ముఖేష్ అంబానీ కంటే ఎక్కువ, అత్యధిక శాలరీ ఈ దంపతులదే! కూతురుకు కోట్ల శాలరీ

2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను అత్యధిక వేతనం అందుకున్న ఎగ్జిక్యూటివ్ ఎవరో తెలుసా? సన్ నెట్ ప్రమోటర్లు కళానిధి మారన్, ఆయన సతీమణి కావేరీ మారన్. గత ఆర్థిక ఏడాదికి గాను వీరిద్దరు కలిసి అందుకున్న మొత్తం అక్షరాలా రూ.175 కోట్లు. భారత కార్పోరేట్ రంగంలో అత్యధిక పారితోషికం అందుకున్న ఎగ్జిక్యూటివ్స్‌గా వీరు తొలిస్థానంలో నిలిచారు. ఈ మేరకు స్టాక్ ఎక్స్చేంజీలకు సన్ టీవీ బుధవారం వార్షిక నివేదికను సమర్పించింది.2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను అత్యధిక వేతనం అందుకున్న ఎగ్జిక్యూటివ్ ఎవరో తెలుసా? సన్ నెట్ ప్రమోటర్లు కళానిధి మారన్, ఆయన సతీమణి కావేరీ మారన్. గత ఆర్థిక ఏడాదికి గాను వీరిద్దరు కలిసి అందుకున్న మొత్తం అక్షరాలా రూ.175 కోట్లు. భారత కార్పోరేట్ రంగంలో అత్యధిక పారితోషికం అందుకున్న ఎగ్జిక్యూటివ్స్‌గా వీరు తొలిస్థానంలో నిలిచారు. ఈ మేరకు స్టాక్ ఎక్స్చేంజీలకు సన్ టీవీ బుధవారం వార్షిక నివేదికను సమర్పించింది.

చెరో రూ.87.5 కోట్లు..

చెరో రూ.87.5 కోట్లు..

కళానిధి మారన్ 1993లో సన్ టీవీని స్థాపించారు. ఆయన ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా ఉండగా, అతని సతీమణి కావేరీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్నారు. 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను వీరిద్దరు ఒక్కొక్కరు చొప్పున రూ.13.87 కోట్లు, రూ.73.63 కోట్ల మొత్తాన్ని ఎక్స్‌గ్రేషియా/బోనస్‌గా తీసుకున్నారు. ఈ రెండు కలిపీ ఒక్కొక్కరు రూ.87.50 కోట్లు తీసుకుంటున్నారు. దీంతో వీరిద్దరి వేతనం రూ.175 కోట్లుగా ఉంది. వీరి వేతనాన్ని స్థిరంగా ఉంచాలని మూడేళ్ల క్రితం నిర్ణయించారు.

సన్ టీవీ ఎండీ మహేష్, కూతురు కావ్య వేతనం కోట్లలో

సన్ టీవీ ఎండీ మహేష్, కూతురు కావ్య వేతనం కోట్లలో

అత్యధిక వేతనం పొందుతున్న ఎగ్జిక్యూటివ్‌లలో సన్ టీవీ ఎండీ ఆర్ మహేష్ కుమార్ ముందున్నారు. ఆయన వార్షిక వేతనం రూ.1.78 కోట్లు. ఇందులో రూ.1.16 కోట్లు శాలరీ, రూ.0.62 కోట్లు ఎక్స్‌గ్రేషియా ఉన్నాయి. ఆ తర్వాత మారన్ కూతురు, కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కావ్య రూ.1.22 కోట్లు అందుకుంటున్నారు. ఇందులో రూ.80 లక్షలు వేతనం, రూ.42 లక్షలు ఎక్స్‌గ్రేషియా. 2019-20లో సన్ టీవీ వార్షిక ఆదాయం రూ.3,653.35 కోట్లు. గత ఏడాది రూ.3,883.22 కోట్లుగా ఉంది. పన్నుకు ముందు కంపెనీ ఆదాయం రూ.1,797.88 కోట్లు. అంతకుముందు ఏడాది ఇది రూ.2,134.94 కోట్లుగా ఉంది.

రిలయన్స్ ముఖేష్, నీతా అంబానీ వేతనం

రిలయన్స్ ముఖేష్, నీతా అంబానీ వేతనం

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ 12 సంవత్సరాలుగా రూ.15 కోట్ల వేతనం తీసుకుంటున్నారు. ఈ ఏడాది కరోనా మహమ్మారి కారణంగా పూర్తి శాలరీని వదిలి పెట్టాలని నిర్ణయించుకున్నారు. 2008-09 ఆర్థిక సంవత్సరం నుండి రూ.15 కోట్లు తీసుకుంటున్న ముఖేష్ అంబానీ, ప్రతి ఏడాది రూ.24 కోట్లు వదులుకుంటున్నారు. నీతా అంబానీ సహా రిలయన్స్ నాన్-ఎగ్జిక్యూటివ్స్ డైరెక్టర్లు సిట్టింగ్ ఫీజ్ కాకుండా రూ.1.5 కోట్లు కమీషన్‌గా అందుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+