బెంగళూరు ఐటీ కంపెనీలకు సీఎం డీకే శివకుమార్ వార్నింగ్.. కన్నడిగులకు జాబ్ ఇవ్వకపోతే చర్యలు తప్పవని హెచ్చరిక..

Kannada Jobs Controversy in Bengaluru: కర్ణాటకలో కన్నడిగులే సార్వభౌములు అని స్పష్టం చేస్తూ, ఐటీ తదితర ప్రైవేట్ కంపెనీలు కన్నడిగులను ఉద్దేశపూర్వకంగా నియామకాల నుంచి దూరంగా ఉంచినట్లు ఆధారాలు లభిస్తే ఆయా సంస్థలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తీవ్రస్థాయిలో హెచ్చరించారు. బెంగళూరులోని కొన్ని ఐటీ కంపెనీలు నియామక ప్రక్రియలో భాష ఆధారిత వివక్ష చూపుతున్నాయని ఆరోపిస్తూ.. ఒక స్థానిక యువతి మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో ఈ వివాదం చెలరేగింది.

ఈ అంశంపై డీకే శివకుమార్ ఎక్స్ (X) వేదికగా స్పందిస్తూ.. ఏదైనా ప్రైవేట్ సంస్థ కన్నడిగులను ఉద్దేశపూర్వకంగా పక్కన పెట్టినట్లు తేలితే ప్రభుత్వం ఊరుకోదు. ఏ కారణం చేతనైనా కన్నడిగుల హక్కులు, గౌరవం, ఉపాధి అవకాశాలను నిర్లక్ష్యం చేయడానికి ప్రభుత్వం అనుమతించదు. ప్రపంచం బెంగళూరును భారతదేశ టెక్నాలజీ రాజధానిగా గుర్తించడానికి కన్నడిగుల ప్రతిభ, నైపుణ్యాలే కారణం. కన్నడిగుల ప్రయోజనాలు, ఆందోళనలకు రక్షణగా ఉండేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.

DK Shivakumar Bengaluru IT Companies Kannada Speakers Jobs Karnataka News Kannada Jobs Controversy Viral Video Bengaluru IT Sector Karnataka Deputy CM Local Employment IT Companies Warning Kannada Language Debate India Technology News

వైరల్ అయిన సదరు వీడియోలో.. కన్నడను మాతృభాషగా పేర్కొంటున్న అభ్యర్థులను కొన్ని కంపెనీలు షార్ట్‌లిస్టింగ్ లేదా ఇంటర్వ్యూ దశలోనే తొలగిస్తున్నాయని సదరు మహిళ ఆరోపించింది. బెంగళూరులోని స్థానిక కళాశాలల్లో క్యాంపస్ ఇంటర్వ్యూలు కూడా నిర్వహించడం లేదని.. స్థానికులకు బదులుగా తెలుగు, తమిళం మాట్లాడే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల యువతను తక్కువ వేతనాలకు (Low Salaries) నియమించుకుంటున్నారని పేర్కొంది. ఈ వీడియో ఆరోపణలు స్వతంత్రంగా ధృవీకరించబడనప్పటికీ.. కన్నడ కార్యకర్తల మద్దతుతో బెంగళూరు వ్యాప్తంగా భాషా సెంటిమెంట్‌ను, పాత మనోవేదనలను మళ్లీ రాజేసింది.

ప్రముఖ కన్నడ కార్యకర్త రూపేష్ రాజన్న ఈ వీడియోను షేర్ చేస్తూ.. ప్రైవేట్ సంస్థల్లో ఈ తరహా వివక్ష చాలా కాలంగా జరుగుతున్నా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోలేదని విమర్శించారు. గతం (2024) లో సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రైవేట్ రంగానికి స్థానిక రిజర్వేషన్లు కల్పించే బిల్లును ముసాయిదా చేసినప్పటికీ.. పారిశ్రామిక రంగానికి చెందిన విమర్శలు,వ్యతిరేకత కారణంగా దానిని నిలిపివేశారు.

డికే శివకుమార్ వ్యాఖ్యలపై ప్రతిపక్ష బీజేపీ తీవ్రంగా మండిపడింది. బీజేపీ అధికార ప్రతినిధి అశోక్ గౌడ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం బెదిరింపు హెచ్చరికలకే పరిమితం కాకుండా ప్రైవేట్ రంగంలో అసలు ఎలాంటి నూతన ఉద్యోగాలు సృష్టిస్తోందో డికే శివకుమార్ స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. నిబంధనలు సవరించడం సులభమే అయినప్పటికీ, రాష్ట్రంలో కొత్తగా ఉద్యోగావకాశాలు పెంచడంలో ప్రభుత్వం ఎలాంటి పాత్ర పోషిస్తోందో స్పష్టత ఇవ్వాలని విమర్శించారు.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+