భారత EV మార్కెట్‌ని టార్గెట్ చేసిన JSW.. ప్రపంచ టాప్ దిగ్గజాలతో అదిరిపోయే డీల్..
ఇండియా EV రేస్‌లో ఎవరూ వెనుకబడాలని అనుకోవడం లేదు. టాప్ స్టీల్ & ఇన్‌ఫ్రా ప్లేయర్ JSW గ్రూప్ కూడా ఇప్పుడు బ్యాటరీలపై బలంగా దృష్టి పెట్టింది. సజ్జన్ జిందాల్ లీడ్ చేస్తున్న JSW, EV బ్యాటరీ టెక్నాలజీ కోసం చైనా, జపాన్, దక్షిణ కొరియా కంపెనీలతో చర్చలు చేస్తున్నారు.

EVల భవిష్యత్తు మొత్తం బ్యాటరీ టెక్నాలజీ మీదే ఆధారపడి ఉంది. దాన్ని ఎవరు కంట్రోల్ చేస్తారో వాళ్లే మార్కెట్‌లో ముందుంటారు. అందుకే JSW డైరెక్ట్‌గా వరల్డ్ టాప్ కంపెనీలతో డీల్‌లు చేసుకుపోవడానికి కృషి చేస్తుంది. చైనాలోని గోషన్, కాస్పవర్స్, స్వోల్ట్, సౌండన్ లాంటి కంపెనీలతో చర్చలు ఇప్పటికే జరిగాయి. ఇవి ఒడిశాలో కటక్‌లో రాబోయే ఫ్యాక్టరీకి టెక్నికల్ సపోర్ట్ ఇవ్వొచ్చు.
స్టెప్-బై-స్టెప్ ప్లాన్: JSW చిన్నగా మొదలు పెట్టి పెద్దదిగా వెళ్లాలని ప్లాన్ చేస్తోంది.
ఫస్ట్ ఫేజ్ (2027 వరకు): 10GWh బ్యాటరీ సామర్థ్యం, టెక్నాలజీ నేర్చుకోవడం
సెకండ్ ఫేజ్ (2028-2030): 20GWh కొత్త ప్లాంట్
థర్డ్ ఫేజ్ (2032 వరకు): మరో 20GWh యాడ్ చేసి మొత్తం 50GWh
జపాన్ డెలిగేషన్‌తో జరిగిన మీటింగ్స్‌లో పానాసోనిక్, నిచియా, సుమిటోమో వంటి కంపెనీలు కూడా చర్చల్లో పాల్గొన్నాయి. ముడి పదార్థాల సరఫరా కోసం ఇవి స్ట్రాంగ్ పార్టనర్స్ అవుతాయని JSW నమ్ముతోంది.
JSW దృష్టి కేవలం సెల్ తయారీ మీద మాత్రమే కాదు. బ్యాటరీలకు కావాల్సిన కాథోడ్, అనోడ్, సెపరేటర్ లాంటి కీలక మెటీరియల్స్‌లో కూడా ఇన్వెస్ట్ చేయాలనుకుంటోంది. దీని వెనుక లాజిక్ క్లియర్ "మొత్తం సప్లై చైన్ మన చేతిలో ఉండాలి" అనేది.
JSW తమ ప్లాన్‌ను రెండు సెపరేట్ డివిజన్లుగా తీసుకెళ్తోంది. ఒకటి JSW గ్రీన్ మొబిలిటీ, దీంట్లో EV కార్లు, బస్సులు, కమర్షియల్ వెహికిల్స్ వస్తాయి. మరొకటి JSW Bess, ఇది బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్స్ మీద ఫోకస్ చేస్తుంది. అంటే వాహనాల నుండి బ్యాటరీల వరకు ఫుల్ సొల్యూషన్స్ అందించాలనేది JSW గేమ్ ప్లాన్.
JSW ఎక్కువగా లిథియమ్ ఐరన్ ఫాస్ఫేట్ (LFP) బ్యాటరీలపై ఫోకస్ చేయనుంది. ఇది ఎందుకు అంటే? చైనాలో EVలలో 80% LFP బ్యాటరీలే వాడుతున్నారు. ఖర్చు తక్కువ, సేఫ్టీ ఎక్కువ. కానీ అమెరికాలో ఇది ఇంకా
JSW మాత్రమే కాదు, Ola Electric, Reliance, Amara Raja, Exide, Agratas కూడా గిగాఫ్యాక్టరీలపై పని చేస్తున్నారు. వీటిలో Ola Electric ఫాస్టెస్ట్ మూవర్ 1.4GWh సామర్థ్యం కలిగిన మొదటి సెల్స్ ఈ నెల మార్కెట్‌లోకి వస్తున్నాయి. బ్యాటరీ బిజినెస్ అంటే JSWకి ఓ పార్ట్ మాత్రమే. గ్రూప్ ఇప్పటికే ఆటోమొబైల్ మాన్యుఫాక్చరింగ్‌లో రూ.1,000 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టింది. అలాగే చైనాకు చెందిన SAIC తో జాయింట్ వెంచర్‌లో $300 మిలియన్ ఫండ్రైజ్ కూడా ప్రోగ్రెస్‌లో ఉంది.
సజ్జన్ జిందాల్ క్లియర్‌గా చెప్పారు "మా ప్లాన్ చైనా కంపెనీల అవుట్‌పోస్ట్ కావడం కాదు. మనమే ఇండియాలో తయారు చేసి, వాల్యూ జోడించి, ఇక్కడే అమ్మాలి." మొత్తానికి, JSW ఇప్పుడు బ్యాటరీలతో స్టార్ట్ చేసి, EV ఎకోసిస్టమ్ మొత్తాన్ని తన అండర్‌లోకి తెచ్చుకోవాలని ప్రయత్నిస్తోంది. ఇది సక్సెస్ అయితే, ఇండియాలోనే కొత్త EV పవర్‌హౌస్ రెడీ అయ్యే అవకాశముంది.


Click it and Unblock the Notifications