హైదరాబాద్: రాష్ట్రాల పన్నుల వాటా కింద రావాల్సిన నిధులను తెలంగాణకు వెంటనే విడుదల చేయాలని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు సీఎం కేసీఆర్ లేఖ రాశారు. కేంద్ర బడ్జెట్‌లో పేర్కొన్న మేరకు తెలంగాణకు కేంద్ర పన్నుల వాటా రూ.19,719 కోట్లు రావాలని, గత ఏడాదితో పోలిస్తే రూ.224 కోట్లు ఇవ్వలేదన్నారు.
ఆర్థిక మాంద్యం కారణంగా తెలంగాణలో 14 శాతం జీఎస్టీ వసూళ్లు తగ్గాయని, చట్ట ప్రకారం తక్కువ రాబడి వచ్చిన రాష్ట్రాలకు కేంద్రం నష్టపరిహారం చెల్లించాలన్నారు. అంటే తెలంగాణకు రూ.1,719 కోట్లు నష్టపరిహారంగా చెల్లించాలని కోరారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మరో నాలుగు నెలలు మాత్రమే మిగిలి ఉందని గుర్తు చేసారు.

కేంద్ర ఆర్థిక సంఘం సూచనలకు అనుగుణంగా 2017-18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జీఎస్టీలోని అంతర్భాగమైన ఐజీఎస్టీ నుంచి రూ.2812 కోట్లు కేంద్రం తగ్గించిందని, దీనిని కాగ్ కూడా 2019లో విడుదల చేసిన 9వ నివేదిక ఎత్తి చూపిందన్నారు. ఈ కారణాల వల్ల జీఎస్టీ బకాయిలు రూ.4,531 కోట్లు తెలంగాణకు రాకుండా ఆగిపోయాయని, ఇదే సమయంలో పన్నుల వాటా తగ్గడం ఇబ్బందిగా మారిందని పేర్కొన్నారు.
More From GoodReturns

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications