Japan-India Economic Partnership : భారతదేశం - జపాన్ సంబంధాలు మరింత బలపడే దిశలో కీలక అడుగుపడింది. రాబోయే 10 సంవత్సరాల్లో జపాన్ తన ప్రైవేట్ రంగం ద్వారా 10 ట్రిలియన్ యెన్ (సుమారు 67 బిలియన్ డాలర్లు) భారతదేశంలో పెట్టుబడి పెట్టాలని నిర్ణయించింది. టోక్యోలో జరిగిన 15వ ఇండియా-జపాన్ వార్షిక శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, జపాన్ ప్రధాని షిగెరు ఇషిబా ఈ డీల్ ప్రకటించారు.
ఈ సమావేశంలో రెండు దేశాలు 21 అంశాలపై అంగీకారం సాధించాయి. వీటిలో 13 ముఖ్య ఒప్పందాలు ఉన్నాయి. రక్షణ, అరుదైన ఖనిజాలు, సెమీకండక్టర్లు, హై-స్పీడ్ రైలు, అంతరిక్షం, శిక్షణ, రాష్ట్ర-ప్రావిన్స్ భాగస్వామ్యాలు ప్రధాన ప్రాధాన్యం పొందాయి. ఈ సమావేశంలో ఇరు దేశాలు రక్షణ సంబంధాలను బలోపేతం చేసి, భవిష్యత్‌లో సంయుక్తంగా ఆధునిక రక్షణ వేదికలను అభివృద్ధి చేయాలని నిర్ణయించుకున్నాయి.అలాగే భారతదేశంలో కీలక ఖనిజాల అన్వేషణ, మైనింగ్, నిల్వ కోసం జపాన్ పెట్టుబడులు పెట్టనుంది.
టెక్నాలజీ, సరఫరా గొలుసులో జపాన్ సహకారం ఇవ్వనుంది.ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుతో పాటు, దేశంలో 7,000 కిమీ హై-స్పీడ్ రైలు నెట్‌వర్క్ అభివృద్ధికి జపాన్ సహాయం చేస్తుంది.జపాన్‌లో 50 వేల మంది భారతీయులకు శిక్షణ ఇవ్వనున్నారు.అలాగే జపాన్ అంతరిక్ష సంస్థ JAXA, భారత చంద్రయాన్-5 మిషన్‌లో భాగస్వామ్యం చేస్తుంది.కేవలం న్యూఢిల్లీ-టోక్యో సంబంధాలకే కాకుండా..భారత రాష్ట్రాల్లో, జపాన్ ప్రిఫెక్చర్లు మధ్య సహకారం పెంపొందించడానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వబడింది.

ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో టోయామా, తమిళనాడులో ఎహిమ్, ఉత్తరప్రదేశ్ లో యమనాషి, గుజరాత్ లో షిజువోకా ఇప్పటికే తమ కార్యకలాపాలను ప్రారంభించాయి. ఇరు దేశాలు సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లాలని అంగీకరించాయి. SMEలు, స్టార్టప్‌లకు అనుసంధానం కల్పించి కొత్త అవకాశాలను సృష్టించాలని మోడీ సూచించారు. గత రెండేళ్లలోనే 13 బిలియన్ డాలర్ల విలువైన 150 అవగాహన ఒప్పందాలు కుదిరాయి.
అరుదైన ఖనిజాల సరఫరా గొలుసు బలోపేతం చేయడంతో పాటుగా ..ప్రాసెసింగ్ టెక్నాలజీ, నిల్వ మరియు మైనింగ్‌లో సంయుక్త పెట్టుబడులు పెట్టనున్నారు. హైడ్రోజన్, అమ్మోనియా ప్రాజెక్టులకు ప్రోత్సాహం అందించనున్నారు. ఇక ఇరు దేశ ప్రధానులు తూర్పు, దక్షిణ చైనా సముద్రంలో చైనా సైనిక విస్తరణపై ఆందోళన వ్యక్తం చేశారు. నావిగేషన్ స్వేచ్ఛను కాపాడాలని పిలుపునిచ్చారు. ఉగ్రవాదంపై కూడా ఇరు దేశాలు గట్టిగా స్పందించాయి.
ఇతర ముఖ్య అంశాల విషయానికి వస్తే.. ఫుకుయోకాలో భారత కాన్సులేట్ ప్రారంభించనున్నారు. స్వేచ్ఛాయుత, శాంతియుత, సమృద్ధమైన ఇండో-పసిఫిక్ ప్రాంతం కోసం సహకారం అందించనున్నారు. రాబోయే క్వాడ్ సమ్మిట్‌లో జపాన్ ప్రధాని భారత్‌ను సందర్శించనున్నారు. ఏదేమైనా ఈ సమావేశం ద్వారా భారతదేశం-జపాన్ సంబంధాలు మరింత వ్యూహాత్మకంగా మారాయి. రక్షణ, టెక్నాలజీ, మౌలిక సదుపాయాలు, ఆర్థిక సహకారం వంటి రంగాల్లో దీర్ఘకాలిక రోడ్‌మ్యాప్ సిద్ధమైంది. 10 ట్రిలియన్ యెన్ పెట్టుబడులు భారత ఆర్థిక వ్యవస్థకు ప్రోత్సాహకరంగా ఉండటమే కాకుండా, ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వానికి కూడా కొత్త పునాది వేస్తాయి.
More From GoodReturns

మెంతికూరపై హాట్ డిబేట్..భారత్ వర్సెస్ అమెరికా రేట్లతో పోల్చిన మహిళ..నెటిజన్ల రియాక్షన్ ఏంటంటే..

LPG: ఏడేళ్ల తర్వాత భారత్‌కు ఇరాన్ ఆయిల్: ఈ వారమే రాబోతున్న భారీ షిప్మెంట్!

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..



Click it and Unblock the Notifications