Jensen Huang: రెస్టారెంట్ వెయిటర్ నుంచి..ఇప్పుడు రూ. 1,51,00,000 కోట్లకు అధిపతిగా మారాడు..!
ఒకప్పుడు రెస్టారెంట్ లో వెయిటర్ గా పని చేశాడు. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు. అయినా ఆయన అనుకున్నది సాధించాడు.అతను ఎవరో కాదు. Nvidia కంపెనీ అధినేత జెన్సన్ హువాంగ్. ఎన్విడియా ఒక అమెరికన్ బహుళజాతి సాంకేతిక సంస్థగా పేరొందింది. ఈ కంపెనీ ప్రధాన కార్యాలయం కాలిఫోర్నియాలో ఉంది. కంపెనీ సాఫ్ట్‌వేర్,హార్డ్‌వేర్ తయారీ, సరఫరా వ్యాపారంలో కొనసాగుతోంది.
గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ సిస్టమ్‌లు, డేటా సైన్స్ కోసం అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్‌ఫేస్‌లు, అధిక-పనితీరు గల కంప్యూటర్‌లు, సెల్ ఫోన్‌ల చిప్‌ల తయారీ వంటి విభిన్న రంగాలలో కూడా ఈ కంపెనీ పని చేస్తోంది. జెన్సన్ హువాంగ్ ఈ కంపెనీని స్థాపించారు. జెన్సన్ హువాంగ్ 1963లో తైవాన్ లో పుట్టారు. హువాంగ్ వయస్సు 5 ఏళ్లు ఉన్నప్పుడు వారి కుటుంబం థాయిలాండ్ కు వలస వెళ్లారు.

హువాంగ్ తొమ్మిదేళ్లు ఉన్నప్పుడు తన మేనమామతో కలిసి వాషింగ్టన్ లోని టాకోమాకు వెళ్లాడు. అక్కడే చదువు కొనసాగించాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా రెస్టారెంట్ లో వెయిటర్ గా పని చేశాడు. 1993లో క్రిస్ మలాచోస్కీ అండ్ కర్టిస్ ప్రీమ్‌లతో కలిసి ఎన్విడియా కంపెనీని స్థాపించారు. ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. జెన్సన్ హువాంగ్ 2007లో కంపెనీ సీఈఓ బాధ్యతలు చేపట్టారు. సీఈఓగా ఆయన 24.6 మిలియన్ డాలర్లు జీతం పొందారు. దీంతో అతను అమెరికాలో అత్యధిక జీతం తీసుకున్న 61వ వ్యక్తిగా నిలిచారు.
ఒకప్పుడు సర్వర్ గా పని చేసిన జెన్సన్ హువాంగ్ ఇప్పుడు 64.2 బిలియన్ డాలర్లకు అధిపతిగా మారాడు. వెయిటర్ సృష్టించిన కంపెనీ విలువ ఇప్పుడు రూ. 15100000 కోట్ల కంటే ఎక్కువగా ఉంది. పట్టుదలతో అనుకున్నది సాధించాడు. ఎప్పుడైనా ఎవరినైనా చిన్నగా అంచనా వేయకూడదు.


Click it and Unblock the Notifications