జెట్ రేంజ్‌లో తగ్గిన జెట్ ఫ్యూయల్ ధర
న్యూఢిల్లీ: దేశంలో విపరీతంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించే దిశగా కేంద్ర ప్రభుత్వం పలు చర్యలను తీసుకుంది. భగ్గుమంటోన్న ఇంధన ధరల నియంత్రణ దిశగా అడుగులు వేసింది. ఆల్ టైమ్ హైకి చేరుకున్న పెట్రోల్, డీజిల్, డొమెస్టిక్ ఎల్పీజీ, కమర్షియల్ సిలిండర్ల రేట్లకు మూకుతాడు వేయడం మొదలు పెట్టింది. ఇందులో భాగంగా కిందటి నెలలో పెట్రోల్, డీజిల్ ధరలపై అమలు చేస్తోన్న ఎక్సైజ్ డ్యూటీని తగ్గించింది. పెట్రోల్‌పై 6, డీజిల్‌పై 8 రూపాయల మేర తగ్గించింది.
అదే సమయంలో దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు సరఫరా చేసే గృహావసర వంటగ్యాస్ సిలిండర్ కనెక్షన్లపై ఏకంగా 200 రూపాయల సబ్సిడీని ప్రకటించింది. ఈ చర్యల వల్ల వాటి రేట్లు భారీగా తగ్గాయి. వాహనదారులు, దీపం పథకం లబ్దిదారులకు కొంత ఉపశమనాన్ని కలిగించాయి. ఇప్పుడు తాజాగా కమర్షియల ఎల్పీజీ సిలిండర్లపై 135 రూపాయలను తగ్గించింది. తగ్గించిన ధరలు ఈ తెల్లవారు జామున 6 గంటల నుంచి అమల్లోకి వచ్చాయి.
తాజా తగ్గింపుతో దేశ రాజధానిలో ఒక్కో సిలిండర్ రేటు 2,219 రూపాయలకు చేరింది. ముంబైలో రూ.2,171.50 పైసల వద్ద నిలిచింది. కోల్‌కతలో 2,322 రూపాయలు, చెన్నైలో 2,372 రూపాయలు పలుకుతోంది. గృహావసరాల కోసం వినియోగించే వంటగ్యాస్ కనెక్షన్ల ధరలో ఎలాంటి మార్పు లేదు. వాటి రేట్లు యధాతథంగా కొనసాగుతున్నాయి.

ఈ చర్యలు వాణిజ్య వినియోగదారులను ఊపిరీ పీల్చుకునేలా చేశాయి. అదే క్రమంలో- ఏవియేషన్ టర్బన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) ధరలను కూడా తగ్గించింది కేంద్ర ప్రభుత్వం. 1.3 శాతం మేర వాటి రేట్లను కుదించింది. ఫలితంగా విమాన ఇంధనం ధర కిలో లీటర్ ఒక్కింటికి 1.21 లక్షల రూపాయలకు తగ్గింది. ఈ నెల 16వ తేదీన చమురు సంస్థలు జెట్ ఏవియేషన్ ఇంధన ధరలను అయిదు శాతం మేర పెంచిన విషయం తెలిసిందే.
దీనితోో కిలో లీటర్ ఒక్కింటికి 1.23 లక్షలకు చేరింది దాని ధర. ఇందులో 1.3 శాతం మేర తగ్గించడం వల్ల దాని ఢిల్లీలో దీని ధర 1,21,475.74 రూపాయలకు చేరింది. కోల్‌కత-1,26,369.98 రూపాయలు, ముంబై-1,20,306.99, చెన్నై-1,25,725.36 రూపాయలకు తగ్గింది. కిరోసిన్ రేటును కూడా తగ్గించాయి చమురు కంపెనీలు.


Click it and Unblock the Notifications