ఫారం 16 లేకుండా ఐటీఆర్ ఫైలింగ్: 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను శాఖ ఇప్పటికే ఐటీఆర్-1 నుండి ఐటీఆర్-7 వరకు అన్ని ఫామ్‌లను విడుదల చేసింది. మీరు మీ ఇంటి నుండే ఈ-ఫైలింగ్ పోర్టల్ ద్వారా ఐటీఆర్ ఫైల్ చేయవచ్చు. దీని కోసం కొన్ని డాకుమెంట్స్ అవసరం ఉంటుంది. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఫామ్ 16, బ్యాంక్ అకౌంట్ వివరాలు ఇంకా ఇతర ఇన్కమ్ ప్రూఫులు అవసరం. అయితే పాన్ ఇంకా ఆధార్ లింక్ చేయకుండా ఐటీఆర్ ఫెయిల్ చేయలేరు. జీతం పొందే ఉద్యోగులకి ఫామ్ 16 అందకపోతే ఇలాంటి పరిస్థితిలో ఐటీఆర్ ఫైల్ చేయవచ్చా ? ఫారం 16 లేకుండా ఐటీఆర్ కన్ఫర్మ్ చేయవచ్చా ? అసలు ఫామ్ 16 లేకుండా మీరు ఏ సందర్భాలలో ITR ఫైల్ చేయవచ్చో తెలుసా...

ఫామ్ 16 అంటే ఏమిటి : నిజానికి, ఫామ్ 16 అనేది ఒక TDS సర్టిఫికేట్. ఈ ఫామ్‌ను కంపెనీ ఉద్యోగులకు అందిస్తుంది. మీ జీతం నుండి TDS కట్ చేస్తే ఐటీఆర్ ఫెయిల్ చేయడానికి కంపెనీ మీకు ఫామ్ 16 ఇస్తుంది. ఈ ఫామ్‌లో మీ ఏడాది జీతం, పన్ను మినహాయింపులు, సెక్షన్ 80C, 80D వంటి మినహాయింపుల గురించి సమాచారం ఉంటుంది. మీకు ఫామ్ 16 రాకపోతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
కంపెనీ ఉద్యోగులకు ఫామ్ 16 ఎందుకు ఇవ్వదు: మీ ఆఫీస్ నుండి ఫామ్ 16 మీకు రాకపోతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, మీరు ఐటీఆర్ ఫైల్ చేయడానికి ఇతర అప్షన్స్ కూడా ఉన్నాయి. జీతం పన్ను పరిధిలోకి రాని అలాగే TDS కోత లేని ఉద్యోగులకు కంపెనీ ఫామ్ 16 ఇవ్వదు. అందుకే ఉద్యోగులు ఫామ్ 16 లేకుండానే ఐటీఆర్ అప్లయ్ చేయవచ్చు.
ఫామ్ 16 లేకుండా ఐటీఆర్ ఎలా ఫైల్ చేయాలి:
ఫామ్ 16 లేకుండా కూడా మీరు ఐటీఆర్ ఫైల్ చేయవచ్చు. దీని కోసం కొన్ని ముఖ్యమైన పేపర్స్ మాత్రమే అవసరం. వీటిలో అతి ముఖ్యమైన పేపర్ ఫామ్ 26AS. దీనిలో తగ్గించిన పన్ను పూర్తి వివరాలాతో ఉంటుంది, దీనిని టాక్స్ క్రెడిట్ స్టేట్‌మెంట్ అంటారు. ఫామ్ 26AS TDS ఇంకా TCSకు సంబంధించిన సమాచారంతో ఉంటుంది.
ఫారమ్ 26AS ని ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి:
*మొదట ఇ -ఫైలింగ్ పోర్టల్ వెబ్‌సైట్‌కి వెళ్లండి .
*ఇక్కడికి వెళ్ళిన తర్వాత మై అకౌంట్ అప్షన్ చూపిస్తుంది, దానిపై క్లిక్ చేయండి.
*ఇప్పుడు మీరు ఫార్మ్ 26AS లింక్‌ను చూస్తారు, దానిపై క్లిక్ చేయండి.
*ఆ తర్వాత అసెస్‌మెంట్ ఇయర్ సెలెక్ట్ చేసుకోని వ్యూ టైమ్‌పై క్లిక్ చేయండి.
*దీని తర్వాత ఫామ్ 26AS డౌన్‌లోడ్ చేసుకునే అప్షన్ చూపిస్తుంది.
*డౌన్‌లోడ్ బటన్‌పై క్లిక్ చేసిన తర్వాత, ఫామ్ 26AS డౌన్‌లోడ్ అవుతుంది.
ఫామ్ 26AS కాకుండా ఈ పేపర్స్ అవసరం: ఫామ్ 16 లేకుండా ఐటీఆర్ ఫైల్ చేయడానికి, ఫామ్ 26AS మాత్రమే కాకుండా జీతం స్లిప్ కూడా అవసరం. ముఖ్యంగా మార్చి నెల జీతం స్లిప్ అవసరం. దీనితో పాటు బ్యాంక్ స్టేట్‌మెంట్ కూడా అవసరం. పెట్టుబడి వివరాలు ఇంకా పన్ను మినహాయింపు కూడా అవసరం ఉంటుంది. దీని కోసం పేమెంట్ రిసిప్ట్ అవసరం అవుతుంది. మీరు ఎక్కడ పెట్టుబడి పెట్టినా పెట్టుబడి వివరాలు రిసిప్ట్ ఉంచుకోవడం అవసరం.


Click it and Unblock the Notifications