వాహదారులపై ఇంధన పిడుగు: రూ.2 పెరిగిన డీజిల్ ధర.. బస్సు, మెట్రో చార్జీలు కూడా పెంపు..
పాల ధరలు, కరెంట్ బిల్లు సహా బస్సు & మెట్రో ఛార్జీలను పెంచిన తర్వాత కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు డీజిల్ ధరను లీటరుకు రూ.2 పెంచింది. అలాగే పెంచిన ధరలు మంగళవారం నుండే అమలు చేసింది. ఏప్రిల్ 1 నుండి డీజిల్‌పై సేల్స్ ట్యాక్స్ 3% పెంచడంతో ఇంధన ధరలు పెరగగా, ఈ క్రమంలోనే డీజిల్ ధర లీటరుకు రూ. 2 పెరిగింది, దింతో డీజిల్‌పై కర్ణాటక సేల్స్ ట్యాక్స్ (KST) 18.4% నుండి 21.17%కి చేరింది.

ప్రస్తుతం కర్ణాటకలో డీజిల్ ధర లీటరుకు రూ.88.99 ఉండగా, పెట్రోల్ ధర లీటరుకు రూ.102.92గా ఉంది. కొత్త ట్యాక్స్ వల్ల లీటరుకు దాదాపు రూ.2 పెరగగా, డీజిల్ లీటరు ధర రూ.91.02కు చేరుకుందని కర్ణాటక పెట్రోలియం డీలర్ల సంఘం తెలిపింది. కర్ణాటకలో డీజిల్ ధరలు ఇతర రాష్ట్రాల కంటే ఇప్పటికి చాలా తక్కువగా ఉందని ప్రభుత్వ నోటిఫికేషన్ హైలైట్ చేసింది: ప్రస్తుతం హోసూర్ (తమిళనాడు)లో డీజిల్ ధర రూ. 94.42, కాసర్గోడ్ (కేరళ)లో రూ. 95.66, అనంతపురం (ఆంధ్రప్రదేశ్)లో రూ. 97.35, హైదరాబాద్ (తెలంగాణ)లో రూ. 95.70గా ఉంది. గత సంవత్సరంలో ప్రభుత్వం ఇంధన ట్యాక్స్ పెంచిన తర్వాత డీజిల్ లీటరుకు రూ.3.02 పెరగగా, పెట్రోల్ లీటరుకు రూ.3 పెరిగింది.
డీజిల్ ధరల పెరుగుదలతో పాటు, కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ (KMF) పాలు, పెరుగు ధరలను లీటరుకు రూ.4 పెంచింది. టోన్డ్ మిల్క్ ఇప్పుడు లీటరుకు రూ.42 నుండి రూ.46కి పెరగగా, శుభం వంటి ప్రీమియం వేరియంట్లకు రూ.52కి పెరుగుతుంది. పెరుగు ధరలు కూడా లీటరుకు రూ.50 నుండి రూ.54కి పెరిగాయి. ఉత్పత్తి ఖర్చులు పెరగడమే ఈ పెంపు వెనుక కారణమని KMF పేర్కొంది. అంతేకాదు విద్యుత్ ఛార్జీలలో కాస్త తగ్గింపు ఉన్నప్పటికీ విద్యుత్ బిల్లులు కూడా పెరగనున్నాయి. కర్ణాటక ఎలక్ట్రిక్ రెగ్యూలేటరీ కమిషన్ (KERC) 2025-26 ఆర్థిక సంవత్సరానికి కరెంట్ 1 యూనిట్‌కు 10 పైసలు తగ్గించింది కానీ మినిమం బిల్లుపై రూ. 25 పెంచింది.
రతన్ టాటా వీలునామా.. వంటమనిషికి కోటి! డ్రైవర్ నుండి క్లినర్ వరకు అందరికి ఆస్తులు పంచిన టాటా!
మరోవైపు నమ్మ మెట్రో అండ్ BMTC బస్సులు చార్జీల పెంపుతో బెంగళూరులోని ప్రజా రవాణాపై ఆధార పడే వారికీ పెరుగుతున్న ఛార్జీలతో ఇబ్బంది పడుతున్నారు. ఇక బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (BMRCL) స్మార్ట్ కార్డులపై కనీస బ్యాలెన్స్ రూ.50 నుండి రూ.90కి రెట్టింపు చేసింది.
అదేవిధంగా గత నెల జనవరిలో బస్సు ఛార్జీలు 15% పెరిగాయి, ఈ ప్రభావం విద్యార్థులు, ఆఫీసులకు వెళ్లేవారితో సహా ప్రజా రవాణాపై ఆధారపడే ప్రయాణికులపై పడింది. డైలీ బస్ పాస్ ధర రూ.70 నుండి రూ.80కి పెరగగా, ఒక నెల బస్ పాస్ రూ.1,050 నుండి రూ.1,200కి పెరిగింది. వీటన్నిటిని చూస్తే దక్షిణ భారతదేశంలో కర్ణాటక అత్యంత ఖరీదైన రాష్ట్రంగా నిలిచింది, గత రెండు సంవత్సరాలుగా పెరిగిన రాష్ట్ర పన్నులు, సుంకాల కారణంగా చాలా సార్లు ధరలు పెరిగాయి. రవాణా, మద్యంతో పాటు బెంగళూరులో ఉన్నత విద్య కూడా ఖరీదైనదిగా మారింది, ప్రొఫెషనల్ కోర్సులకు కాలేజీ ఫీజులు 10% పెరిగాయి.


Click it and Unblock the Notifications


