JioFinance Tax Filing at Rs 24: 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్నులు (ITR) దాఖలు చేయడానికి చివరి తేదీ సెప్టెంబర్ 15. ఈ తేదీ సమీపిస్తోంది. ప్రతి సంవత్సరం ఈ సమయంలో ఉద్యోగులు, స్వయం ఉపాధి పొందే వారు, వ్యాపారులు ఆదాయపు పన్ను కట్టేందుకు లెక్కల్లో బిజీగా ఉంటారు. వారు ఇప్పుడు ఐటీఆర్ ఫైలింగ్ చేయడానికి పోయిన ఏడాది జరిగిన లెక్కలన్నీ తిరగేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ట్యాక్స్ పేయర్ల కోసం జియోఫైనాన్స్ ఓ కొత్త ఆఫర్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ఈ ఆఫర్ ద్వారా కేవలం రూ. 24 చెల్లించి ఐటీఆర్ దాఖలు చేసే అవకాశం ఇచ్చింది.
జియో ఫైనాన్స్ యాప్ ద్వారా ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. కంపెనీలో జీతం పొందే వ్యక్తులు, వార్షిక ఆదాయం రూ.5 లక్షల లోపు ఉండి, ఒక్క ఫారం-16 మాత్రమే ఉన్న వారు ఈ ఫీచర్ ద్వారా ఐటీ దాఖలు చేయవచ్చు. వీరంతా ఈ రూ.24 ప్లాన్‌ను ఉపయోగించుకోవచ్చు. ఈ కేటగిరీకి చెందినవారు స్వయంగా యాప్‌లో వివరాలు ఎంటర్ చేసి ఐటీఆర్ దాఖలు చేయాల్సి ఉంటుంది. దీని ప్రకారం.. తక్కువ ఆదాయం ఉన్న ఉద్యోగులకు ఇది సరైన ఆప్షన్ అని చెప్పవచ్చు.

అయితే బిజినెస్ ఇన్కమ్, క్యాపిటల్ గెయిన్స్, విదేశీ పెట్టుబడులు వంటి కాంప్లెక్స్ లావాదేవీలు ఉన్నవారికి ఈ రూ.24 ప్లాన్ పనికిరాదు. అలాంటి వారికోసం జియో ఫైనాన్స్ రూ.999 ప్లాన్‌ను కూడా అందిస్తోంది. అందులో సీఏ (చార్టర్డ్ అకౌంటెంట్) సహాయం లభిస్తుంది.
మార్కెట్‌లో ఇప్పటికే పలు ట్యాక్స్ ఫైలింగ్ ప్లాట్‌ఫామ్‌లు ఉన్నాయి. వాటి ధరలు ఇలా ఉన్నాయి:
టాక్స్2విన్: తక్కువ ప్లాన్ రూ.49, సీఏ సహాయంతో రూ.1,274 - రూ.7,968 వరకు ఛార్జ్ చేస్తుంది
మైట్రిటర్న్: సెల్ఫ్-ఫైలింగ్ రూ.199 ఉంటుంది, సీఏ సహాయంతో రూ.1,000 - రూ.6,000
టాక్స్ మేనేజర్: రూ.500 నుంచి ప్రారంభం, గరిష్టంగా రూ.5,000 వరకు ఉండే అవకాశం ఉంది
క్లియర్ టాక్స్: బేసిక్ రూ.2,540, లక్స్ అడ్వైజరీ ప్లాన్ రూ.25,000 వరకు ఉంటుంది.
టాక్స్‌బడ్డీ (డైరెక్ట్):సెల్ఫ్-ఫైలింగ్ రూ.699, కాంప్లెక్స్ ఫైలింగ్స్ రూ.2,999 వరకు ఛార్జ్ చేస్తారు.
పై ధరలతో పోల్చితే జియోఫైనాన్స్ అందిస్తున్న రూ.24 ప్లాన్ చాలా తక్కువ అని స్పష్టమవుతుంది. అయితే తక్కువ ధర చూసి వెంటనే ప్లాన్ తీసుకోవాలని నిపుణులు సూచించడం లేదు. ఎందుకంటే ఇలాంటి చౌక ప్లాన్లలో ప్రొఫెషనల్ మార్గదర్శకత్వం అందించబడదని చెబుతున్నారు. ముఖ్యంగా కాంప్లెక్స్ ట్యాక్స్ లావాదేవీలు ఉన్నవారు ఇలాంటి ఆఫర్లతో చిక్కుల్లో పడే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. పైగా, డేటా భద్రత, సపోర్ట్ సర్వీసులు, కస్టమర్ కేర్ వంటి అంశాలు కూడా పరిశీలించాల్సి ఉంటుంది.
జియోఫైనాన్స్ ఆఫర్ ఖచ్చితంగా ఆకర్షణీయమేనని చెప్పవచ్చు. ఇది చిన్న జీతదారులు, సులభమైన ట్యాక్స్ రిటర్న్ ఫైలింగ్ అవసరమయ్యే వారికి ఇది ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ ఆప్షన్. కానీ, బిజినెస్ ఆదాయం, ఇన్వెస్ట్‌మెంట్స్, క్యాపిటల్ గెయిన్స్ వంటి క్లిష్టమైన లావాదేవీలు ఉన్న వారు మాత్రం అనుభవజ్ఞులైన సీఏ సహాయం తీసుకోవడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.
ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయడానికి కావాల్సిన పత్రాలు
ఐటీఆర్ ఫైలింగ్ ప్రక్రియలో మొదటి అడుగు ఏంటంటే.. అవసరమైన పత్రాలను సక్రమంగా సేకరించడం. మీ ఆదాయం, పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన అన్ని ఆధారాలను సిద్ధం చేసుకోవాలి. ముఖ్యంగా ఈ క్రింది పత్రాలు అవసరం అవుతాయి:
ఫారం-16: జీతం పొందే ఉద్యోగులకు ఇది అత్యంత ముఖ్యమైన పత్రం. మీ యజమాని నుండి ఫారం-16 తప్పనిసరిగా పొందాలి.
బ్యాంక్ స్టేట్‌మెంట్‌లు & వడ్డీ సర్టిఫికెట్లు: సేవింగ్స్ అకౌంట్, ఫిక్స్‌డ్ డిపాజిట్‌లు వంటి వాటి నుండి వచ్చిన వడ్డీ వివరాలను చూపించడానికి ఇవి అవసరం అవుతాయి.
పెట్టుబడి రుజువులు: ఆదాయపు పన్ను చట్టం, 1961లోని వివిధ విభాగాల (80C, 80D మొదలైనవి) కింద మీరు పొందే తగ్గింపులకు సంబంధించిన ఇన్వెస్ట్‌మెంట్ ప్రూఫ్‌లు తప్పనిసరి. ఉదాహరణకు - లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం రసీదులు, పీఎఫ్/పీపీఎఫ్ చెల్లింపులు, మెడిక్లెయిమ్ పాలసీ రుజువులు.
మూలధన లాభాల వివరాలు (Capital Gains Statements): మీరు షేర్లు, మ్యూచువల్ ఫండ్లు లేదా స్థిరాస్తిని విక్రయించినట్లయితే, వాటి ద్వారా వచ్చిన లాభాలు లేదా నష్టాలను చూపించే వివరాలు సిద్ధంగా ఉంచాలి. ఈ పత్రాలను ముందుగానే సేకరించుకోవడం వలన రిటర్న్ ఫైలింగ్ వేగంగా, తప్పులు లేకుండా, ఒత్తిడి లేకుండా పూర్తవుతుంది.
సరైన ITR ఫారమ్‌ను ఎలా ఎంచుకోవాలి? : ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలు చేసే సమయంలో ఏ ఫారమ్ ఉపయోగించాలో నిర్ణయించడం అత్యంత ముఖ్యమైన దశగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీ ఆదాయం ఎలాంటి వనరుల నుండి వస్తుందో, ఎంతవరకు వస్తుందో బట్టి ఫారమ్ ఎంపిక మారుతుంది.
