉడాన్ ఎంఓసీఏ ద్వారా జాతీయ, అంతర్జాతీ మార్గాల్లో ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు.

అగ్రికల్చర్ వేర్ హౌసింగ్‌కు నాబార్డ్.. మ్యాప్, జీయో ట్యాగ్ చేస్తుందని మంత్రి వివరించారు. రైతులకు కావాల్సిన సాయాన్ని నాబార్డ్ అందిస్తుందని తెలిపారు. ఎస్‌హెచ్‌జీల ద్వారా గ్రామీణ స్టోరేజీ స్కీం పనిచేస్తుందని చెప్పారు. ఇది స్టోరేజీ కోసం వెచ్చించే ఖర్చును తగ్గిస్తుందని తెలిపారు. మహిళలు మరోసారి ధన్యలక్ష్మీలుగా కీర్తించబడతారని అన్నారు.
వ్యవసాయ ఉత్పత్తుల కోసం 'వన్ ప్రొడక్ట్, వన్ డిస్ట్రిక్ట్' పేరుతో రాష్ట్రాలకు అండగా ఉంటామని తెలిపారు. రూ .15 లక్షల కోట్ల వ్యవసాయ రుణ లభ్యత లక్ష్యంగా ఉందని తెలిపారు. 2025 నాటికి పశువుల పాదం, నోటికి సంబంధించిన ఇతర వ్యాధులను లేకుండా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. అంతేగాక, వ్యవసాయ రంగం, రైతులకు కేంద్ర ప్రభుత్వం పలు వరాలు ప్రకటించింది.
రైతులకు 20 లక్షల సోలార్ పంపు సెట్లు అందిస్తున్నామని తెలిపారు. బీడు భూముల్లో సోలార్ విద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు పెట్టుబడి సాయం చేస్తామన్నారు. భూసార పరిరక్షణకు అదనపు సాయం, సంస్కరణలు తీసుకొస్తున్నామని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. పీపీపీ పద్ధతిలో ఎఫ్‌సీఐ, కేంద్ర గిడ్డంగుల సంస్థ సంయుక్తంగా గిడ్డంగుల నిర్మాణం చేపడతామన్నారు. వర్షాభావ జిల్లలకు అదనంగా నిధులు, సాగునీటి సౌకర్యం కల్పిస్తామని మంత్రి తెలిపారు.
కూరగాయలు, పండ్లు, పూల ఎగుమతుల, రవాణాకు ప్రత్యేక విమానాల వినియోగిస్తామని చెప్పారు. కేంద్ర, రాష్ట్రాలు కలిసి ఉద్యాన పంటలకు అదనపు కేటాయింపులుంటాయన్నారు. 3400 సాగర్ మిత్రల ఏర్పాటు, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, సాగునీరు, అనుబంధ రంగాలకు రూ. 2.83 లక్షల కోట్లు అని తెలిపారు. కోస్తా ప్రాంతాల్లోని గ్రామీణ యువతకు మత్స్య పరిశ్రమలో మరింత ఉపాధి కల్పిస్తామని ఆర్థిక మంత్రి తెలిపారు.
ఆల్గే, సీవీ కేజ్ కల్చర్ విధానంలో మత్స్య, పరిశ్రమ అభివృద్ధికి ప్రోత్సహకాలు ఇస్తున్నామని తెలిపారు. వ్యవసాయ రంగానికి, ఇరిగేషన్ రంగానికి రూ. 2.83లక్షల కోట్లు కేటాయిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. 200 లక్షల టన్నుల చేపల ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు.


Click it and Unblock the Notifications