కరోనా మహమ్మారి నేపథ్యంలో ఇటీవల అన్ని రంగాల్లో ఉద్యోగాలు పోయాయి. కార్యకలాపాలు ప్రారంభమయ్యాక ఉద్యోగాలు క్రమంగా పెరుగుతున్నాయి. మే - ఆగస్ట్ మధ్య అభ్యర్థులు ఉద్యోగాల కోసం వెతకడం 30 శాతం పెరిగిందని గ్లోబల్ జాబ్ సైట్ ఇండీడ్ నివేదిక తెలిపింది. ముఖ్యంగా మన దేశంలో ఆతిథ్యం, పర్యాటక రంగాల్లో ఉద్యోగాన్వేషణ పుంజుకుందని వెల్లడించింది. ఈ రంగాల్లో ఉద్యోగ ప్రకటనలు ఏడాది క్రితంతో పోలిస్తే మే నెలలో 69 శాతం తగ్గాయి. అదే సమయంలో గత ఏడాది సెప్టెంబర్ కంటే ఈసారి 58 శాతమే తగ్గాయి. అంటే క్రమంగా కోలుకుంటున్నట్లుగా భావించవచ్చు.

ఉద్యోగ ప్రకటనలు పెరుగుతున్నప్పటికీ... క్షీణత
ఇండీడ్ వెబ్‌సైట్ మే - ఆగస్ట్ మధ్య వచ్చిన ఉద్యోగ ప్రకటనల ఆధారంగా ఈ నివేదికను రూపొందించింది. గత ఏడాది నెలలతో ఈసారి నెలల వారీగా ఉద్యోగ ప్రకటనలు పెరుగుతున్నప్పటికీ, క్షీణత మాత్రం ఉందని వెల్లడించింది. మే-ఆగస్ట్ కాలంలో ఉద్యోగ ప్రకటనలు 21 శాతం మేర క్షీణించాయి. 2020 మే - ఆగస్ట్ మధ్య ఉద్యోగాల కోసం సెర్చ్ చేయడం 30 శాతం పెరిగింది. భారత్‌లో ఆతిథ్యం, పర్యాటకరంగాల్లో క్రమంగా ఉద్యోగాలు పెరుగుతున్నాయని తెలిపింది. మే - ఆఘస్ట్ మధ్య వచ్చిన ఉద్యోగ ప్రకటనల ఆధారంగా ఇండీడ్ ఈ నివేదికను రూపొందించింది.

జాబ్ పోస్టింగ్స్.. జాబ్ సెర్చింగ్స్
2019తో పోలిస్తే ఈ ఏడాది ఇదే కాలంలో (మార్చి-ఆగస్ట్) మధ్య జాబ్ పోస్టింగ్స్ 49 శాతం మేర తగ్గినట్లు ఇండీడ్ నివేదిక తెలిపింది. 2019 ఆగస్ట్ నెలతో పోలిస్తే ఈ ఆగస్ట్‌లో పోస్టింగ్స్ 56 శాతం మేర క్షీణించాయి. జాబ్ సెర్చింగ్స్ 44 శాతం మేర తగ్గాయి. టూరిజం రంగంలో లాక్ డౌన్ సమయం నుండి జాబ్ సెర్చింగ్స్ 45 శాతం మేర తగ్గినట్లు తెలిపింది. ఆర్థిక కార్యకలాపాలు తిరిగి ప్రారంభం కావడంతో మే నెల నుండి క్రమంగా పెరుగుతున్నట్లు వెల్లడించింది.

ఈ రంగాలపై ప్రభావం
కరోనా మహమ్మారి కారణంగా పర్యాటక, ఆతిథ్య, విమానయాన రంగాలు భారీగా దెబ్బతిన్నాయి. పర్యాటక రంగానికి సంబంధించి దేశంలో ప్రతి ఎనిమిది ఉద్యోగాల్లో ఒకటి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా భారత దేశ ఆర్థిక వ్యవస్థకు ఈ రంగం ఎంతో దోహదపడుతుందని ఇండీడ్ మేనేజింగ్ డైరెక్టర్ శశికుమార్ తెలిపారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications