JSW IPO: JSW ఇన్‌ఫ్రా ఐపీఓ.. ప్రైస్ బాండ్ ఎంతంటే..!
ప్రస్తుతం స్టాక్ మార్కెట్ లోకి ఐపీవోలు భారీగా వస్తున్నాయి. ఇప్పుడు మరో పెద్ద కంపెనీ ఐపీఓకు తీసుకురావడానికి సిద్ధమైంది. JSW గ్రూప్‌కు చెందిన పోర్ట్ కంపెనీ JSW ఇన్‌ఫ్రా తన IPOను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. సజ్జన్ జిందాల్ కంపెనీ IPO సెప్టెంబర్ 25న సబ్స్క్రిప్షన్ కోసం ఓపెన్ కానుంది. కంపెనీ ఈ IPO ద్వారా మొత్తం 2800 నుంచి 2850 కోట్ల రూపాయలను సేకరించాలని కంపెనీ ప్లాన్ చేస్తుంది. ఈ IPOలో కంపెనీ మొత్తం మొత్తాన్ని తాజా షేర్ల ద్వారా జారీ చేస్తుంది.
ఆఫర్ ఫర్ సేల్ ద్వారా షేర్లు విక్రయాలు లేపు. ప్రస్తుతానికి అయితే కంపెనీ ఈ IPO ధర బ్యాండ్‌ను వెల్లడించలేదు. త్వరలో వెల్లడిస్తామని కంపెనీ తెలిపింది. , కంపెనీ తన రుణాన్ని తిరిగి చెల్లించడానికి ఈ IPO ద్వారా సేకరించిన రూ.880 కోట్లను ఉపయోగించనుంది. జైఘర్ పోర్టు విస్తరణకు రూ.1,029.04 కోట్లు ఖర్చు చేయనుంది. జూన్ 2023 వరకు కంపెనీ మొత్తం రుణం రూ.4,228.39 కోట్లుగా ఉంది. మిగిలిన మొత్తన్ని కంపెనీ కార్పొరేట్ అవసరాలను తీర్చడానికి ఉపయోగించనున్నారు.

ఈ ఇష్యూలో కంపెనీ 75 శాతం వాటాను క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ కొనుగోలుదారులకు (QIB), 15 శాతం అధిక నికర వ్యక్తులకు(NII), 10 శాతం రిటైల్ పెట్టుబడిదారులకు రిజర్వు చేసింది. JSW ఇన్‌ఫ్రా దేశంలో రెండవ అతిపెద్ద వాణిజ్య పోర్ట్ ఆపరేటర్ అని పేర్కొంది. ఈ కంపెనీ మే 9న మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీకి డీహెచ్‌ఆర్‌పీని సమర్పించింది. ఈ JSW గ్రూప్ స్టీల్, ఎనర్జీ, ఇన్‌ఫ్రా, ఎనర్జీ మొదలైన అనేక రంగాలలో పనిచేస్తుంది. కాగా ప్రస్తుతం మార్కెట్ పలు ఐపీఓల్ ఓపెన్ అయి ఉన్నాయి.
JSW ఇన్‌ఫ్రా బిజినెస్ భారీ పెట్టుబడితో కూడిన వ్యవస్థ. ఈ కంపెనీ ఎక్కువ పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. అందుకే అప్పులు ఎక్కువగా చేస్తోంది. ఇలాంటి కంపెనీల్లో పెట్టుబడి పెట్టే ముందు కంపెనీ స్థితిగతులు తెలుసుకోవడం మంచిది. కంపెనీ డెట్ ఈక్విటీ రేషియో ఎలా ఉంది.. ఇంట్రరెస్ట్ కవరేజ్ రేషియో ఎలా ఉంది. వారు ఎంత ప్రైస్ లో ఐపీఓకు వస్తారు అనే అంశాలను పరిశీలించాలని నిపుణులు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications