Budget 2025: రానున్న బడ్జెట్లో ఈక్విటీ ఇన్వెస్టర్లకు మిగిలేది నిరాశే.. జెఫరీస్ సంచలన రిపోర్ట్..!
Union Budget 2025: కేంద్రంలో మోదీ సర్కార్ ఈ ఏడాది జరిగిన ఎన్నికలతో మూడోసారి అధికారాన్ని చేపట్టింది. దీని తర్వాత తొలిసారిగా ఫిబ్రవరిలో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు ఇప్పటి నుంచే సన్నాహాలు స్టార్ట్ అవుతున్నాయి. గత సారి క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ రేట్లను పెంచిన తర్వాత ఈక్విటీ పెట్టుబడిదారులు భారీగా నిరాశకు గురైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రానున్న బడ్జెట్ పై సామాన్యుల నుంచి పరిశ్రమ వర్గాల వరకు అందరూ భారీగా ఆశలు పెట్టుకున్నారు.
ఈ క్రమంలోనే ప్రముఖ రేటింగ్ సంస్థ జెఫరీస్ తన 2025 ఇండియా ఔట్‌లుక్ నోట్‌లో కీలక అంశాలను పంచుకుంది. దూకుడుగా ఉన్న ఆర్థిక ఏకీకరణ మార్గం పట్ల మోడీ ప్రభుత్వం నిబద్ధతతో FY26లో ద్రవ్య లోటును 4.4 శాతానికి తగ్గించడంతో పాటు, ఖర్చు హెడ్‌రూమ్‌ను తగ్గిస్తుందని పేర్కొంది. అలాగే ఆర్థిక సంవత్సరం రెండవ అర్థభాగం ప్రభుత్వ వ్యయ వృద్ధి అధిక వృద్ధిని కలిగిస్తుందని పేర్కొంది. అందువల్ల ఫిబ్రవరిలో కేంద్ర బడ్జెట్ 2025 పెట్టుబడిదారుల సెంటిమెంట్లను సానుకూలంగా పెంచకపోవచ్చని భావిస్తున్నట్లు జెఫరీస్ పేర్కొంది. అలాగే గతంతో పోల్చితే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తగ్గినట్లు తన నోట్‍లో పేర్కొంది.

2024 జూలైలో ప్రవేశపెట్టబడిన వార్షిక బడ్జెట్ సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈక్విటీ పెట్టుబడుల లాభాలపై విధించే పన్ను రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ పన్ను రేటును 20 శాతానికి పెంచగా, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ పన్ను రేటును 12.5 శాతానికి పెంచారు. అయితే రానున్న రోజుల్లో ఈ పన్ను రేట్లను భారత ప్రభుత్వ పెంచే అవకాశాలు ఉన్నాయని తన అభిప్రాయాన్ని వెల్లడించింది. ఈ క్రమంలో షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ రేటు 30 శాతం తో పాటు దానిపై సర్ ఛార్జ్ కూడా ఉండవచ్చని పేర్కొంది. అయితే మరోసారి ఇండియన్ ప్రభుత్వం రేట్ల పెంపుకు దిగుతుందనే అంశాన్ని కొట్టిపారేయలేమని పేర్కొంది. ఒకవేళ ఇదే జరిగితే భారతీయ ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడిదారుల సెంటిమెంట్లు తీవ్రంగా దెబ్బతినొచ్చని జెఫరీస్ పేర్కొంది.
"మేము రానున్న ఆర్థిక సంవత్సరానికి పన్ను రాబడి వృద్ధిని 10 శాతంగా అంచనా వేస్తున్నాము. మొత్తం వ్యయ వృద్ధి ఎఫ్‌వై 25 ఇ మాదిరిగానే 6-7 శాతానికి పరిమితం చేయాలి. ఖర్చుపై కొంత సౌకర్యం ఉంటుంది జిఎస్‌టి సెస్ వసూళ్లు మిగులులోకి వచ్చే అవకాశం ఉంది. అయినప్పటికీ అదనపు వసూళ్లు రాష్ట్ర ప్రభుత్వంతో పంచుకునే అవకాశం ఉంది" అని జెఫరీస్ తాజా నోట్ లో వెల్లడించింది.
Disclaimer: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.


Click it and Unblock the Notifications