ITR-1 (సహజ్) : ఇది సాధారణ పన్ను చెల్లింపుదారుల కోసం రూపొందించిన సరళమైన ఫారమ్.వార్షిక ఆదాయం రూ.50 లక్షల లోపు ఉండాలి. ఆదాయం జీతం లేదా పెన్షన్ రూపంలో ఉండాలి. ఒకే ఒక్క ఇంటి ఆస్తి ద్వారా వచ్చే ఆదాయం ఇక్కడ చూపవచ్చు. బ్యాంకు వడ్డీ, డివిడెండ్ వంటి ఇతర ఆదాయాలు కూడా చేర్చుకోవచ్చు. వ్యవసాయం ద్వారా రూ. 5 వేలు లోపు వచ్చే ఆదాయం ఉన్నా ఇది వర్తిస్తుంది.సులభమైన ఆదాయం ఉన్న జీతం పొందే వ్యక్తులకు ITR-1 సరిపోతుంది.
ITR-2: వ్యాపారం లేదా వృత్తి ద్వారా ఆదాయం లేనివారికి ఇది వర్తిస్తుంది. ఒకటి కంటే ఎక్కువ ఇళ్ల ఆస్తులు ఉన్న వారు దీన్ని వాడాలి. మూలధన లాభాలు (Capital Gains) ఉన్నవారు - ఉదాహరణకు షేర్లు, మ్యూచువల్ ఫండ్లు లేదా ఆస్తి విక్రయాలు - ఈ ఫారమ్‌లో చూపించాలి. విదేశీ పెట్టుబడులు లేదా ఆస్తులు ఉన్నవారికీ ఇది తప్పనిసరి. జీతం మాత్రమే కాకుండా కాంప్లెక్స్ వనరుల ద్వారా ఆదాయం వచ్చే వారికీ ITR-2 సరైనది.
ITR-3: ఇది ప్రత్యేకంగా వ్యాపారం లేదా వృత్తి ద్వారా ఆదాయం పొందే వారి కోసం. ITR-1, ITR-2, ITR-4కు అర్హత లేని వ్యక్తులు సాధారణంగా ITR-3 దాఖలు చేయాలి. స్వయం ఉపాధి పొందేవారు, వ్యాపారం నడిపేవారు ఈ ఫారమ్ వాడాలి. వ్యాపారులు, ఫ్రీలాన్సర్లు లేదా ప్రొఫెషనల్స్‌కి ఇది సరైన ఎంపిక.
ITR-4 (సుగమ్) : వార్షిక ఆదాయం రూ. 50 లక్షల లోపు ఉన్న నివాసితులు లేదా హిందూ అవిభాజ్య కుటుంబాలు (HUFs) ఈ ఫారమ్ వాడవచ్చు. ఇది ఊహించిన ప్రాతిపదికన నిర్ధారించబడిన ఆదాయం (Presumptive Income) ఉన్నవారికి వర్తిస్తుంది. ఇందులో జీతం, ఒక ఇంటి ఆస్తి, వడ్డీ, డివిడెండ్, అలాగే రూ. 5 వేలు లోపు వ్యవసాయ ఆదాయం కూడా చూపించవచ్చు. చిన్న వ్యాపారాలు లేదా స్వతంత్ర వృత్తి చేసేవారికి సులభమైన ఆప్షన్ ఇదే.
ITR ఫారమ్ ఎంపిక చేసే సమయంలో మీ ఆదాయం ఏ వనరుల నుండి వస్తుందో సరిగ్గా అర్థం చేసుకుని దానిప్రకారం సరైన ఫారమ్ ఎంచుకోవాలి. తప్పుగా ఫారమ్ ఎంచుకుంటే మీ రిటర్న్ తిరస్కరించబడే అవకాశముంది.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్‌లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?



Click it and Unblock the Notifications