ముంబై: దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో.. కొత్తగా గేమింగ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది. గేమ్ కంట్రోలర్‌ను భారత్‌లో లాంచ్ చేసింది. మొదట ఫీచర్, అనంతరం గూగుల్‌తో కలిసి స్మార్ట్‌ఫోన్లను అందుబాటులోకి తీసుకొచ్చిన తరువాత ఈ కంపెనీ తయారు చేసిన ఇంకో ప్రొడక్ట్ ఇదే. గేమింగ్ సెగ్మెంట్‌పై ఇక దశలవారీగా తన ఆధిపత్యాన్ని ప్రదర్శించడానికి రిలయన్స్ జియో.. తొలి అడుగు వేసినట్టయిందనే అభిప్రాయాలు మార్కెట్ వర్గాల నుంచి వినిపిస్తోన్నాయి.
ఈ గేమ్ కంట్రోలర్.. రిలయన్స్ జియో అధికారిక వెబ్‌సైట్‌లో మాత్రమే ప్రస్తుతం అందుబాటులో ఉంది. ఈ వెబ్‌సైట్ నుంచి మాత్రమే దీన్ని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఎనిమిది గంటలపాటు నిరాటంకంగా దీన్నివినియోగించుకోవచ్చు. ఎనిమిది గంటల పాటు బ్యాటరీ లైఫ్ ఉంటుంది. రీఛార్జబుల్ లిథియం అయాన్ బ్యాటరీ సౌకర్యం ఉంది. ఈ కొత్త గేమ్ కంట్రోలర్‌ను అన్ని ఆండ్రాయిడ్ టాబ్లెట్‌లు, ఆండ్రాయిడ్ టీవీ, ఇతర డివైజ్‌లకు అనుసంధానం చేసుకోవచ్చు.

జియో సెట్‌టాప్ బాక్స్ వినియోగదారులకు మరింత బెస్ట్ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తుందీ గేమ్ కంట్రోలర్. టాటా ప్లే స్మార్ట్ సెట్‌టాప్ బాక్స్ లేదా కేబుల్ టీవీ ఛానెల్‌లకు జియో గేమ్ కంట్రోలర్ యాక్సెస్ ఉండదు. ఓటీటీ ప్లాట్‌ఫామ్స్, జియోటీవీ ప్లస్ యాప్ సహా కొన్ని లైవ్ టెలికాస్ట్ టీవీ ప్రోగ్రామ్స్, వీడియోలను చూసే వీలు ఉంది. బ్లూటూత్ వీ4.1 టెక్నాలజీ వంటి ఫీచర్‌లు ఈ గేమ్ కంట్రోలర్ సొంతం. వైర్‌లెస్ రేంజ్ 10 మీటర్ల వరకు ఉంటుంది.

ఈ గేమ్ కంట్రోలర్- రెండు ప్రెషర్ పాయింట్ ట్రిగ్గర్స్‌తో కూడిన 20-బటన్లు, 8-డైరెక్షన్ యార్రో బటన్స్, రెండు జాయ్‌స్టిక్స్ ఇందులో అమర్చి ఉన్నాయి. రెండు వైబ్రేషన్ ఫీడ్‌బ్యాక్ మోటార్లు, హాప్టిక్ కంట్రోల్‌కి సపోర్టర్ అందుబాటులో ఉందీ గేమ్ కంట్రోలర్‌లో. ఈ జియో గేమ్ కంట్రోలర్ ధర 3,499 రూపాయలు. మ్యాట్ బ్లాక్ ఫినిషింగ్‌లో లభిస్తుంది. ఈఎంఐ ఆప్షన్ కూడా కల్పించింది జియో యాజమాన్యం. జియో వెబ్‌సైట్‌లో ఈఎంఐ ఆప్షన్ ద్వారా దీన్ని పొందవచ్చు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఇ-కామర్స్‌లల్లో ఇది అందుబాటులో లేదు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications