కరోనా మహమ్మారి కారణంగా ఐటీ కంపెనీలు మొదలు వివిధ రంగాలకు చెందిన సంస్థలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చాయి. దీంతో కార్యాలయాల వెలుపల.. అంటే ఇళ్లలో ఇంటర్నెట్ డేటాకు డిమాండ్ పెరిగింది. ఇలాంటి కీలకమైన సమయంలో హైస్పీడ్ బ్రాడ్‌బాండ్ కనెక్టివిటీని అందించేందుకు జియో ఫైబర్ శ్రమిస్తోంది. జియో ఫైబర్ హైస్పీడ్ ఇంటర్నెట్ అందించేందుకు కృషి చేస్తోంది.

డబుల్ డేటా
హైదరాబాద్ సహా తెలంగాణలోని వివిధ నగరాల్లో జియో ఫైబర్ కస్టమర్లకు బంపరాఫర్ ఇస్తోంది. జియో ఫైబర్‌లో అందుబాటులో ఉన్న అన్ని ప్లాన్స్ పైన డబుల్ డేటాను అందిస్తున్నట్లు సంస్థ తెలిపింది. ఈ మేరకు జియో ఫైబర్ ప్రకటన విడుదల చేసింది. కరోనా లాక్ డౌన్ కారణంగా ఇళ్లలోనే ఉంటున్న కస్టమర్లకు అన్ని ప్లాన్స్ పైన డబుల్ డేటా అందిస్తున్నట్లు తెలిపింది.

ఈ నగరాల్లో..
హైదరాబాద్‌తో పాటు హన్మకొండ, వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, కోదాడ, మహబూబ్ నగర్, నల్గొండలోని రెసిడెన్షియల్ ప్రాంతాల్లో హైస్పీడ్ బ్రాడ్‌బాండ్‌ను 1Gbps వేగంతో అందిస్తోంది. డేటా వినియోగం పెరుగుతున్నందున తమ కస్టమర్లకు అన్ని ప్లాన్స్ పైన దీనిని రెండింతలు అందిస్తోంది. లాక్ డౌన్ వంటి క్లిష్ట సమయంలో జియో ఫైబర్ టీమ్ కస్టమర్లకు ఇన్‌స్టాలేషన్, సర్వీసులను అందిస్తోంది.

హైస్పీడ్ బ్రాడ్ బాండ్ సేవలు
ప్రస్తుతం జియో ఫైబర్ హైస్పీడ్ బ్రాడ్‌బాండ్ సేవలు హైదరాబాద్, హన్మకొండ, వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, కోదాడ, నల్గొండ, మహబూబ్ నగర్ సహా రాష్ట్రంలోని ఎంపిక చేసిన ఇతర నగరాల్లో ఉన్నాయి. అదే వేగంతో ఇతర పట్టణాలకు విస్తరిస్తోంది జియో ఫైబర్. 100Mbps నుండి ప్రారంభమై 1Gbps దాకా హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలు జియో ఫైబర్ అందిస్తోంది. జియో ఫైబర్ హౌస్ హోల్డ్స్, వివిధ రంగాల్లోని చిన్న, పెద్ద సంస్థలు, ప్రొఫెషనల్స్‌కు సేవలు అందిస్తోంది.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications