ముంబై: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నుంచి డిసెంబర్ మధ్య ఉండే ఉద్యోగుల కోత ఈ ఏడాది కాస్త ఎక్కువగా కనిపిస్తోంది. దిగ్గజ కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఉద్యోగుల్ని తొలగిస్తున్నాయి. ఇందుకు ఎన్నో కారణాలు ఉన్నాయి. ఉద్యోగులను తొలగించేందుకు చిన్న చిన్న కారణాలు చెబుతున్నాయి. చాలామందికి ఎప్పుడు తీసేస్తారో తెలియదు. వేతనాలు ఎక్కువగా ఉన్న సీనియర్ల పైనే ఈ ప్రభావం ఎక్కువగా ఉంది.

గతంలో కంటే ఎక్కువ తొలగింపులు
ఆర్థిక మందగమనం, శాలరీ రూపంలో ఆర్థిక భారం, అంతర్జాతీయం మందగమన పరిస్థితులు, రక్షణాత్మక ధోరణులు, కొత్త ప్రాజెక్టుల సందిగ్ధత, కొత్త టెక్నాలజీ వంటి వివిధ కారణాలతో సీనియర్ ఉద్యోగులను పలు కంపెనీలు ఇంటికి పంపిస్తున్నాయి. ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్, టాటా స్టీల్ (యూరోప్) వంటి దిగ్గజ కంపెనీలు సీనియర్లను ఇంటికి పంపించేందుకు సిద్ధమయ్యాయి. హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల్లో కాస్ట్ కట్టింగ్ తొలగింపులు ఆందోళనలు కలిగిస్తున్నాయి. గతంలో కంటే ఇలాంటి తొలగింపులు ఈ ఏడాది నాలుగైదు శాతం ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. అంతకుముందు తొమ్మిది లేదా పది శాతం వరకు ఉండేవి.

సీనియర్ల స్థానంలో జూనియర్లు...
ఖర్చులు తగ్గించి, మార్జిన్లు పెంచుకోవడంతో పాటు వివిధ కారణాల వల్ల.. చిన్న చిన్న కారణాలకు తొలగిస్తున్నారట. సీనియర్లను తొలగించి వారి స్థానంలో జూనియర్లను నియమించుకుంటున్నారు. ఏడాది ప్యాకేజీ కంపెనీని పట్టి రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షలు దాటిందంటే వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉందట. మారుతున్న టెక్నాలజీకి తోడు జూనియర్లకు రూ.2 నుంచి రూ.4 వరకు ప్యాకేజీ ఇస్తే సరిపోతుందని కొన్ని కంపెనీలు భావిస్తున్నాయట.

అదనపు ఉద్యోగాలు...
తాము అదనంగా ఈసారి ఎక్కువ నియామకాలు చేపట్టామని కొన్ని కంపెనీలు చెప్పడం వెనుక మరో కారణం కూడా ఉందట. ఎక్కువ వేతనాలు ఉన్న వారిని తొలగించి, ఆ ఒక్కరి స్థానంలో అతి తక్కువ వేతనాలకు ఎక్కువ మంది జూనియర్లను తీసుకుంటున్నారట. వీటిని అదనపు ఉద్యోగాలుగా చెబుతున్నాయట.

తొలగింపు కారణాలు...
లాగిన్, లాగవుట్ సమయం, వివిధ అంశాల్లోని పొరపాట్లు, ఏడాది కాలంలో పనితీరు, గ్రేడింగ్, కేబిన్‌లో - బయట ఉన్న సమయం, ఫిర్యాదులతో పాటు డి గ్రేడ్ ఇచ్చి బయటకు పంపిస్తున్నారు.

ఇక్కడ సంప్రదించవచ్చు..
కారణం లేకుండా ఉద్యోగంనుంచి తొలగిస్తే వారు ఫోరం ఫర్ ఐటీ ప్రొఫెషనల్స్‌ను కలవొచ్చు. లాభాలు ఉన్నంత కాలం ఐటీ ఉద్యోగుల్ని తొలగించేందుకు చట్టాలు ఒప్పుకోవని, హైదరాబాదులో కంపెనీలు బలవంతపు తొలగింపుకు పాల్పడితే ఈ సంస్థను సంప్రదించవచ్చునట. అలాగే, ఉద్యోగులు ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీని నేర్చుకోవాలని సూచిస్తున్నారు. మార్కెట్‌కు అనుగుణంగా ముందుకు సాగాలని చెబుతున్నారు.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications