జూన్ 2021లో జీఎస్టీ కలెక్షన్లు భారీగా తగ్గాయి. కరోనా మహమ్మారి కట్టడి కోసం పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు విధించిన ఆంక్షలు, లాక్‌డౌన్ కారణంగా జూన్ నెలలో కేంద్రానికి జీఎస్టీ వసూళ్లు పడిపోయాయి. గత ఎనిమిది నెలలుగా రూ.1 లక్ష కోట్ల మార్క్ దాటిన జీఎస్టీ వసూళ్లు ఈసారి రూ.92వేల కోట్లుగా నమోదయ్యాయి. గత ఏడాది జూన్ నెలతో పోలిస్తే ఇది రెండు శాత ఎక్కువ. అయితే మే 2021తో పోలిస్తే మాత్రం తక్కువ. జూన్ నెలలో రూ.92,849 కోట్ల జీఎస్టీ వసూళ్లు నమోదయ్యాయి. క్రితం సారి సెప్టెంబర్ 2020లో జీఎస్టీ వసూళ్లు రూ.95,480 కోట్లుగా నమోదయ్యాయి. అలాగే పది నెలల తర్వాత ఇదే కనిష్టం.
ఇందులో కేంద్రం వాటా రూ.16,424 కోట్లు. రాష్ట్రాల వాటా రూ.20,397 కోట్లు. సమ్మిళిత జీఎస్టీ కింద రూ.49,079 కోట్లు. సెస్ రూపంలో రూ.6,949 కోట్లు వసూలైనట్లు ఆర్థిక శాఖ తెలిపింది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ ఏడాది మే నెలలో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు లాక్‌డౌన్, కఠిన ఆంక్షలు అమలు చేశాయి. దీంతో మే నెలలో వ్యాపార కార్యకలాపాలు తగ్గాయి. ఏప్రిల్ నెలలో 5.88 కోట్ల ఈ-వే బిల్లులు రాగా, మే నెలలో 3.99కోట్లుగా ఉంది. దీంతో జూన్ నెలలో జీఎస్టీ వసూళ్లు తగ్గినట్లు ఆర్థికశాఖ వెల్లడించింది.

దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో గత నెలలో చాలా రాష్ట్రాల్లో పరిస్థితులు సాధారణానికి వచ్చాయి. వాణిజ్య, వ్యాపార కార్యకలాపాలు పుంజుకోవడంతో జూన్ నెలలో 5.5 కోట్ల ఈ-వే బిల్స్ జనరేట్ అయ్యాయి. దీంతో జులై నెల నుండి జీఎస్టీ వసూళ్లు మళ్లీ పెరుగుతాయని కేంద్రం భావిస్తోంది. రూ.1.41 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లతో ఏప్రిల్ నెల ఆల్‌టైం రికార్డుగా నిలిచింది.
More From GoodReturns

హార్ముజ్ జలసంధిని దాటిన మరో రెండు భారత LPG నౌకలు.. మరో మూడు షిప్పులు ఇంకా అక్కడే..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications