రతన్ టాటా పేరు వినగానే అతని గురించి మీకు తెలిసే ఉంటుంది. అయితే రతన్ టాటా మరణం తరువాత కొన్ని విషయాలు ఒకొక్కటిగా బయటికొస్తున్నాయి. తాజా అతని వీలునామాకి సంబంధించి సమాచారం వెలుగులోకి వచ్చింది. ప్రముఖ పారిశ్రామికవేత్త అయినా రతన్ టాటా ఎంత ఉదార స్వభావి అనేది ఆయన వీలునామా ద్వారా తెలుసుకోవచ్చు. ఎందుకంటే అతను తన ఇంటి పనివారికి, ఆఫీస్ సిబ్బందికి దాదాపు రూ.3.5 కోట్లు వీలునామాలో రాసిచ్చాడు. వీరిలో కార్ క్లీనర్ నుండి ప్యూన్ వరకు అందరూ ఉన్నారు. అతను తన ఉద్యోగులకు, పక్కింటి వారికీ ఇచ్చిన అప్పు కూడా మాఫీ చేశాడు. అయితే రతన్ టాటా గత ఏడాది అక్టోబర్‌లో మరణించగా, తన ఇంటి పనిమనుషులకు ఇంకా ఎన్నో ఏళ్లుగా చేస్తున్న సేవలకి అనుగుణంగా రూ.15 లక్షలు ఇవ్వాలని తన వీలునామాలో పేర్కొన్నారు. అలాగే, పార్ట్‌టైమ్ హెల్పర్లు, కార్ క్లీనర్లకు కూడా లక్ష రూపాయలు ఇవ్వాలని కోరారు. అతని బట్టలన్నీ కూడా NGOలకు ఇవ్వబడతాయి, ఎందుకంటే వాటిని అవసరమైన వారికి ఇవ్వడం చేయవచ్చు. రతన్ టాటా డాక్స్, పోలో, బ్రూక్స్ బ్రదర్స్, బ్రియోని, హెర్మ్స్ వంటి బ్రాండ్ల బట్టలను ఎక్కువగా ధరించేవారు.

టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన ఒక నివేదిక ప్రకారం, రతన్ టాటా చిరకాల వంటమనిషి రాజన్ షాకు కోటి రూపాయలకు పైగా రాసిచ్చాడు. ఇందులో రూ.51 లక్షల అప్పు మాఫీ చేస్తూ కూడా ఉంది. ఆయన తన బట్లర్ సుబ్బయ్య కోనార్ కు రూ.66 లక్షలు ఇవ్వాలని, ఇందులో రూ.36 లక్షల అప్పు మాఫీ కూడా ఉంది. తన సెక్రెటరీ దిల్నాజ్ గిల్డర్ కు కూడా రూ.10 లక్షలు కేటాయించారు. కార్నెల్ విశ్వవిద్యాలయంలో MBA చదవడానికి తన ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ శంతను నాయుడుకి ఇచ్చిన రూ.1 కోటి అప్పు కూడా టాటా మాఫీ చేశాడు. అంతేకాదు తన డ్రైవర్ రాజు లియోన్‌కు రూ.1.5 లక్షలు ఇచ్చి, అతని రూ.18 లక్షల అప్పు కూడా మాఫీ చేశాడు.
జర్మన్ షెపర్డ్ కు 12 లక్షలు: టాటా ట్రస్ట్ కన్సల్టెంట్ హోషి డి మలేసర్‌కు రూ.5 లక్షలు, అలీబాగ్ బంగ్లా కేర్‌టేకర్ దేవేంద్ర కాటమోళ్లుకు రూ.2 లక్షలు, పర్సనల్ అసిస్టెంట్ దీప్తి దివాకరన్‌కు రూ. 1.5 లక్షలు, ప్యూన్‌లు గోపాల్ సింగ్, పాండురంగ్ గురవ్‌లకు రూ.50 వేలు ఇవ్వాలని పేర్కొన్నారు. తన హెల్పర్స్ ఒకరైన సర్ఫరాజ్ దేశ్‌ముఖ్‌కు ఇచ్చిన రూ.2 లక్షల అప్పు కూడా ఆయన మాఫీ చేశారు. అయితే తన జర్మన్ షెపర్డ్ టిటో కోసం రూ.12 లక్షలు కేటాయించాడు. టిటో ఇప్పటికీ రాజన్ షా సంరక్షణలోనే ఉంది.
టాటా ఇంటి పక్కన ఉండే జేక్ మల్లెట్ కు UKలోని వార్విక్ బిజినెస్ స్కూల్లో MBA చదివేందుకు ఇచ్చిన రూ. 23.7 లక్షల అప్పుడు కూడా మాఫీ చేశాడు. మల్లెట్ ప్రస్తుతం స్విట్జర్లాండ్‌లో ఉంటున్నారు. టాటా ఆస్తిలో మూడింట ఒక వంతు (షేర్లు అండ్ రియల్ ఎస్టేట్ మినహా) మాజీ తాజ్ ఉద్యోగి మోహిని దత్తాకు ఇచ్చారు. సీషెల్స్‌లో రూ.85 లక్షల విలువైన అతని భూమిని ఆర్‌ఎన్‌టి అసోసియేట్స్'కి ఇచ్చారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications