కన్వర్ యాత్ర అనేది హిందూ మాసం శ్రావణంలో జరిగే వార్షిక తీర్థయాత్ర. ఈ యాత్రలో ఉత్తరభారతంలో శివ భక్తులు గంగా నది నుండి పవిత్ర జలాన్ని తీసుకువచ్చి వారి స్థానిక శివాలయాలకు తీసుకువెళతారు.కన్వర్ యాత్ర జరిగే నెల రోజుల పాటు గంగా తీరంలో ఉన్న ఊర్లన్నీ సందడిగా మారుతాయి.ఎక్కడెక్కడి నుంచో భక్తులు కాలి నడకన కాశీ, హరిద్వార్, రిషికేష్ వచ్చి కావిళ్ళతో గంగాజలాన్ని తీసుకెళ్లి తమ ప్రాంతాల్లోని శివాలయాల్లో శివున్ని అభిషేకిస్తారు. శ్రావణ మాసంలో శివ భక్తులు గంగానది వద్దకు వెళ్లి నదిలోని గంగా జలాన్ని బిందెలతో నింపి కావిడి కట్టి తమ భుజాలపై వేలాడదీసుకుని తమ తమ ప్రాంతాల్లోని శివాలయానికి కాలినడకన తీసుకొచ్చి శివలింగానికి గంగాజలంతో అభిషేకిస్తారు. అదే కన్వర్ యాత్ర విశిష్టతగా చెబుతారు.
అయితే ఈ కన్వర్ యాత్ర సందర్భంగా ఘజియాబాద్ లో మతపరమైన భావోద్వేగాల మధ్య వివాదం చెలరేగింది. కన్వర్ యాత్ర జరిగే సమయంలో మాంసాహారం అమ్ముతున్నారంటూ KFC అవుట్‌లెట్ పై హిందూ దళం సభ్యులు దాడిచేశారు. శ్రావణ మాసంలో మాంసంతో కూడిన పదార్థాలు అమ్మడం శివ భక్తుల మనోభావాలను దెబ్బతీస్తుందని ఆరోపిస్తున్నారు. కన్వర్ యాత్ర పూర్తయ్యే వరకు మాసం అమ్మకాలను నిలిపివేయాలని లేకుంటే నిరనసలు తీవ్రం చేస్తామని హెచ్చరించారు.

దీంతో కేఎఫ్ సీ తన అవుట్ లెట్ అక్కడ మూసివేయాల్సి వచ్చింది. పరిస్థితిని అదుపు చేయడానికి పోలీసులను రంగ ప్రవేశం చేశారు. నిరసనకారులతో సమస్యను సామరస్యకంగా పరిష్కరించుకోకోవాలని కోరారు. ఈ యాత్రమ ముగిసే వరకు శాఖాహారం మాత్రమే వడ్డిస్తామని, నాన్ వెజ్ వడ్డించమని తాజాగా ఫాస్ట్ ఫుడ్ అవుట్లెట్ నోటీసు బోర్డును ఏర్పాటు చేసింది. ఈ ఘటనకు బాధ్యులైన వారిని గుర్తించే పనిలో పడ్డారు పోలీసులు.అల్లర్లకు పాల్పడిన వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసు మతపరమైన భావోద్వేగాలతో ముడిపడి ఉన్నందున జాగ్రత్తగా దర్యాప్తు చేస్తున్నారు.
ఈ నిరసన అనంతరం మెనూను తాత్కాలికంగా శాఖాహారానికి మాత్రమే పరిమితం చేసి నోటీసు పెట్టడం ద్వారా ఔట్‌లెట్ "సెంటిమెంట్ రెస్పాన్స్" వ్యూహాన్ని అమలు చేసారు వ్యాపారులు. NCRలో ఇప్పటికే కొంతమంది ఫుడ్ విక్రేతలు స్వచ్ఛందంగా నాన్ వెజ్ ఐటంలను తొలగించి సోయా, పనీర్ ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టారు.
ఈ ఏడాది ఆషాడ పౌర్ణమి జూలై 10వ తేదీన వచ్చింది. కనుక తరువాత రోజు నుంచి అంటే జూలై 11 నుంచి ఉత్తరాదిన శ్రావణ మాసం ప్రారంభమవుతుంది.వారికి శ్రావణ మాసం ఆగస్టు 09 తో ముగుస్తుంది కాబట్టి జూలై 23 శివరాత్రి వరకు దక్షిణాదిన ఈ యాత్ర కొనసాగుతుంది. ఉత్తరాదిన భక్తులు ఆగస్టు 9 వరకూ ఈ యాత్రను కొనసాగిస్తారు. ఈ సమయంలో భక్తులు గంగా జలాన్ని మోసుకెళ్లి శివాలయాల్లో అభిషేకం చేస్తారు. ఇది భారీ పాదయాత్ర కావడంతో వ్యాపారం కూడా జోరుగా సాగుతుంది. స్థానిక వాణిజ్య కార్యకలాపాలపై ఇది ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది.దేశవ్యాప్తంగా శివ భక్తులు గంగా నదికి కాలినడకన ప్రయాణించి పవిత్ర గంగా జలాన్ని కావిడితో మోసుకెళుతూ.. శివుడికి అర్పణలు ఇవ్వడానికి తమ స్వస్థలాలకు తీసుకువెళుతున్నారు. అధికారులు కూడా గట్టిగా భద్రతా ఏర్పాట్లు చేశారు.
యాత్రికులు సౌకర్యంగా, భద్రంగా ప్రయాణించేందుకు ఉత్తరప్రదేశ్ ట్రాఫిక్ పోలీసులు జాతీయ రహదారి 34 (మునుపటి NH-58)లోని ఒక లేన్‌ను ప్రత్యేకంగా కన్వారియాల కోసం కేటాయించారు. ఈ చర్య ట్రాఫిక్ రద్దీని తగ్గించడం, ప్రమాదాల అవకాశాలను తగ్గించడం, ముఖ్యంగా ఘజియాబాద్ వంటి జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో రవాణా సౌలభ్యాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా చేపట్టబడింది.
ఈ కన్వర్ యాత్ర సమయంలో భక్తులు తప్పనిసరిగా వెజ్ ఆహారం తీసుకోవాలి. మద్య మాంసాలు తీసుకోరాదు.వారు తీసుకువెళ్లే కావిడిని నేలపై ఉంచకూడదు. విశ్రాంతి తీసుకునే సమయంలో కావిడిని చెట్టు కొమ్మకు వేలాడిదీసి ఉంచాలి. ఇక వేళ కావిడిని నేలపై ఉంచితే తిరిగి మళ్ళీ పాదచారులై హరిద్వార్ కు వెళ్లి గంగాజలాన్ని తీసుకురావాలి. కావిడిని పక్కనబెడితే మళ్లీ స్నానం చేసిన తర్వాత మాత్రమే తాకాలి.కావిడి మోస్తున్నంత సేపు ఓం నమః శివాయ అంటూ పంచాక్షరీ మంత్రాన్ని నిరంతరం జపించాలి. యాత్ర సమయంలో కాషాయరంగు వస్త్రాలతో పూర్తిగా కాలినడకనే ప్రయాణించాలి. ఈ కన్వర్ యాత్ర చేసే వారిని కన్వారీలు అంటారు.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications