బంగారం ధరలు గతవారం దాదాపు స్థిరంగా ఉన్నాయి. అంతకుముందు ఓ సమయంలో రూ.50,000 దిగువకు పడిపోయిన గోల్డ్ ఫ్యూచర్స్ ఆ తర్వాత రూ.52,000కు చేరుకున్నప్పటికీ, గతవారం రూ.50,000 దిగువన ముగిశాయి. ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ గతవారం చివరి సెషన్లో రూ.285 తగ్గి రూ.50,984 వద్ద ముగిసింది. అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.251 తగ్గి రూ.51,265 వద్ద ముగిసింది. సిల్వర్ ఫ్యూచర్స్ కూడా రూ.62,000కు సమీపంలో ముగిశాయి. క్రితం సెషన్లో రూ.676 తగ్గినప్పటికీ రూ.61,660వద్ద ముగిసింది.
అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్ 1850 డాలర్లకు పైన ముగిశాయి. గోల్డ్ ఫ్యూచర్స్ (ఆగస్ట్ 22) ఓ సమయంలో 1870 డాలర్లకు చేరుకున్నప్పటికీ చివరి సెషన్లో దాదాపు 1 శాతం తగ్గడంతో 1853 డాలర్ల వద్ద ముగిసింది. సిల్వర్ ఫ్యూచర్స్ 0.335 డాలర్లు తగ్గి 21.940 డాలర్ల వద్ద ముగిసింది.

ఇదిలా ఉండగా, జ్యువెల్లరీ వ్యాపారులు డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నారు. గతవారం కాస్త పెరిగినప్పటికీ డిస్కౌంట్‌తో అందిస్తున్నారు. పెళ్లిళ్ళు, శుభకార్యాల సీజన్ కావడంతో బంగారానికి డిమాండ్ పెరుగుతుంది. ఇది ధరలపై కూడా ప్రభావం చూపవచ్చు. డిమాండ్‌ను క్యాష్ చేసుకోవడానికి జ్యువెల్లరీ వ్యాపారులు డిస్కౌంట్ ఆఫర్ ఇస్తున్నారు. ఔన్స్ పైన గోల్డ్ డీలర్స్ 9 డాలర్ల వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు.
More From GoodReturns

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

10 వేల డాలర్లకు బంగారం ధర.. షాకింగ్ అంచనాలను విడుదల చేసిన యార్డెని రీసెర్చ్..

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో ఎంతకు చేరిందంటే.. మార్చి 25, బుధవారం ధరలు ఇవే..

కుప్పకూలిన బంగారం ధర.. 10 గ్రాములు ఏకంగా రూ. 5 వేలకు పైగా ఢమాల్.. కొనుగోలుపై నిపుణులు కీలక సూచన

భారీగా తగ్గిన బంగారం ధరలు .. భయపడి అమ్మేసుకుంటున్న పెట్టుబడిదారులు.. మార్చి 24, మంగళవారం ధరలు ఇవే.

గత 15 ఏళ్ళ రికార్డును తిరగరాస్తూ బంగారం, వెండి ధరలు ఢమాల్..భవిష్యత్తులో తగ్గుదలపై విశ్లేషకులు ఏమంటున్నారంటే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు, కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం

Gold prices: వెండితో పోలిస్తే బంగారం సేఫేనా? ఈ రిపోర్ట్ చూస్తే మీ పెట్టుబడి ప్లాన్ మార్చుకుంటారు!



Click it and Unblock the Notifications