జనవరి నెలలో కాస్త మందగించిన వృద్ధి రేటు, 3.7% పరిమితం

డిసెంబర్ 2021లో వివిధ రంగాల వృద్ధి రేటు 4.1 శాతం కాగా, జనవరి నాటికి ఇది స్వల్పంగా తగ్గి 3.7 శాతంగా నమోదయింది. మొత్తం ఎనిమిది ప్రధాన మౌలిక సదుపాయాల రంగాల నుండి భారత ఉత్పత్తి ఈ జనవరి నెలలో మహమ్మారి ఉత్పత్తిస్థాయిలను అధిగమించింది. 2021 ఇదే నెలలో వృద్ధి రేటు 1.3 శాతంగా ఉంది.

అధికారిక గణాంకాల ప్రకారం బొగ్గు, సహజ వాయువు, సిమెంట్ పరిశ్రమల పనితీరు సమీక్షా నెలలో కొంత మెరుగ్గా ఉంది. క్రూడాయిల్, ఎరువుల ఉత్పత్తిలో వృద్ధి కనిపించలేదు. పైగా క్షీణత నమోదయింది. బొగ్గు 8.2 శాతం, సహజ వాయువు 11.7 శాతం, రిఫైనరీ ప్రోడక్ట్స్ 3.7 శాతం, సిమెంట్ 13.6 శాతం వృద్ధి నమోదు చేశాయి. స్టీల్, ఎలక్ట్రిసిటీ రంగాలు దాదాపు స్థిరంగా ఉన్నాయి.

January core sector growth moderates to 3.7%

2021-22 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుండి జనవరి(2021 ఏప్రిల్ నుండి 2022 జనవరి వరకు) అంటే గత పది నెలల కాలంలో ఎనిమిది రంగాల వృద్ధి 11.6 శాతంగా నమోదు కాగా, 2020-21 ఇదే కాలంలో అసలు 8.6 శాతం క్షీణత నమోదయింది. వచ్చే రెండు వారాల్లో ఐఐపీ జనవరి గణాంకాలు రానున్నాయి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+