హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ లోపభూయిష్ఠ విధానం వల్ల తెలంగాణలో ఆర్థికంగా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడిందని, ఈ కారణంగా అనేక పథకాలకు అవాంతరాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయని, ఇది మరింత దిగజారకుండా ఉండేందుకు స్వీయ నియంత్రణ అవసరమని, అంతకుమించి గత్యంతరం లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఆయన శనివారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్రం నుంచి రావాల్సిన పన్ను వాటాలపై సమీక్షించారు. జీఎస్టీ వాటా వెంటనే విడుదల చేయాలని లేదంటే వాస్తవాలు వెల్లడించాలని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ కూడా రాశారు.

ఖర్చులు తగ్గించండి...
కేంద్రం నుంచి తక్షణమే రావాల్సిన రూ.4,531 కోట్ల నిధులను విడుదల చేయాలని కేసీఆర్.. సీతారామన్‌ను కోరారు. పార్లమెంటులో మంత్రులు చెబుతున్న మాటలకు, వాస్తవ పరిస్థితులకు పొంతన లేదన్నారు. ఆర్థిక మందగమన ప్రభావం పార్లమెంటులో, బయట కేంద్రం చెబుతోందని, కానీ వాస్తవాలు పూర్తి భిన్నంగా ఉన్నాయన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తీవ్ర అనిశ్చితిలో ఉందన్నారు. కేంద్రం పన్నుల వాటా తగ్గిన నేపథ్యంలో అన్ని శాఖల్లో ఖర్చులు తగ్గించేలా చర్యలు తీసుకోవాలని కేసీఆర్ సూచించారు. మంత్రులు, అధికారులు ఆర్థిక క్రమశిక్షణ పాటించాలన్నారు.

రూ.2,957 కోట్లు తగ్గే అవకాశం
ఇప్పటి వరకు కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన పన్నుల వాటాలో రూ.924 కోట్లు తగ్గిందని, ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.2,957 కోట్లు తగ్గే అవకాశముందని చెప్పారు. కేంద్రం నుంచి రావాల్సిన పన్నుల వాటా, ఐజీఎస్టీ బకాయిలు, జీఎస్టీ నష్ట పరిహారం వెంటనే విడుదల చేయాలన్నారు.

జీఎస్టీ నష్టపరిహారం రూ.1,719 కోట్లు
జీఎస్టీ ద్వారా 14% కంటే తక్కువ రాబడి వచ్చిన రాష్ట్రాలకు నష్టం పూడుస్తామని జీఎస్టీ చట్టం అమల్లోకి తెచ్చిన సందర్భంగా కేంద్రం చెప్పిందని, ప్రపంచవ్యాప్తంగా... దేశవ్యాప్తంగా ఉన్న ఆర్థిక మందగమన పరిస్థితుల వల్ల తెలంగాణకు 14% మేర జీఎస్టీ నిధులు సమకూరడంలేదని, కాబట్టి కేంద్రం నుంచి జీఎస్టీ నష్టపరిహారం కింద రాష్ట్రానికి రూ.1,719 కోట్లు బకాయిలు రావాల్సి ఉందన్నారు. ఈ డబ్బులు కూడా వెంటనే విడుదల చేయాలని సీతారామన్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు.

తగ్గిన నిధులు
దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఇచ్చే కేంద్ర పన్నుల్లో వాటాను కేంద్రం నిర్ణయించి, బడ్జెట్ ద్వారా ప్రకటిస్తుంది. 2019-20 ఆర్థిక సంవత్సరానికిగాను తెలంగాణకు రూ.19,719 కోట్లు అందివ్వనున్నట్టు కేంద్రం బడ్జెట్‌లో పేర్కొంది. ఇది గత ఆర్థిక సంవత్సరమైన 2018-19లో కేటాయించిన రూ.18,560 కోట్ల కన్నా 6.2% ఎక్కువ. గత 8 నెలల్లో తెలంగాణకు రూ.10,304 కోట్లు అందాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలానికి రూ.10,528 కోట్లు వచ్చాయి. అంటే 2018-19 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది ఇప్పటి వరకు రూ.224 కోట్లు తక్కువగా వచ్చాయి. బడ్జెట్ లెక్కల ప్రకారం 2.13 శాతం తక్కువ వచ్చింది. గత ఏడాది కంటే రూ.700 కోట్లు అధికంగా రావాల్సి ఉంది. ఇప్పటి వరకు తెలంగాణకు రావాల్సిన కేంద్ర పన్నుల వాటా రూ.924 కోట్లకు తగ్గింది.

15 శాతానికి చేరుకునే పరిస్థితులు
తెలంగాణకు తక్కువ నిధులు రావడంపై రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఇటీవల ఢిల్లీకి వెళ్లి తమ కేంద్ర పన్నుల వాటాలో 8.3 శాతం తక్కువ వచ్చిందని కేంద్ర ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకు వచ్చారు. దీనివల్ల తెలంగాణలో అనేక పథకాలకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయని చెప్పారు. అయితే కేంద్ర అధికారులు మాత్రం మరింత కోత తప్పదని బాంబు పేల్చారు.
పరిస్థితులు నిరాశాజనకంగా ఉన్నాయని, 8.3% మాత్రమే కాకుండా ఇది మరింత తగ్గి 15% చేరుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయన్నారు. అంటే ఈ లెక్కన ఏడాది మొత్తానికి కేంద్ర పన్నుల వాటాలో రాష్ట్రానికి రావాల్సిన నిధుల్లో రూ.2,957 కోట్లు తగ్గనున్నట్లు సమీక్షలో అంచనా వేశారు.

బకాయిలపై మోడీని కేసీఆర్ కలిసే ఛాన్స్
కేంద్రం నుంచి రావాల్సిన పన్ను బకాయిల నిధులు రాకుంటే తమకు ఇబ్బందులు తలెత్తుతాయని ప్రధాని మోడీ, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసి విజ్ఞప్తి చేయాలని సీఎం కేసీఆర్ యేచిస్తున్నారు. ఈ వారంలో అధికారులను వెంట బెట్టుకొని ఢిల్లీకి వెళ్లి పరిస్థితి తీవ్రతను వివరించి నిధులు అడగనున్నారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు



Click it and Unblock the Notifications